Vampire
-
నిజమే..! ఇదొక వాంపైర్ మ్యూజియం..!!
దయ్యాలు, భూతాలు, పిశాచాలు వంటివి పాతకాలం జానపద సినిమాల్లోను, ఇప్పటికాలం హారర్ సినిమాల్లోను చాలామంది చూసి ఉంటారు. భూత ప్రేత పిశాచాల గురించి పరిశోధనలు సాగించే వారు పురాతనకాలం నుంచి కూడా ఉన్నారు.భూత ప్రేత పిశాచాలను ఆవాహన చేయడానికి తాంత్రికులు ఉపయోగించే వస్తువులను, మనుషులను భయపెట్టే ప్రేతాత్మలను నిరోధించడానికి ఉపయోగించే వస్తువులను, ప్రేతాత్మలను ఆకర్షించే వస్తువులను జాగ్రత్తగా సేకరించి ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలనే ఆలోచన మాత్రం చాలా అరుదైనది.ప్రేతాత్మలపై పరిశోధనలకే జీవితాన్ని అంకితం చేసిన ఫ్రెంచ్ మేధావి జేక్విజ్ సిర్జంట్ పారిస్లో అచ్చంగా భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన వస్తువులతో ‘మ్యూజియం ఆఫ్ వాంపైర్స్’ను నెలకొల్పాడు. ఇందులో మానవ కంకాళాలు, పురాతన తాంత్రికులు ఉపయోగించిన జంతువుల మమ్మీలు, ప్రేతాత్మలను తరిమికొట్టే ఆయుధాలు వంటివి భద్రపరచాడు. గుండెదిటవు గల పర్యాటకులు ఈ మ్యూజియంను చూసి పోతుంటారు. -
తవ్వకాల్లో బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు!
ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా.. అలాంటి లిస్ట్ నుంచి ఓ మిస్టరీని చేధించే యత్నాల్లో ఒక ‘క్లూ’ చిక్కింది. ఆడ వాంపైర్(రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి అసాధారణ రీతిలో తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ అనే గ్రామంలోని ఓ స్మశానానికి ఆనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించుకున్నారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. ఆగష్టులోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు. వ్యాంపైర్ అంటే.. కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచి. పగలు సాధారణం రూపం లేదంటే అసలుకే కనిపించకుండా తిరుగుతూ.. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ వేటాడుతుంది. మెడపై వ్యాంపైర్ గనుక కొరికితే.. అవతలి వాళ్లూ వ్యాంపైర్లుగా మారిపోతారని, లేదంటే ఎముకల గూడుగా మిగిలిపోతారని.. చాలా కథల్లో, సినిమాల్లో చూసే ఉంటారు. కానీ, వ్యాంపైర్ల ఉనికి, మనుగడ అనేది ఇప్పటిదాకా కేవలం జానపద కథలుగానే, ఫిక్షన్ క్యారెక్టర్గానే ప్రచారంలో ఉంది. చాలామందికి అదొక నమ్మకంగానే మిగిలిపోయింది. పరిశోధకులు ఏమన్నారంటే.. 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని వాంపైర్గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమెను వ్యాంపైర్గా భావించి.. ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారు. అలాగే ఆమె పాదానికి తాళం కూడా వేశారు. ఆరోజుల్లో మూఢనమ్మకాలు అలా ఉండేవి’’ అని తెలిపారు ఈ పరిశోధనకు నేృతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ డారియుస్జ్ పోలిన్స్కి. అయినప్పటికీ తమ పరిశోధన ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. అయితే.. గతంలో యూరప్ తూర్పు ప్రాంతంలోనూ ఈతరహా సమాధులు చాలానే బయటపడ్డాయి. వాటిలో చాలావరకు ఈ తరహాలోనే పాతిపెట్టబడ్డప్పటికీ.. తలలు, కాళ్లు చేతులు, తల తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉండడం లాంటి పరిస్థితుల్లో బయటపడ్డాయి. వాస్తవ-అవస్తవాలను పక్కనపెడితే.. వ్యాంపైర్ ప్రపంచం గురించి పరిశోధిస్తున్నవాళ్లకు.. ప్రత్యేకించి రచయితలకు ఈ అస్థికలు బయటపడడం మాత్రం ఓ కుతూహలాన్ని రేపుతోంది. ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్ మరణం.. ఆకాశంలో అద్భుతం -
రక్త పిశాచి అవ్వాలని బాయ్ ఫ్రెండ్ తో..
స్ప్రింగ్ ఫీల్డ్: రక్త పిశాచిగా మారాలనే బలమైన కోరికతో మిస్సోరికి చెందిన ఓ టీనేజ్ బాలిక దారుణానికి ఒడిగట్టింది. బాయ్ ఫ్రెండ్ చేత రక్తం తాగించిన 19ఏళ్ల విక్టోరియా వనట్టెర్.. ఆ తర్వాత అతన్ని హత్య చేయబోయింది. నవంబర్ 23వ తేదీన చోటు చేసుకున్న ఈ సంఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాయ్ ఫ్రెండ్ ను తన ఇంటికి తీసుకువచ్చిన విక్టోరియా వనట్టెర్ అతనితో మద్యం సేవింపజేసింది. ఆ తర్వాత తన చేతిని కోసి రక్తం తాగాలని అతన్ని వేడుకుంది. కొద్దిసేపు అతడు నిరాకరించినా ఎట్టకేలకు ఒప్పించింది. ఆ తర్వాత బాక్స్ కట్టర్ ను ఉపయోగించి తన చేతిని బాయ్ ఫ్రెండ్ చేత కోయించి రక్తం తాగించింది. ఇంతలో ఏమైందో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విక్టోరియా అతనిపై కత్తితో దాడి చేసి భుజంపై గాయపరిచినట్లు చెప్పారు. పోలీసులు ఘటనాస్ధలికి చేరుకునే సరిగా ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని తెలిపారు. గోడపై పెద్ద ఎత్తున రక్తం చిమ్మి ఉందని అది చూసిన పోలీసులు నీరుగారిపోయారని పేర్కొన్నారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ఆ తర్వాత విక్టోరియాను అరెస్టు చేసి విచారించామని పేర్కొన్నారు. విచారణలో ఆమె పోలీసులపై విద్వేషంతో విరుచుకుపడినట్లు చెప్పారు. తాను సీరియల్ కిల్లర్ గా మారతానని కూడా అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా తనను క్షమించి వదిలివేయాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. 1.50లక్షల డాలర్ల జరిమానాతో ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
రక్తపిశాచులయ్యే జబ్బు!
మెడిక్షనరీ జలగలు రక్తం తాగుతాయి. దోమలూ రక్తాన్ని పీలుస్తుంటాయి. అది వాటి ఆహారం. అలా రక్తాన్ని ఆహారంగా తీసుకునే ప్రాణులను శ్యాంజీవోరస్ జీవులు అంటారు. డ్యాక్యులాలు అని పిలిచే దెయ్యాలు సైతం మనిషి మెడ దగ్గర కొరికి రక్తం పీలుస్తున్న కథలూ, సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహజనిత పాత్రలు. అయితే నిజంగానే రక్తాన్ని తాగాలనుకునే మానసిక వ్యాధి కూడా ఒకటి ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘రెన్ఫీల్డ్స్ సిండ్రోమ్’ అని అంటారు. రక్తాన్ని తాగే పిశాచాల పాత్రలను ‘వ్యాంపైర్స్’ అని అంటుంటారు. అలాగే రక్తాన్ని తాగాలనే తీవ్రమైన వాంఛ ఉండే ఈ జబ్బును ‘క్లినికల్ వ్యాంపైరిజమ్’ అని వ్యవహరిస్తారు. సాధారణంగా మన వేలికి ఏదైనా దెబ్బతగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు గబుక్కున నోట్లో పెట్టుకుంటాం. దీన్ని ఆటోవ్యాంపైరిజమ్ అంటారు. ఇది అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. కానీ కొందరిలో ఇలా మానవ రక్తాన్ని తాగాలనే వాంఛ ప్రబలుతుంది. దీన్నే క్లినికల్ వ్యాంపైరిజమ్ అంటారు. అయితే ఇది చాలా అరుదైన వ్యాధి.