Spiderman Home Coming
-
ఆ సినిమా కోసం రూ. 524 కోట్లు తీసుకున్నాడట
ప్రపంచవ్యాప్తంగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ఫీవర్ పట్టుకుంది. ఈ సూపర్ హీరో సిరీస్‌లో ఇదే లాస్ట్ సినిమా కావడంతో వసూళ్లు కూడా భారీగానే ఉన్నాయ్. ఇప్పటికే ఎండ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 8000 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాలో నటించిన వారికి కూడా భారీ పారితోషికాలే అందినట్లు సమాచారం. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వసూళ్ల నుంచి వచ్చే మొత్తంలో వాటా కావాలని రాబర్ట్ డౌనీ జూనియర్ ముందుగానే మార్వెల్ సంస్థ అధినేత కెవిన్ ఫీజ్‌తో ఒప్పందం చేసుకున్నారట. ఇక అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కోసం డౌనీ ఏకంగా 75 మిలియన్ అమెరికన్ డాలర్ల(రూ. 524 కోట్లు) భారీ పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. దాంతో హాలీవుడ్లో ఇంత భారీ పారితోషికం అందుకున్న అతి కొద్ది మంది నటుల్లో రాబర్ట్ డౌనీ ఒకరుగా నిలిచారు. అవెంజర్స్ సిరీస్‌లో రాబర్డ్ డౌనీ ఐరన్ మ్యాన్ పాత్ర పోషించాడు. ఇక ఎండ్‌గేమ్ సినిమాలో కూడా రాబర్డ్ డౌనీయే లీడ్ రోల్ పోషించాడు. అంతేకాక స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ సినిమాలో కూడా డౌనీ కూడా కనిపిస్తాడు. అయితే ఈ చిత్రం కోసం కేవలం మూడు రోజులు మాత్రమే పని చేసిన డౌనీ ఒక్క రోజుకు 5 మిలియన్ డాలర్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక ‘అవెంజర్స్’లో థార్ పాత్రలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ సిరీస్ నుంచి ఐదు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్ నుంచి హెమ్స్‌వర్త్‌కు ముట్టిన మొత్తం 15 మిలియన్ డాలర్ల నుంచి 20(రూ. 139 కోట్లు ) మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. కెప్టెన్ అమెరికా పాత్రలో నటించిన క్రిస్ ఇవాన్స్ కూడా దాదాపు 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారు. -
చిన్నారులతో స్పైడర్ విన్యాసాలు..!
స్పైడర్ మ్యాన్ చిత్రాలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఈ సిరీస్‌లో రాబోతున్న మరో చిత్రం ‘స్పైడర్‌మ్యాన్ హోమ్ కమింగ్’ వచ్చే నెల 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరా బాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ, భాగ్యనగరంలో పలు చోట్ల ‘స్పైడర్ మ్యాన్’ ప్రత్యక్షమై, పిల్లలను సర్ప్రైజ్ చేసింది. పిల్లలందరూ స్పైడీతో ఫొటోలు దిగారు. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. -
ఇంటికొస్తున్న స్పైడర్‌మ్యాన్
‘స్పైడర్ మ్యాన్’కు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఉన్నారు. ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో విడుదలై, ఆకట్టుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌లో రాబోతున్న కొత్త చిత్రం ‘స్పైడర్‌మ్యాన్ హోమ్ కమింగ్’. స్పైడర్‌మ్యాన్ పాత్రలో థామస్ స్టాన్లే, విలన్‌గా ఆస్కార్ అవార్డ్ విన్నర్, ‘బర్డ్‌మ్యాన్’ ఫేమ్ మిచెల్ కీటన్ చేసారు. ఐరన్‌మ్యాన్ పాత్రలో రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు. ఈ సినిమాను తెలుగులో జూలై 7న విడుదల చేయనున్నారు.