Springfield
-
రక్త పిశాచి అవ్వాలని బాయ్ ఫ్రెండ్ తో..
స్ప్రింగ్ ఫీల్డ్: రక్త పిశాచిగా మారాలనే బలమైన కోరికతో మిస్సోరికి చెందిన ఓ టీనేజ్ బాలిక దారుణానికి ఒడిగట్టింది. బాయ్ ఫ్రెండ్ చేత రక్తం తాగించిన 19ఏళ్ల విక్టోరియా వనట్టెర్.. ఆ తర్వాత అతన్ని హత్య చేయబోయింది. నవంబర్ 23వ తేదీన చోటు చేసుకున్న ఈ సంఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాయ్ ఫ్రెండ్ ను తన ఇంటికి తీసుకువచ్చిన విక్టోరియా వనట్టెర్ అతనితో మద్యం సేవింపజేసింది. ఆ తర్వాత తన చేతిని కోసి రక్తం తాగాలని అతన్ని వేడుకుంది. కొద్దిసేపు అతడు నిరాకరించినా ఎట్టకేలకు ఒప్పించింది. ఆ తర్వాత బాక్స్ కట్టర్ ను ఉపయోగించి తన చేతిని బాయ్ ఫ్రెండ్ చేత కోయించి రక్తం తాగించింది. ఇంతలో ఏమైందో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విక్టోరియా అతనిపై కత్తితో దాడి చేసి భుజంపై గాయపరిచినట్లు చెప్పారు. పోలీసులు ఘటనాస్ధలికి చేరుకునే సరిగా ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని తెలిపారు. గోడపై పెద్ద ఎత్తున రక్తం చిమ్మి ఉందని అది చూసిన పోలీసులు నీరుగారిపోయారని పేర్కొన్నారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ఆ తర్వాత విక్టోరియాను అరెస్టు చేసి విచారించామని పేర్కొన్నారు. విచారణలో ఆమె పోలీసులపై విద్వేషంతో విరుచుకుపడినట్లు చెప్పారు. తాను సీరియల్ కిల్లర్ గా మారతానని కూడా అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా తనను క్షమించి వదిలివేయాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. 1.50లక్షల డాలర్ల జరిమానాతో ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
పొలారిస్ నుంచి ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్
ధర రూ. 31 లక్షలు న్యూఢిల్లీ: పొలారిస్ ఇండియా కంపెనీ అంతా కొత్తదైన ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ క్రూరుుజర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.31.07(ఎక్స్‌షోరూమ్ గుర్గావ్) లక్షలని పొలారిస్ ఇండియా తెలిపింది. తమ ఉత్పత్తుల్లో అత్యుత్తమైన బైక్‌ల్లో ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్ ఒకటని కంపెనీ సీఈఓ, డెరైక్టర్ పంకజ్ దుబే చెప్పారు. అధిక బరువును భరించగలిగే చాసిస్, ఏబీఎస్, క్రూరుుజ్ కంట్రోల్, కీలెస్ స్టార్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, అడ్జెస్టబుల్ ప్యాసింజర్ ఫ్లోర్‌బోర్డ్స్, ట్యాంక్‌పై ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ గేజ్; టైమ్ క్లాక్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
అదే రోజు... అదే రైలు...
రెండుసార్లు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికై, ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు అబ్రహం లింకన్. 1865 ఏప్రిల్ 15న తుపాకీ తూటాలకు బలయ్యారు. లింకన్ దేహాన్ని వాషింగ్టన్ డీసీ నుంచి ఆయన ఇల్లు ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ (ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉంది)కు తరలించడానికి ఓ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. రైలు వాషింగ్టన్ డీసీకి, స్ప్రింగ్ఫీల్డ్కి మధ్యలో పోకప్సీ రైల్వేస్టేషన్లో ఆగింది. ఆ రోజు ఏప్రిల్ 29. లింకన్ మృతదేహాన్ని స్ప్రింగ్ ఫీల్డ్‌లోని ఓక్రిడ్జ్ శ్మశానంలో అంత్యక్రియలు చేశారు. మరుసటేడు అదే రోజు రాత్రి... అదే రైలు.. పువ్వులతో అలంకరించిన అదే రైలులో.. లింకన్ మృతదేహం... ఇది కలా.. నిజమా! చూస్తుండగానే రైలు వెళ్లిపోయింది. మరుసటి ఉదయం ఈ వార్త అమెరికా అంతటా పాకిపోయింది. మరునాడు చాలా మంది రైలు వస్తుందేమోనని చూశారు. కానీ రాలేదు. కానీ మరుసటి ఏడు ఏప్రిల్ 29న అదే రైలు మళ్లీ వచ్చిందట. ఇప్పటికీ అదే రోజున లింకన్ రైలు వస్తోందట. ఇప్పటికీ ఏప్రిల్ 29 నాటి అర్ధరాత్రి లింకన్ రైలును చూడటానికి వెళ్తున్నవాళ్లూ ఉన్నారు. దాన్ని చూశామని కొందరు నమ్మకంగా చెబుతున్నారు. అది వారి భ్రమో లేక నిజమో! ఈసారి మీరు అదేసమయానికి పోకప్సీ రైల్వేస్టేషన్ వెళితే మాత్రం లింకన్ రైలు గురించి వాకబు చేయడం మర్చిపోకండి.