Special PMLA court
-
భారత్‌కు రాకపోవడానికి కారణమిదే..!
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాల్లో నక్కిన గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సి, డైమండ్ కింగ్ నీరవ్ మోదీలు భారత్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులుగా ఉన్న వీరు, ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. విచారణ కోసం భారత్ న్యాయస్థానాల ముందు హాజరు కావాలని ఎన్ని సార్లు లేఖలు పంపినా.. సరిగా స్పందించడం లేదు. తాజాగా తాను భారత్‌కు వస్తే, తనపై మూక దాడి జరుగుతుందని మెహుల్ చోక్సి నాటకాలు ఆడుతున్నారు. తన మాజీ ఉద్యోగులు, రుణదాతల నుంచే కాకుండా.. జైలు అధికారులు, ఖైదీల నుంచి కూడా తన ప్రాణానికి ముప్పు ఉందంటూ చోక్సి చెబుతున్నారు. ‘ భారత్‌లో పలు మూక దాడులు జరుగుతున్నాయి. రోడ్డుపై జరుగుతున్న మూక దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నాకు వ్యతిరేకంగా అనేక మంది ఆగ్రహంతో ఉన్నారు. దీంతో నేను కూడా ఈ ముప్పును ఎదుర్కొనవచ్చు’ అని స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టుకు సమర్పించిన అప్లికేషన్లో పేర్కొన్నారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు, రుణదాతలకు నగదు వెనక్కి ఇవ్వలేదు, వీరందరూ ప్రస్తుతం తనపై ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పారు. వీరి చేతులో తన జీవితం ప్రమాద బారిన పడుతుందని అన్నారు. చోక్సి సమర్పించిన ఈ అప్లికేషన్‌పై స్పందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను స్పెషల్ పీఎంఎల్ఏ జడ్జీ ఎంఎస్ అజ్మి ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 18 చేపడతామని పేర్కొన్నారు. చోక్సి, అతని మేనల్లుడు నీరవ్ మోదీలు, మోసపూరిత గ్యారెంటీలతో పీఎన్బీలో దాదాపు రూ.13,00 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చి, పీఎన్బీ ఫిర్యాదు చేయడానికి కంటే ముందే, వీరిద్దరూ భారత్ విడిచి పారిపోయారు. భారత్‌లో చోక్సిక చెందిన బ్యాంక్ అకౌంట్లను, ఆస్తులను దర్యాప్తు సంస్థలు సీజ్ చేశాయి. భారత్‌లో అతనికి చెందిన ఆయన ఆఫీసులను మూసి కూడా వేశాయి. చోక్సికి వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంటీ కూడా జారీ అయింది. ఈ అరెస్ట్ వారెంటీని రద్దు చేయాలని కూడా అతను కోరుతున్నాడు. -
లలిత్ మోదీకి షాక్
ముంబై: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని యూకే నుంచి భారత్ కు రప్పించడానికి మార్గం సుగమం అయింది. లలిత్ మోదీని భారత్ కు పంపాలని యూకే ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈడీ చేసిన అభ్యర్ధనకు కోర్టు అంగీకరించింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి ఉన్నా ఆయన యూకేలో ఉండటంతో కేసు విచారణకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే కోర్టు లో ప్రస్తావించిన ఈడీ తరఫు న్యాయవాది.. మోదీని వెనక్కు పంపాలని యూకే ప్రభుత్వానికి కోర్టు లేఖ రాయాలని కోరారు. విజయ్ మాల్యా విషయంలో కూడా ఈడీ ఇలాంటి ప్రయత్నమే చేయగా అందుకు చట్టపరంగా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కోర్టు ద్వారా యూకే ప్రభుత్వానికి లేఖ పంపేదుకు ఈడీ సిద్ధమవుతోంది. -
'మాల్యాకు నాన్ బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్'
ముంబయి: భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేతకు పాల్పడిన మనీ లాండరింగ్ కేసులో విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈడీ మాల్యాకు దాఖలు చేసిన నోటీసులు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టు(పీఎంఎల్ఏ) తోసిపుచ్చింది. ఈడీ చేసిన ఆరోపణలు సమర్థిస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మాల్యాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్‌లో ఉన్నారు. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. -
లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విన్నపం మేరకు బుధవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఐపీఎల్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు నమోదు చేసింది. కాగా ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడం, కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్‌లోనే ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్‌లో ప్రాణభయం ఉందంటూ మోదీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది.