క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ
కొండమల్లేపల్లి
పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శంకర్ – విజయలక్ష్మి దంపతుల ఆర్థికసాయంతో పట్టణంలోని ఉన్నత పాఠశాల క్రీడాకారులకు శుక్రవారం రూ.10 వేల విలువ చేసే క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్రా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దాతలు క్రీడాకారులకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పీడీ భావన, ఉపాధ్యాయులు లోక్యానాయక్, పెద్దన్న, గంగాధర్, నర్సింహ, శ్రీను, విద్యార్థులు ఉన్నారు.