
దిశ చట్టం అమలు కోసం.. ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు
సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకవచ్చిన చారిత్రాత్మక దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా దిశ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. స్త్రీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించి దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ సూచించిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.