special food
-
థ్యాంక్స్ గివింగ్ : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పెషల్ మీల్
అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకునేందుకు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్‌తో థ్యాంక్స్ గివింగ్ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సునీతా విలియమ్స్ సందేశంతో కూడిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది.“ఇక్కడ ఉన్న మా సిబ్బంది భూమిపై ఉన్న మా స్నేహితులు,కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నారు” అని విలియమ్స్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నాసా తమకు బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను అందించిందని వ్యోమగాములు పంచుకున్నారు. ప్రతీ ఏడాది నవంబరు నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు."We have much to be thankful for."From the @Space_Station, our crew of @NASA_Astronauts share their #Thanksgiving greetings—and show off the menu for their holiday meal. pic.twitter.com/j8YUVy6Lzf— NASA (@NASA) November 27, 2024 కాగా 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు సునీత. వారిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
Bathukamma 2024 నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ స్పెషల్
తెలంగాణా పల్లెపల్లెల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. రంగు రంగుల పూలతో అత్యంత సుందరంగా బతుకమ్మలను పేర్చి తెలంగాణా ఆడబిడ్డలు సంప్రదాయ దుస్తుల్లో గౌరమ్మను కొలుస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం బతుకమ్మ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో పూల పండుగను జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుతారు. నాలుగో (అక్టోబరు 5,శనివారం) రోజు బతుకమ్మ ‘నానేబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. గౌరమ్మను తయారు చేసి, గుమ్మడి తంగేడు, బంతి, గునుగు లాంటి రకరకాల పూలతో అలంకరిస్తారు. గౌరమ్మకు ఈరోజు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతోకలిపి ముద్దలు చేసి పెడతారు. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని ఆనందంగా అందరూ పంచుకుని తింటారు.కాగా తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. -
పిండివంటలతో హ్యాపీహ్యపీ సంక్రాంతి (ఫోటోలు)
-
అంగన్వాడీల్లోని చిన్నారులకు గుడ్‌న్యూస్.. స్పెషల్ స్నాక్స్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లోని చిన్నారులకు అత్యంత మెరుగైన పౌష్టిక విలువలున్న చిరుతిళ్లు (స్నాక్స్) అందించేందుకు తెలంగాణ ఫుడ్స్ విభాగంరంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు చిరుతిళ్లు అందిస్తున్నప్పటికీ ఇకపై సరికొత్త సాంకేతికతతో ఈ ఆహారాన్ని తయారు చేసి అందించనుంది. దీనికోసం తెలంగాణ ఫుడ్స్ విభాగం ప్రత్యేకంగా అత్యాధునిక స్నాక్‌ఫుడ్ యూనిట్ (ఎక్స్‌ట్రూడర్ యూనిట్)ను స్థాపించింది. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.42.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఈ కేంద్రాన్ని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రారంభించనున్నారు. అమెరికా సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో గంటకు సగటున 4 మెట్రిక్ టన్నుల స్నాక్స్ తయారవుతాయి. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నెలకు సగటున 300 మెట్రిక్ టన్నుల చిరుతిళ్లను సరఫరా చేస్తారు. దీన్ని కేవలం నాలుగైదు రోజుల్లోనే తయారు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర డిమాండ్‌ను తీర్చిన తర్వాత పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రకు సైతం చిరుతిళ్లను ఎగుమతి చేసే దిశగా తెలంగాణ ఫుడ్స్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఫోర్టిఫైడ్ రైస్ కూడా... కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్‌ట్రూడర్ యూనిట్లో స్నాక్స్ మాత్రమే కాకుండా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం తయారు చేయొచ్చు. సాధారణ బియ్యానికి మరిన్ని విటమిన్లు, పోషకాలను కలిపి తయారు చేసేవే ఫోరి్టఫైడ్ బియ్యం. పిల్లలకు సమృద్ధిగా పోషకాలు అందించే క్రమంలో వీటితో కూడిన ఆహారాన్ని అందించే అంశాన్ని పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చే బియ్యానికి బదులుగా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని అందిస్తే మరింత పోషక విలువలతో పిల్లలు ఎదుగుతారని భావించిన అధికారులు ఈ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మార్కెట్లో లభించే సాధారణ బియ్యం ధరకు రెట్టింపు ధరలో ఫోరి్టఫైడ్ బియ్యం లభిస్తాయి. దీంతో ఈ ఎక్స్‌ట్రూడర్ యూనిట్ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. -
రుచికరమైన షడ్రుచుల ఉగాది
పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది. వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ.. ఉగాది పచ్చడి కావలసినవి: నీళ్లు – తగినన్ని; చింత పండు – తగినంత; చెరకు ముక్కలు – ఒక కప్పుడు; అరటి పండు – 2 (ముక్కలు చేయాలి); బెల్లం తరుగు – నీళ్లకు తగినన్ని; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (ముక్కలు చేయాలి);ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); మిరియాలు – 6 (పొడి చేయాలి) తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, పల్చ గా రసం తీసుకోవాలి ►ఒక గిన్నెలో చింతపండు రసం, తగినన్ని నీళ్లు, బెల్లం తరు గు, ఉప్పు వేసి గరిటెతో కలియబెట్టాలి ►శుభ్రం చేసి నీళ్లలో కడిగిన వేప పువ్వు, అరటి పండు ముక్కలు వేసి మరోమారు కలియబెట్టాలి ►సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి, చివరగా మిరియాల పొడి వేసి కలిపి, నివేదన చేసి, చిన్నచిన్న గ్లాసులలో ప్రసాదంగా అందించాలి. బెల్లం బీట్రూట్ అరటిపండు కేసరి కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1; బీట్రూట్ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారీ: ►ముందుగా బీట్ రూట్ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి. ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి ►అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి ►పాలు జత చేసి బాగా కలిశాక, బీట్ రూట్ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి) ►చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. అయ్యంగారి పులిహోర కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు; పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత తయారీ: ►రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు) ►ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి ►చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి ►మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ►మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ►ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ►ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పప్పు కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను తయారీ ►ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి ►మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి ►చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి ►వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను తయారీ: ►వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ►బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి ►వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి ►రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. సేకరణ: పురాణపండ వైజయంతి -
వెదురు కంజి టేస్టే వేరబ్బా.!
