special discounts
-
క్రెడిట్ కార్డ్: ఈ విధంగా ఉపయోగిస్తే బోలెడు బెనిఫిట్స్.. మీకు తెలుసా!
క్రెడిట్ కార్డ్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో వాడకం విస్తృతమవుతోంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో, ఆన్‌లైన్‌లోనూ కార్డులతో చెల్లింపులు చేసే వారు పెరుగుతున్నారు. దీంతో ఇదొక ప్రధాన చెల్లింపు సాధనంగా మారింది. క్రమశిక్షణగా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా 45–50 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ ప్రయోజనాన్ని అందుకోవచ్చు. క్రెడిట్‌కార్డ్‌ల విషయంలో ఉన్న ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఎస్బీఐ కార్డ్ కొన్ని సూచనలు చేసింది. ఆలస్య చెల్లింపులు వద్దు క్రెడిట్ కార్డు బిల్లులో పేర్కొన్న గడువులోపు చెల్లింపులను చేయడం చాలా ముఖ్యం. సకాలంలో చెల్లించడమనేది వ్యక్తి యొక్క క్రెడిట్ ప్రొఫైల్‌ను ప్రభావితం చస్తుంది. క్రెడిట్ స్కోర్‌ను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో వ్యక్తి రుణ అర్హతపై సానుకూల ప్రభావం చూపుతుంది. సకాలంలో చెల్లించకపోతే ఆలస్యపు రుసుములు భరించాల్సి వస్తుంది. స్పెషల్ డిస్కౌంట్లు క్రెడిట్ కార్డులు కొన్ని కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి. ఈ డిస్కౌంట్లను తరచుగా వివిధ జాతీయ మరియు స్థానిక బ్రాండ్ల భాగస్వామ్యంతో అందిస్తాయి. భాగస్వామ్య స్వరూపం మరియు పార్ట్నర్షిప్ బ్రాండ్‌ని బట్టి, ఆన్లైన్ కొనుగోళ్లు లేదా స్థానిక స్టోర్ కొనుగోళ్లు లేదా ఈ రెండింటిలో చేసే వాటిపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఎస్బీఐ కార్డ్ వంటి కంపెనీలు అమెజాన్, ఫిప్కార్ట్ వంటి వివిధ ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలతో ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. కనుక కార్డ్‌ల వినియోగం ద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. రివార్డ్ ప్రోగ్రామ్‌లు క్రెడిట్ కార్డులు అందించే అత్యంత ఆకర్షణీయమైన ప్రయోజనాల్లో రివార్డ్స్ ప్రోగ్రామ్ ఒకటి. ఉచిత ట్రావెల్ టికెట్ల నుంచి సినిమా వోచర్లు, షాపింగ్ వోచర్ల వరకు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. ట్రావెల్ ప్రయోజనాలు క్రెడిట్ కార్డు రకాన్ని బట్టి ప్రయాణ టికెట్ కొనుగోళ్లపై రివార్డులు, హోటల్లో విడిది, డైనింగ్లపై డిస్కౌంట్లు లభిస్తాయి. ప్రయాణికులకు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఆర్సీటీసీ ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్‌ని ఉపయోగించి కార్డు మెంబర్షిప్ ఉన్న సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు రెండు కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్‌ల సదుపాయాన్ని ఆస్వాదించవచ్చు. యాత్రా డాట్ కామ్, మేక్ మై ట్రిప్ వంటి ట్రావెల్ వెబ్సైట్ల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డులు డిస్కౌంట్లు మరియు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మోసాల పట్ల అవగాహన క్రెడిట్ కార్డ్‌పై కనిపించే నంబర్, వెనుక భాగంలో ఉండే మూడు అక్షరాల సీవీవీ, గడువు తేదీ వంటి సున్నితమైన కార్డు వివరాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. ఎవరితోనూ ఎలాంటి పరిస్థితిలోనూ పంచుకోరాదు. బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు కంపెనీలేవీ కస్టమర్ల నుంచి ఈ వివరాలను అడగవు. విశ్వసనీయమైన మరియు ప్రామాణికమైన వెబ్సైట్లలో మాత్రమే షాపింగ్ చేయండి. స్టోర్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, మీ క్రెడిట్ కార్డ్‌ని మీకు కనపడేలా చూసుకోండి. మీ ముందే మెషీన్లో కార్డుని స్వైప్/డిప్ చేయాలని అడగండి. మెషీన్లో మీ పాస్‌వర్డ్‌ను నమోదు చేసే సమయంలో ఎవరూ చూడకుండా జాగ్రత్త వహించండి. ఇది మీ కార్డు దుర్వినియోగం అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
వారికి మహీంద్రా స్పెషల్ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: పండుగ సీజన్లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రభుత్వ ఉద్యోగులకోసం ప్రత్యేకమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇప్పటికే ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తున్న సంస్థ తాజాగా కార్ల కొనుగోలుపై వీరికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సర్కార్ 2.0 ప్రోగ్రాం కింద నగదు తగ్గింపులు, సులభమైన ఈఎంఐ, తక్కువ వడ్డీ రేట్లు లాంటి ఆఫర్లను అందిస్తోంది. మహీంద్రా కారును కొనుగోలు చేసే విధానాన్ని మరింత సులభతరం చేసేలా తాజా స్పెషల్ డీల్స్‌ను కంపెనీ ప్రకటించింది. యుటిలీటీ వెహికల్ కోనుగోలపై లక్ష రూపాయలకు గాను రూ. 799వద్ద సులభ ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఇందుకోసం వివిధ బ్యాంకులతో తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని, మరిన్ని వివరాలకు కొనుగోలుదారులు దగ్గరలోని తమ డీలర్లను సంప్రదించాలని కంపెనీ తెలిపింది. కాంటాక్ట్‌లెస్ చెల్లింపు సౌలభ్యాన్ని కూడా అందబాటులో ఉంచామని ఎం అండ్ ఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్లు ఈ ఆఫర్ కింద ఎం అండ్ ఎం ప్రభుత్వ ఉద్యోగులకు రూ .11,500 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. అంతేకాదు కారు లోనును ముందస్తుగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. వడ్డీరేట్లు 7.25 శాతం నుంచి ప్రారంభం. -
అందాల లోకంలో విహరిద్దామా !
సాక్షి, విశాఖపట్నం: శతాబ్దాల చరిత్రకు చిరునామాగా, సంస్కృతికి చిహ్నంగా వెలుగొందుతోంది విశాఖ జిల్లా. రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా విశాఖ ఖ్యాతినార్జించింది. అయితే కోవిడ్–19 కారణంగా జిల్లాలోని పర్యాటక రంగం నాలుగు నెలలుగా బోసిపోయింది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి పూర్తిగా కుదేలైంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం అన్ లాక్డౌన్లో ఇచ్చిన సడలింపులతో సందర్శకులను ఆహ్వానం పలికేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. కళ తప్పిన పర్యాటకంతో భారీగా నష్టం వాటిల్లడంతో.. దాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక రాయితీలు అమలు చేస్తూ.. సందర్శకులను ఆకర్షిస్తోంది. విశాఖ మహా నగరంతో పాటు మన్యంలోనూ టూరిజం శాఖకు చెందిన హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌లున్నాయి. టూరిస్టులు ఎక్కువగా వచ్చేలా చేసేందుకు కొత్త కొత్త రాయితీలను పర్యాటక శాఖ ప్రకటించింది. ఏసీ, నాన్ ఏసీ, లగ్జరీ, వీఐపీ, స్టాండర్డ్స్ పేరుతో రిసార్ట్స్‌ల్లోనూ, హోటళ్లలోనూ టూరిజం