spoil
-
జగన్ అన్న నమ్మకాన్ని వమ్ము చేయను
-
‘ప్రేమ’కు చిచ్చు పెడుతున్న స్మార్ట్ఫోన్లు
న్యూయార్క్: అమెరికాలో భార్యాభర్తల విడాకుల రేటు 40 శాతం ఉంది. ఇదేమి పెద్ద వార్త కాదు. కలిసి జీవిస్తున్న 60 శాతం భార్యాభర్తల్లో కూడా ఎక్కువ మంది అసంతప్తిగానే బతుకుతున్నారు. కొందరికమో చాలినంత డబ్బు లేదన్నది బాధయితే మరికొందరికేమో సంతప్తికరమైన సెక్స్ దొరకడం లేదన్నది బాధ, ఇంకొంత మందికి పిల్లలు సమయమంతా తినేస్తున్నారన్న బాధ. ఈ బాధలన్నింటికి మూల కారణం స్మార్ట్‌ఫోన్లంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ అదే నిజమంటూ అమెరికాలోని ‘నేషనల్ ఒపీనియన్ రిసెర్చ్ సెంటర్’ ఇటీవల ఓ సర్వే నిర్వహించి మరీ తేల్చింది. ఇది వరకు భార్యా భర్తలు వారంతపు సెలవుల్లో షికారు కోసం బీచ్ ఒడ్డుకో, పచ్చటి పార్కుకో లేదా ఇష్టమైన రెస్టారెంట్‌కో వెళ్లినప్పుడు ఎంచక్కా చేతిలో చేయి వేసుకొని పొద్దు తెలియకుండా కబుర్లు చెప్పుకునేవారట. పిల్లలతోని వెళ్లినా వారు వారి ఆట, పాట చూసి ముచ్చటపడేవారట. వారి ముద్దుముద్దు మురిపాలను చూసి ఆనంద తన్మయత్నంలో తేలిపోయేవారట. ఇప్పుడు భార్యభార్తలు పార్క్‌లకు, బీచ్‌లకు వెళుతున్నా చేతిలో చేయేసుకోవడానికి వారి చేతులు ఖాళీగా ఉండడం లేవట. ఎందుకంటే వారి చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయట. పిల్లలు తల్లి దండ్రులను పట్టించుకోకుండా డిజిటల్ గేముల్లో మునిగి తేలుతుంటే తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లలో ఎప్పటకప్పుడు పోస్టింగ్స్ చెక్ చేసుకుంటున్నారట. సర్వేలో పాల్గొన్న భార్యాభర్తల్లో 70 శాతం మంది తాము అసంతప్తితోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నామని చెప్పారు. వారి అసంతృప్తికి ప్రధాన కారణమవుతున్నది స్మార్ట్‌ఫోన్ వాడకమేనని లోతుగా అధ్యయనం చేస్తే తేలింది. ప్రతి అమెరికన్ సగటున ప్రతి ఆరున్నర నిమిషాలకొకసారి స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. దాదాపు రోజుకు 150 సార్లు వినియోగిస్తున్నారు. భార్యాభర్తలు అలా మాట్లాడుకుంటూ మంచి రోమాంటిక్ మూడ్‌లోకి వెళుతున్నప్పుడు ఇద్దరిలో ఒకరి మనసు హఠాత్తుగా సెల్‌ఫోన్ వైపు మళ్లుతోంది. అది అందుకుంటే మనసు మరెటో వెళ్లిపోతోంది. ఇది చూసిన భాగస్వామికి తనకన్నా ఫోన్ ముఖ్యమందని విసుక్కుంటున్నారు. చేసేదేమీ లేక తానూ కూడా స్మార్ట్‌ఫోన్ అందుకొని పోస్టింగ్‌లను చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఫలితంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, ఆప్యాయతలు తరగిపోయి, ఆ స్థానంలో అసంతప్తి చోటుచేసుకుంటోంది. ఇంతకు చెప్పేదేమిటంటే స్మార్ట్‌ఫోన్ దూరంగా ఉన్న మనుషులను దగ్గర చేస్తుంటే దగ్గరున్న మనుషులను దూరం చేస్తోంది. మరో విధంగా చెప్పాలంటే ప్రేమికులను దగ్గర చేస్తుంటే, భార్యాభర్తలను దూరం చేస్తోంది. -
పేకాట క్లబ్‌తో జీవితాలు నాశనం
