కర్నూలు(ఎమ్మిగనూరు): రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని ముస్లిం సోదరులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గిడిచినా వర్షాలు కురవపోవడంతో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరువుఛాయలు అలుముకున్నాయి. సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో పనులు దొరకక వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస పోతున్నారు.
ముస్లింలు రెండు రోజులుగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లాను వేడుకుంటున్నారు. శనివారం ఉదయం 7:30 గంటలకు ఎస్‌ఎస్ ట్యాంక్ సమీపంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.