శాఖకు చెందిన గదులున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సందర్శకుల తాకిడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తరుణంలో డిస్కౌంట్లతో టూరిస్టులను ఆహ్వానించేందుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) పరిధిలోని హోటళ్లలో బస చేసే వారికి 3 నెలల పాటు ఏకంగా 35 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అరకు రిసార్ట్స్ రూ.700 నుంచి రూ.1250 వరకు తగ్గింపు జిల్లాలో రుషికొండ, అరకు, అనంతగిరి, లంబసింగి, టైడాల్లో ఏపీటీడీసీకి చెందిన రిసార్ట్స్‌లు, హోటల్స్ ఉన్నాయి. ఏపీటీడీసీ అమలు చేస్తున్న 35 శాతం డిస్కౌంట్‌తో ఆయా హోటల్స్‌లో గదుల స్థాయిని బట్టి రూ.700 నుంచి రూ.1,250 వరకు రాయితీ పొందే అవకాశాన్ని పర్యాటకులు సొంతం చేసుకోవచ్చు. లగ్జరీ రూమ్- రూ.1050 నుంచి రూ.1225 ఎగ్జిక్యూటివ్ రూమ్-రూ.910 నుంచి రూ.1050 డీలక్స్ రూమ్ -రూ.840 నుంచి రూ.980 స్టాండర్డ్ ఏసీ రూమ్-రూ.700 నుంచి రూ.805 అరకులోయలోని హరితా రెస్టారెంట్ పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు లాక్డౌన్ సమయంలో టూరిజం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ మొదలవ్వడంతో.. సందర్శకులను ఆకట్టుకునేందుకు రాయితీలు ప్రకటించాం. పర్యాటకుల భద్రతకు అన్ని రిసార్ట్స్‌లు, రెస్టారెంట్లు, హోటల్స్‌లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. శానిటైజేషన్ పూర్తి చేశాం. గదుల్లోనూ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాం. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నాం. – ప్రసాదరెడ్డి, టూరిజం శాఖ విశాఖ డివిజనల్ మేనేజర్ -
ఫ్యాన్స్‌కు సల్మాన్ బర్త్‌డే గిఫ్ట్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ శాంతాక్లాజ్‌గా మారిపోయారు. ఎవరైనా బర్త్‌డేకి బహుమతులు పుచ్చుకుంటారు. కానీ ఈ కండలవీరుడు తన 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. అయితే ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా? సల్మాన్‌ఖాన్ సొంత దుస్తుల బ్రాండు 'బీయింగ్ హ్యుమన్' పై స్పెషల్ డిస్కౌంట్లు. బీయింగ్ హ్యుమన్ ఫ్లాట్‌పై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన సర్ఫ్రైజ్ గిఫ్ట్‌ను రివీల్ చేశాడు. ప్రత్యేకంగా ఆన్లైన్ మింత్రాలో కూడా ఈ డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపాడు. 'గెట్ రెడీ ఫర్ బిగ్ బర్త్ డే సర్ఫ్రైజ్' అంటూ అభిమానులకు అంతకముందే సల్లూభాయ్ ట్వీట్ చేశాడు. ఈ సర్‌ఫ్రైజ్‌ను ట్విట్టర్ ద్వారా తెలిపేశాడు. సామాజిక సేవలో భాగంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన సల్లూభాయ్, దీన్ని సేవలను మరింత విస్తరించడానికి ఈ బ్రాండు పేరుతోనే జువెల్లరీ రంగంలోకి సల్మాన్ అడుగుపెడుతున్న్డు. బర్త్‌డే సందర్భంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్, స్టైయిల్ క్వాటియంట్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో బీయింగ్ హ్యుమన్ ఫ్యాషన్ జువెల్లరీని లాంచ్ చేస్తున్నాడు. Celebrate my birthday with Flat 51% Off at @bebeinghuman stores and exclusively online @Myntra https://t.co/3Uc5Wgncbf #2712 pic.twitter.com/mQsk7kU4Sr — Salman Khan (@BeingSalmanKhan) December 26, 2016 -
మగువలూ.. మీకోసమే..!