ముంచంగిపుట్టు(అరకు): కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి. కానీ మన్యంలో లభించే వెదురు నుంచి తీసిన చిగురు కూర రుచి వేరు అంటున్నారు గిరిజనులు. దీనిని వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. వెదురు కంజి కూర వాహ్వా.. అంటూ లొట్టలేసుకుంటున్నారు. ప్రస్తుతం మన్యంలోని మండల కేంద్రాల్లో హాట్ కేకుల్లా వెదురు కంజి అమ్మకాలు జరుగుతున్నాయి. అటవీ కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్ర పరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని గిరిజనులు మండల కేంద్రాలకు తెచ్చి వాటాల రూపంలో రూ.20 నుంచి రూ.40 లు వరకు విక్రయిస్తారు. వెదురు కంజిల వాటా రూ.20, అమ్మకానికి సిద్ధంగా వెదురు కంజి వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారీకి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఓ రకంగా, ఎండబెట్టి మరో విధంగా కూర తయారీకి వాడతారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కూర తయారు చేసుకోవాలి. ఎండబెడితే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరను తయారు చేసుకుని చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజిని బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తాగితే శరీరానికి మంచి చలువ చేస్తుందని గిరిజనులు చెబుతున్నారు. మధుమేహం, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేదపరంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది. కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. గాయం మానేందుకు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు.మారుమూల గిరిజనులు పాము, తేలు కాటుకు ఔషధంగా సైతం దీనిని వినియోగిస్తున్నారు. -
చిదంబరానికి ఇంటి భోజనం నో
న్యూఢిల్లీ: ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి ప్రత్యేక ఆహారం ఇవ్వడం కుదరదనీ, జైలులో అందరికీ ఒకే రకమైన ఆహారం ఉంటుందనీ హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణలో చిదంబరంకి ఇంటి నుంచి తెప్పించిన ఆహారాన్ని జైలులో అనుమతించాల్సిందిగా ఆయన తరఫున కపిలి సిబాల్ కోర్టుని కోరడంతో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ‘‘జైలు లో అందరికీ ఒకే రకమైన ఆహారం అందుబాటులో ఉంటుంది’’అని తేల్చి చెప్పారు. అయితే తన క్లయింట్ 74 ఏళ్ళ వయస్సువారనీ, అందుకే ఇంటిభోజనాన్ని అనుమతించాలనీ సిబల్ వాదించగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలుగజేసుకుంటూ ‘‘ఓమ్‌ప్రకాష్ చౌతాలా ఇంకా ఎక్కువ(84 ఏళ్ళు) వయస్సువారు, రాజకీయ ఖైదీ కూడా అయినప్పటికీ ఆయనకు జైలులో సాధారణ భోజనమే అందుతోంది. రాజ్యం ఎవ్వరి పట్లా భేదం పాటించదు’’ అని వ్యాఖ్యానించారు. -
ఇంట్లో కంటే జైలులోనే సకల సౌకర్యాలు
చెన్నై : టీవీలు, బెడ్స్, మొబైల్ఫోన్లు, రుచికరమైన ఆహారం .. ఇవన్నీ ఇంట్లోనే అనుకుంటున్నారా? జైలులో కూడా అనుభవించవచ్చట. చైన్నైలోని పుజ్హల్ కేంద్ర కారాగార ఖైదీలు ఇంట్లో కంటే జైలులోనే ఎక్కువ సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పుజ్హల్ కేంద్ర కారాగారానికి సంబంధించి ఫొటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. జైలు అథారిటీలు ఓ ఖైదీ వాడుతున్న ఫోన్‌ను సీజ్ చేయగా... ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. జైలులో ఉన్న తోటి ఖైదీలకు ఈ సౌకర్యాలు కల్పించడంతో పాటు, దానికింద పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జైలులో ఉన్న ఖైదీలు తమ ఇంట్లో ఉండే మాదిరి, సాధారణ దుస్తులు ధరించడంతో పాటు, రుచికరమైన భోజనం, సౌకర్యవంతమైన బెడ్స్, ఎలక్ట్రిక్ కుక్కర్లు, యూపీఎస్ బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నట్లు ఈ ఫోటోల ద్వారా తెలిసింది. సెల్ఫోన్లు మినహాయించి ‘ఏ’ క్లాస్ కేటగిరీ ఖైదీలకు ఆ సౌకర్యాలన్నీ అందిస్తారని జైలు అధికారులు తెలుపుతున్నారు. అయితే జైలులో సెల్‌ఫోన్ వాడకంపై వివాదాస్పదమైంది. జైలులో సెల్ఫోన్ల వాడకం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ‘అందరికి పడకలు ఎప్పుడో అందించాం. ఒక్కో బ్లాక్‌కు ఓ టీవీ కూడా ఉంది. ఇవేవీ అసాధారణం కాదు. కానీ, సెల్ఫోన్లు వాడటమే నిబంధనలకు విరుద్ధం. గత వారం ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇవి లోపలికి ఎలా వచ్చాయో అన్నదానిపై దృష్టి సారించాం. దీనిలో ఏ అధికారి ప్రమేయమైనా ఉందని తేలితే తప్పక చర్య తీసుకుంటాం’ అని ఏడీజీపీ అశుతోష్ శుక్లా వెల్లడించారు. పండగ సమయాల్లో ప్రత్యేక ఆహారం తినడానికి అనుమతి ఉందని, ఏ క్లాస్ ఖైదీలకు వాటిపై నిషేధం లేదని అధికారులు వెల్లడించారు. -
రంగుల కేళీకి రెడీనా!
కలర్‌ఫుల్ కేళీ... హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు నగరంలోని రిసార్ట్స్, క్లబ్‌లు, స్టార్ హోటళ్లు ముస్తాబవుతున్నాయి. బంధువులు, స్నేహితులతో మస్తుగా ఎంజాయ్ చేసి ఫెస్ట్‌ను మెమరబుల్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈజిప్ట్ స్టైల్: హోలీని ఇళ్లలో, వీధుల్లో స్నేహితులతో కలిసి చేసుకునే అలవాటు ఉన్న మనకు కొంగొత్త తరహాలో రంగుల ఆటను చూపించనుంది బెంగళూరు హైవే కొత్తూరు సమీపంలోని పెప్పర్స్ పోర్టు రిసార్ట్. బాలీవుడ్ మ్యూజిక్కు యువత స్విమ్మింగ్ పూల్‌లోనే స్టెప్పులేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫుల్ జోష్ కోసం డీజేల మ్యూజిక్‌తో కలర్‌ఫుల్ రెయిన్ డ్యాన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈజిప్టులోనే హోలీ చేసుకున్నామా అనే ఫీలింగ్ కలిగించేలా... ఆ దేశంలో ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆర్గానిక్ రంగుల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల ఆటని అస్వాదించడంతో పాటు స్పెషల్ ఫుడ్‌ని కూడా ఆఫర్ చేస్తోంది. పుడ్ భళా: రంగుల ఆటల్లో మునిగితేలే నగరవాసులకు హోలీ రోజున పసందైన వంటకాలను వండి వార్చనున్నాయి హోటళ్లు. సంప్రదాయంతో పాటు, స్పైసీ రుచులను ఆస్వాదించాలనుకొనేవారు బేగంపేట్‌లోని హోటల్ తాజ్ వివంతాలో ఏర్పాటు చేసే ‘ఎక్స్టెన్సివ్ బఫెట్’కు వెళ్లవచ్చు. అలాగే హైటెక్స్‌లోని నోవాటెల్, ట్రైడెంట్, లెమన్ ట్రీ, బెస్ట్ వెస్టర్న్ అశోకా హోటల్స్‌లో కూడా స్పెషల్స్ టేస్ట్ చేసేయవచ్చు. హోలీ పార్టీ: పార్టీ మూడ్‌ను లోడ్స్ ఆఫ్ ఫన్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి సోమాజిగూడ పార్క్ హోటల్లోని ఆక్వా సరికొత్త థీమ్ పార్టీ ‘పిటార్స్ హోలీ హైదరాబాద్ 2015’ అరేంజ్ చేస్తోంది. ఆర్గానిక్ కలర్స్‌తో రంగులతో ఆడేసుకొని... డీజే మ్యూజిక్కు డ్యాన్స్ ఫ్లోర్‌ను అదరగొట్టేసి... ఆపై రెయిన్ డ్యాన్సులతో తడిసి ముద్దయ్యి... ఓ టేస్టీ ఫుడ్‌తో సెలబ్రేట్ చేసుకొనే చాన్స్ ఇది. సో... గెట్ రెడీ ఫర్ కలర్‌ఫుల్ ఈవెంట్! - వీఎస్