Special Saree
-
బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక రంగు చీర
హైదరాబాద్: రాష్ట్ర సర్కారు బతుకమ్మ పండుగను సరికొత్త పంథాలో ఆకర్షణీయంగా నిర్వహించబోతుంది. గతేడాది కేటాయించిన రూ.10 కోట్ల బడ్జెట్‌ను ఈసారి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు పెంచి మంజూరు చేశారు. అందులో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు. ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగ కళ కనపడేలా చేయనున్నారు. ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. కేరళీయుల గ్రామీణ పండుగ ఓనంను అక్కడి ప్రజలు పదిరోజులపాటు చూడముచ్ఛటగా జరుపుకొంటారు. ఈ పండుగను నేరుగా తిలకించేందుకు విదేశీయులు సైతం హాజరు అవుతారు. సర్కారు కూడా ఈసారి తిరువనంతపురంలో ఓనం పండుగ ఎలా నిర్వహిస్తారో అలాగే వినూత్నంగా హైదరాబాద్‌లో నిర్వహించాలని సంకల్పించింది. కేరళ మహిళలు 'కసవు చీరలు' ధరించి పండుగ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతారు. అదే తరహాలో ఇక్కడ కూడా బతుకమ్మ పండుగలో మహిళలు తెలంగాణ విశిష్ఠతను యాది చేసే ప్రత్యేక రంగుతో కూడిన చీరను తీసుకురానున్నారు. అక్టోబర్ ఆరో తేదీన 15 వేలమంది మహిళలతో ఒకే రంగు చీర ధరింపచేసి ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ బతుకమ్మ పేరుతో సరికొత్త సాంస్కృతిక అంశాలు మేళవించి బతుకమ్మ ఉత్సవం నిర్వహించనున్నారు. సర్కారులోని కొందరు అధికారుల ఆలోచనలను సీఎం కార్యాలయ అధికారులు కూడా ఆమోదం తెలినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. తొమ్మిదో తేదీన మాత్రం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు యథావిధిగా నిర్వహించనున్నారు. -
రక్షాబంధన్ కోసం ప్రత్యేక చీర
-
గోదారమ్మకు చీర సారె
కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలు ముగిసిన సందర్భంగా.. కరీంనగర్ జిల్లా మంథనిలో మంగళవారం భక్తులు గోదావరికి చీర సారె బహుకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకోవడానికి జిల్లాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి తుల ఉమతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి విచ్చేశారు. ఈ కార్యక్రమం మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వైభవంగా నిర్వహించారు. -
గోదావరి మాతకు భారీ చీర సమర్పణ
మంథని : కరీంనగర్ జిల్లా వాసులు గోదావరి మాతకు భారీ చీర సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. 1475 మీటర్ల పొడవైన చీరను ఆదివారం మంథని సమీపంలో గోదావరినదిపై అటువైపు ఒడ్డు నుంచి ఇటువైపు ఒడ్డు వరకు పరిచి పట్టుకున్నారు. మంథనికి చెందిన కొత్తపల్లి హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌రెడ్డి సతీమణి జమునారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మంథని సర్పంచ్ పుట్ట శైలజతోపాటు సుమారు 100 మంది పాల్గొన్నారు. ఇక్కడ గోదావరి నది వెడల్పు సుమారు ఒకటిన్నర కిలోమీటరు ఉంటుంది.