అన్నపూర్ణేశ్వరి.. ఆదుకోవమ్మా..
అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో మంగళవారం చేతిలో రసాన్నపాత్రతో కాశీ అన్నపూర్ణేశ్వరి భక్తులకు దర్శనం ఇచ్చింది. దేవీ నవరాత్రుల్లో భాగంగా పలు చోట్ల అమ్మవార్లను అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, ధనలక్షి్మగా వివిధ అలంకారాలు చేశారు. రూపం ఏదైనా అన్నింటికీ ఆధారం ఆ జగన్మాత. లోకాలను చల్లంగా చూసే ఆ లోకమాతను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.