ప్రొ బాక్సింగ్‌ను అభివృద్ధి చేస్తా..
విజేందర్ సింగ్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారి సత్తా చూపిస్తున్న విజేందర్ సింగ్ భారత్‌లోనూ ఈ తరహా ఆటను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు. దీంట్లో భాగంగా కేంద్ర క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్‌ను శుక్రవారం విజేందర్ కలిశాడు. ‘నా ప్రొఫెషనల్ కెరీర్‌కు ఎంతగానో మద్దతు ఇచ్చిన మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపాను. భవిష్యత్‌లోనూ నాకు ఇలాగే తోడ్పడుతానని చెప్పారు. అలాగే భారత్‌లోనూ ప్రొ బాక్సింగ్‌ను అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి చర్చించాను.
ఈ విషయంలో ఆయన చాలా సానుకూలంగా స్పందించడం సంతోషాన్నిచ్చింది. అమెచ్యూర్ కెరీర్లో ఉన్న బాక్సర్లు ముందుకు వచ్చి ప్రొగా మారితే వారి భవిష్యత్ బాగుంటుంది. ఈ విషయంలో వారికి నా మద్దతు ఉంటుంది. అలాగే భారత్‌లో అమెచ్యూర్ బాక్సింగ్ పరిస్థితి గురించి నా ఆందోళన మంత్రికి తెలిపాను. రియో ఒలింపిక్స్‌కు వారు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు’ అని విజేందర్ తెలిపాడు.