special officials
-
కొత్త మునిసిపాలిటీలకు ప్రత్యేక అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన 5 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ తాడిగడప (కృష్ణా)కు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, అల్లూరు నగర పంచాయతీ (నెల్లూరు జిల్లా)కు కావలి మునిసిపల్ కమిషనర్, బి.కొత్తకోట (చిత్తూరు)కు రాయచోటి మునిసిపల్ కమిషనర్, చింతలపూడి (పశ్చిమ గోదావరి)కి ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యదర్శి, పొదిలి (ప్రకాశం)కు ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. -
ఏపీ దిశ చట్టం: ఇద్దరు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకవచ్చిన చారిత్రాత్మక దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా దిశ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. స్త్రీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించి దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ సూచించిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. -
ఎన్నికలా.. ప్రత్యేకాధికారులా?
సాక్షి, హైదరాబాద్: గడువులోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా? అనే విషయంపై వారంలోగా సమా ధానమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. విచారణ ను వారం రోజులకు వాయిదా వేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు జూలై 2తో ముగుస్తుందని, వాటికి వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ప్రక్రియ చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాల్ని మంగళవారం హైకోర్టు విచారించింది. సమయం కావాలి.. ప్రభుత్వ వైఖరిని తెలిపేందుకు సమయం కావాలని కోర్టును అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్ర రావు కోరారు. ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవాల్సి ఉందని, వారం గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఉన్న మున్సిపాలిటీల్లో సమీపంలోని గ్రామాల విలీనం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని, ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల ఓటర్ల జాబితాల తయారీకి సమయం పడుతుందన్నారు. వారం రోజుల గడువు ఇస్తే మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి చెప్పారు. వాద నలు విన్న న్యాయమూర్తి.. వార్డు విభజన, రిజర్వేషన్ల ఖరారు, ప్రత్యేకాధికారుల నియామకం, గడువులోగా (జూలై 2లోగా) ఎన్నికలు నిర్వహిస్తారా? వంటి అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ మార్చి 14, మే 4 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో ఎస్ఈసీ గతంలోనే వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన చోట్ల వార్డు ల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై 2 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ వేసిన కేసులో హైకోర్టు గతంలో ఆదేశించింది. -
పకడ్బందీగా ‘మన ప్రణాళిక’
మహబూబ్‌నగర్ టౌన్: ‘మనఊరు.. మన ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మరో మూడురోజుల్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. రోజువారీగా చేపట్టిన వాటినే వెంటనే అప్లోడ్ చేయాలని సూచించినా.. కొందరు నిర్లక్ష్యం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. గురువారం మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు కేవలం 400గ్రామాలకు చెందిన డాటా మాత్రమే అప్లోడ్ అయిందన్నారు. ఈ విషయంపై ప్రత్యేకాధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని, అవసరమైతే అదనపు కంప్యూటర్లను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామని, ఇందుకుగాను ప్రతి మండలంలో 10లక్షల మొక్కలను నాటాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమానికి ప్రతిఒక్కరూ ప్రాధాన్యమిస్తూ నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. రైతులు తమ తమ పొలాల్లో పండ్లమొక్కలతో పాటు ఇతర వాటిని నాటుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవీందర్, డ్వామా పీడీ హరితతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.