special leave
-
ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ మరో తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సర్కారు మరో తీపికబురు చెప్పింది. 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సుల ఆధారంగా పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్ సింగ్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ జీఓ ప్రకారం ఉద్యోగులకు లభించే ప్రయోజనాలివీ.. ► పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చు. అలాగే, ఈ సెలవులను ఇతర సెలవులతో కలిపి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకూ కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే, దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవేవీ వర్తించవు. ► పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది. ► వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ సెలవులను పొందవచ్చు. హైరిస్క్ వార్డుల్లో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. ► ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బేసిక్ పే లిమిట్ రూ.35,570గా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.11,560 నుంచి, రూ.17,780 వరకూ, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయిస్ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రతినెలా పొందవచ్చు. అలాగే, ఆర్జిత సెలవులు, సగం జీతం సెలవులు ముగిసిన తరువాత కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవులు తీసుకోవచ్చు. -
‘సకలజనుల సమ్మె’ను సెలవుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేపట్టిన సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. సింగరేణి, ట్రాన్స్కోలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల సమ్మెకాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం ఆర్టీసీకి ఎందుకు వర్తింపజేయలేదని ఆ సంఘం నేతలు బాబు, రాజిరెడ్డి ప్రశ్నిం చారు. ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని శనివారం ఇక్కడ జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ నెల ఐదో తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 30 వేల మంది సంతకాలు చేశారని, దీన్ని 25వ తేదీ వరకు పొడిగిస్తున్నామని వెల్లడించారు. డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెండి: ఎన్ఎంయూ డీజిల్‌ను జీఎస్టీ (12 శాతం పన్ను) పరిధిలోకి తేవటం వల్ల దాని ధర భారీగా తగ్గించి ప్రజలకు మేలు చేసే వెసులుబాటు కలుగుతుందని ఆర్టీసీ ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. ముఖ్యంగా డీజిల్ ధర తగ్గి ఆర్టీసీకి సాలీనా రూ.500 కోట్ల మేర భారం తగ్గుతుందని ఆ సంఘం నేతలు నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, నరేందర్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. -
9న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
అనంతపురం అర్బన్ : ఈ నెల 9వ తేదీ పోలింగ్ ఉన్నందున ఓటుహక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు(స్పెషల్ కాజ్యువల్ లీవు) మంజూరు చేస్తామని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో మల్లీశ్వరిదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సమయం ఇదే.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. ఓటు ఎలా వేయాలి అనే అంశాన్ని తెలియజేస్తూ ఎన్నికల కమిష¯ŒS జారీ చేసిన ఫ్లెక్సీలను ఎంపీడీఓ, తహశీల్దారు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లో ప్రదర్శనకు ఉంచామన్నారు. -
ప్రత్యేక సెలవులుగా సకలజనుల సమ్మెకాలం
* హెల్త్కార్డులపైనా నిర్ణయం * మొదట రాష్ట్ర పీఆర్సీ కావాలి ఆ తరువాతే కేంద్ర పీఆర్సీ * ముఖ్యమంత్రికి ఉద్యోగసంఘాల నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు 2010లో చేసిన 42 రోజుల సకలజనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు, సమ్మె తరువాత రిటైరయిన దాదాపు 40 వేల మంది పెన్షనర్లకు 42 రోజుల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అంతే కాకుండా హెల్త్ కార్డులపైనా సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక కేంద్ర ప్రభుత్వ 7వ పీఆర్సీ 2016 నుంచి అమల్లోకి రానున్నందున అప్పటి వరకు రాష్ట్ర 10వ పీఆర్సీ సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. తమకు సెంట్రల్ పీఆర్సీ కాకుండా సెంట్రల్ పీఆర్సీలోని వేతనాలకు సమాన వేతనాలు ఇస్తూ రాష్ట్ర పీఆర్సీనే అమలు చేయాలని వారు కోరుతున్నారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, పి.మధుసూదన్‌రెడ్డి, విఠల్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదిరులు కలసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రత్యేకరాష్ట్రం కోసం 2010 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు తెలంగాణ ఉద్యోగులు చేసిన 42 రోజులు సమ్మెకాలాన్ని గతప్రభుత్వం ఆర్జితసెలవులుగా పరిగణించింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు 42 రోజుల ఈఎల్స్‌ను కోల్పోయారు. హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద అమ్ముకునేందుకు వీలు కలిగిన ఈ 42 రోజులను ఈఎల్స్ కింద వినియోగించినట్టు పేర్కొని కోతపెట్టడంతో వాటిని పెన్షనర్లు అమ్ముకునే వీలు లేకపోయింది. దీంతో సకలజనుల సమ్మెను స్పెషల్ లీవ్‌గా ప్రభుత్వం మంజూరు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కాగా, ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలకు అనుగుణంగా హెల్త్‌కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మొదట పదో పీఆర్సీ అమలుకు విజ్ఞప్తి.. ముఖ్యమంత్రి కేంద్ర పీఆర్సీని అమలు చేస్తామని చెబుతుంటే, ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం పదోవేతన సంఘం సిఫారసులనే అమలు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే కేంద్ర పీఆర్సీ వేతనాలకోసం 2016 వరకు ఆగాల్సిందే. ఉద్యోగులు అప్పటివరకు ఆగే పరిస్థితి లేదు. అందుకే రాష్ట్ర పీఆర్సీ సిఫారసులను వెంటనే అమల్లోకి తేవాలని కోరుతున్నారు.