న్యూఢిల్లీ/ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (శనివారం) సందర్భంగా వివిధ కంపెనీలు వివిధ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. టాటా మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, గూగుల్‌తో పాటు దేశీయ విమానయాన సంస్థలు మహిళల కోసం ఆకర్షణీయ ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. జెట్.. డిస్కౌంట్ ఆఫర్ మహిళలకు విమాన టికెట్లపై డిస్కౌంట్లనందిస్తోంది. ఈ నెల 8 నుంచి మే 8 మధ్య బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ టికెట్ల వ్యాలిడిటీ 11 నెలలు. ఈ ఆఫర్లో భాగంగా అంతర్జాతీయ రూట్లలో బేసిక్ చార్జీల్లో 10% డిస్కౌంట్ పొందొచ్చు. దేశీ రూట్లలోనైతే ఫ్యూయల్ సర్‌చార్జీపై 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ జెట్ ఎయిర్వేస్, జెట్ కనెక్ట్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. కాగా గో ఎయిర్ కూడా మహిళా ప్రయాణికుల కోసం రూ.999కే బిజినెస్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే స్కీమ్‌ను ఆఫర్ చేయడం తెలిసిందే. ఎయిరిండియా ‘మహిళా’ ఫ్లైట్లు... మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో అంతా మహిళా సిబ్బంది ఉండే విమానాలను ఈ సంస్థ నడిపింది. ఈ ఏడా ది కూడా అలా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. విమానాలు నడపడం వంటి కష్టసాధ్యమైన పనులను చేయడంలో మహిళలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరనే సందేశాన్నివ్వడం కోసం ఇలా చేస్తున్నామని ఎయిరిండియా పేర్కొంది. గూగుల్... రూ.6 కోట్లు టెక్నాలజీ రంగంలో మరింత మంది మహిళలకు ఆసక్తి కలిగించేందుకు ఇంటర్నెట్ సెర్చిం జన్ దిగ్గజం గూగుల్ నడుంబిగిస్తోంది. ఇందుకోసం రూ. 6 కోట్ల వరకూ పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘షార్ప్ 40 ఫార్వార్డ్’ పేరుతో గూగుల్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 40 సంస్థలను ఎంపిక చేసి, మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. భారత్ నుంచి నాస్కామ్ 10,000 స్టార్టప్స్, జాగృతి యాత్ర సంస్థలు ఎంపికయ్యాయి. న్యూ ఇండియా ‘ఆశా కిరణ్’ ఆరోగ్య బీమా... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ ‘ఆశా కిరణ్’ పేరుతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం అమ్మాయిలు పిల్లలుగా ఉన్న కుటుంబాల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి పిల్లల పేరుమీద పాలసీలు తీసుకుంటే ప్రీమియంలో 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు న్యూ ఇండియా సీఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు. తల్లిదండ్రులకు ఏమైనా ప్రమాదం జరిగితే బీమా మొత్తాన్ని పిల్లల పేరు మీద డిపాజిట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళా బ్యాంక్- టాటా రుణాలు మహిళా వినియోగదారులకు వాహన రుణాలివ్వడం కోసం భారతీయ మహిళా బ్యాంక్‌తో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అర్హులైన మహిళా వినియోగదారులకు టాటా కార్లు, యుటిలిటి వాహనాల కొనుగోళ్ల కోసం భారతీయ మహిళా బ్యాంక్ 10.5 శాతం వడ్డీరేటుకే రుణాలందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. రుణ కాలపరిమితి ఏడేళ్ల వరకూ ఉంటుందని, వాహనం విలువలో గరిష్ట మొత్తం బ్యాంక్ రుణంగా అందించగలదని, దేశవ్యాప్తంగా ఉన్న 12 భారతీయ మహిళా బ్యాంక్ బ్రాంచీల్లో ఈ రుణాలు అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రస్తుతం తమ మొత్తం వినియోగదారుల్లో మహిళల సంఖ్య 11 శాతంగా ఉందని, ఈ తాజా ఒప్పందంతో ఈ సంఖ్య మరింతగా పెరగగలదని టాటా మోటార్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం బ్యాంక్‌కు, టాటా మోటార్స్ కంపెనీకి కూడా ప్రయోజనకరమేనని భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. తక్కువ రేట్లకే ముత్తూట్ రుణాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తక్కువ రేట్లకే రుణాలిస్తామని ముత్తూట్ ఫైనాన్స్ పేర్కొంది. బంగారం తనఖాగా ఏడాది కాలానికి రూ.50 వేల లోపు రుణాలను 12% వడ్డీకే అందిస్తామని పేర్కొంది. సాధారణంగా రూ.50 వేల లోపు రుణాలకు 14% వడ్డీరేటు వసూలు చేస్తామని, మహిళా దినోత్సవం సందర్భంగా 2% తక్కువకే ఈ రుణాలిస్తున్నట్లు పేర్కొంది. బంగారం విలువలో 71% వరకూ రుణమిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా తమ 3,829 బ్రాంచీల్లో ఈ నెల 15 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.