
గోదావరి మాతకు భారీ చీర సమర్పణ
మంథని : కరీంనగర్ జిల్లా వాసులు గోదావరి మాతకు భారీ చీర సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. 1475 మీటర్ల పొడవైన చీరను ఆదివారం మంథని సమీపంలో గోదావరినదిపై అటువైపు ఒడ్డు నుంచి ఇటువైపు ఒడ్డు వరకు పరిచి పట్టుకున్నారు.
మంథనికి చెందిన కొత్తపల్లి హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌రెడ్డి సతీమణి జమునారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మంథని సర్పంచ్ పుట్ట శైలజతోపాటు సుమారు 100 మంది పాల్గొన్నారు. ఇక్కడ గోదావరి నది వెడల్పు సుమారు ఒకటిన్నర కిలోమీటరు ఉంటుంది.