రక్త పిశాచి అవ్వాలని బాయ్ ఫ్రెండ్ తో..
రక్త పిశాచి అవ్వాలని బాయ్ ఫ్రెండ్ తో..
Published Wed, Nov 30 2016 10:08 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
స్ప్రింగ్ ఫీల్డ్: రక్త పిశాచిగా మారాలనే బలమైన కోరికతో మిస్సోరికి చెందిన ఓ టీనేజ్ బాలిక దారుణానికి ఒడిగట్టింది. బాయ్ ఫ్రెండ్ చేత రక్తం తాగించిన 19ఏళ్ల విక్టోరియా వనట్టెర్.. ఆ తర్వాత అతన్ని హత్య చేయబోయింది. నవంబర్ 23వ తేదీన చోటు చేసుకున్న ఈ సంఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాయ్ ఫ్రెండ్ ను తన ఇంటికి తీసుకువచ్చిన విక్టోరియా వనట్టెర్ అతనితో మద్యం సేవింపజేసింది. ఆ తర్వాత తన చేతిని కోసి రక్తం తాగాలని అతన్ని వేడుకుంది.
కొద్దిసేపు అతడు నిరాకరించినా ఎట్టకేలకు ఒప్పించింది. ఆ తర్వాత బాక్స్ కట్టర్ ను ఉపయోగించి తన చేతిని బాయ్ ఫ్రెండ్ చేత కోయించి రక్తం తాగించింది. ఇంతలో ఏమైందో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విక్టోరియా అతనిపై కత్తితో దాడి చేసి భుజంపై గాయపరిచినట్లు చెప్పారు. పోలీసులు ఘటనాస్ధలికి చేరుకునే సరిగా ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని తెలిపారు. గోడపై పెద్ద ఎత్తున రక్తం చిమ్మి ఉందని అది చూసిన పోలీసులు నీరుగారిపోయారని పేర్కొన్నారు.
ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ఆ తర్వాత విక్టోరియాను అరెస్టు చేసి విచారించామని పేర్కొన్నారు. విచారణలో ఆమె పోలీసులపై విద్వేషంతో విరుచుకుపడినట్లు చెప్పారు. తాను సీరియల్ కిల్లర్ గా మారతానని కూడా అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా తనను క్షమించి వదిలివేయాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. 1.50లక్షల డాలర్ల జరిమానాతో ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
Advertisement
Advertisement