special prays
-
కల్యాణ వైభోగమే..
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని మిట్టమల్లేశ్వర స్వామి ఆలయంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీలక్ష్మీ భూలక్ష్మి సమేత శ్రీసత్యనారాయణస్వామి వ్రతాన్ని, కల్యాణాన్ని కన్నుల పండువలా ని ర్వహించారు. పురోహితులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో శాస్రోక్తంగా కల్యాణం నిర్వహించా రు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. సాయంత్రం సత్యనారాయణస్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో కల్యాణ నిర్వాహకులు ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు నాగసుగుణాకర్, ఆలయ చెర్మైన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రంగనాథుడి ఆలయంలో విశేష పూజలు.. తొలి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని అతిపురాతనమైన శ్రీరంగనాథస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కృష్ణరాజేశ్శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. రంగనాథస్వామిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం స్వామివారిని వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వెంకటేశ్వరస్వామి, అమ్మవారిశాల తదితర ఆలయాల్లో ఏకాదశి పూజలు నిర్వహించారు -
గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు
శ్రీకాళహస్తి(చిత్తూరు): గుప్త నిధులు లభిస్తాయని కొందరు వ్యక్తులు పురాతన ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని రాజీవ్‌నగర్ కైలాసగిరి కొండల్లో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక పనసకోనలో ఉన్న పురాతన శివలింగాల సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలు జరుపుతున్నారు. ఇది గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులతో సహా సంఘటనా స్థలానికి చెరుకుని విచారణ చేపడుతున్నారు. కాగా.. రెండు రోజులుగా తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఆ ప్రాంతంలో తిరిగారని స్థానికులు అంటున్నారు. -
వర్షం కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
కర్నూలు(ఎమ్మిగనూరు): రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని ముస్లిం సోదరులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గిడిచినా వర్షాలు కురవపోవడంతో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరువుఛాయలు అలుముకున్నాయి. సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో పనులు దొరకక వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస పోతున్నారు. ముస్లింలు రెండు రోజులుగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లాను వేడుకుంటున్నారు. శనివారం ఉదయం 7:30 గంటలకు ఎస్ఎస్ ట్యాంక్ సమీపంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.