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల టౌన్: పల్నాడు ప్రాంతంలో పేదల జీవితాలతో ఆటలాడుతున్న పేకాట క్లబ్ మూసివేత కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సమాయత్తం అవుతోంది. ఉద్యమానికి మహిళలు మద్దతు పలుకుతున్నారు. క్లబ్ మూసివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. దాచేపల్లిలో పేకాట క్లబ్ జోరుగా సాగుతోందని, ప్రజల జీవితాలను నాశనం చేసే పేకాటకు అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో అర్ధం కావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. అసలే కరువు... వర్షాభావంతో పల్నాడు ప్రాంతంలో కరువు దాపురించింది. ఈ తరుణంలో నిర్వహిస్తున్న పేకాట క్లబ్ ప్రజల పాలిట శాపంగా మారింది. పేకాటలో సర్వం కోల్పోయిన వారు వీధుల పాలవుతున్నారు. కరువు కారణంగా కుటుంబ పోషణే కష్టంగా మారిన తరుణంలో కొందరు వ్యసనపరులు ఆస్తులను అమ్మి ఉన్నది కాస్తా పేకాటలో పెడుతుండడంతో బాధిత కుటుంబ సభ్యుల్లో కలవరం నెలకొంది. రోజూ బంకినీయే రూ.20 లక్షలు.. మాచర్ల, గురజాల నుంచే కాకుండా జిల్లా, పొరుగు రాష్ట్రాల నుంచి పేకాటరాయుళ్లు జూదమాడేందుకు క్లబ్‌కు వస్తున్నారు. జూదంపై నిర్వాహకులకు రోజూ రూ.20 లక్షలు బంకిని వస్తుందంటే పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతలు తమ ప్రయోజనాల కోసం తమ జీవితాలను నాశనం చేస్తున్నారని పేకాట బాధితుల కుటుంబీకులు మండిపడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మూడు ముక్కలాట వంటి జూదాలు ఎక్కడ జరిగినా సత్వరమే స్పందిÆ చే పోలీసులు దాచేపల్లి క్లబ్ గురించి ఎందుకు పట్టించుకోరో అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పేకాటక్లబ్, అక్రమ మైనింగ్‌లపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. క్లబ్ ప్రారంభించిన కొత్తలో అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పోలీసులు వెంటనే మూసివేశారన్నారు. తర్వాత అధికార పార్టీ నేతల వత్తిళ్లకు తలొగ్గి మళ్లీ క్లబ్‌ను తెరిపించారన్నారు. ఈ క్లబ్ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్ నడిపే నేతలకు ఎవరూ అడ్డు చెప్పకపోవడంతో క్యాబరే డాన్సులు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పచ్చని కాపురాల్లో నిప్పులు పోసే క్లబ్‌ను మూసివేయించి కుటుంబాలు చితికిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్లబ్‌ను మూయించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాధిత కుటుంబాల శాపనార్ధాలు, ఉసురుతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మహిళలతో ఉద్యమాన్ని చేపడతానని హెచ్చరించారు. -
రాష్ట్రాల హక్కును హరించేలా ఉన్నాయి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: గవర్నర్‌కు శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలిచ్చే కేంద్రం ప్రతిపాదనలను నిజమాబాద్ ఎంపీ కవిత తప్పుపట్టారు. శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు గవర్నర్ కు ఇవ్వడమంటే రాష్ట్రాల హక్కును హరించడమే అని ఎంపీ కవిత అన్నారు. కేంద్ర ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని కవిత వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అందరం శాంతియుతంగా సామరస్యంగా ఉంటున్నానమని ఎంపీ కవిత తెలిపారు. రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమ సందర్భంగానూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినా తర్వాత కూడా ఇరుప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాయని ఎక్కడా ఏ చిన్న ఘటన నమోదు కాలేదని ఆమె తెలిపారు. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి కేంద్రం జోక్యంపై నిరసన తెలిపామన్నారు. కేంద్ర ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని ఎంపీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.