Sree Reddy
-
శాల్తీని లేపేస్తానంటూ శ్రీరెడ్డి వార్నింగ్!
సాక్షి, బంజారాహిల్స్: సినీనటి శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లోని ఏ బ్లాక్‌లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డ్యాన్స్ డైరెక్టర్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశానని, ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు. (హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు) గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్బుక్లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె అనుచరులతో ఫోన్ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్‌కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారన్నారు. (శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు) ఒకవైపు శ్రీరెడ్డి, ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తుండటంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లైవ్‌లోనే శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని, తన మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ ఆ వీడియో రికార్డులను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. ఇటీవల తాను సీసీఎస్‌లో సైబర్‌క్రైమ్‌లో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ శ్రీరెడ్డి ఒత్తిడి తీసుకు వస్తోందని, అందులో భాగంగానే శాల్తీని లేపేస్తానంటూ బెదరిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి ఆధారాలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (‘శ్రీరెడ్డి దొరికిపోయింది’) -
హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు
పెరంబూరు: సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇంతకు ముందు లైంగిక ఆరోపణలతో తెలుగు, తమిళ సినీపరిశ్రమల్లో కలకలం సృష్టించిన ఈ అమ్మడు తాజాగా తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... అసభ్యకర పోస్ట్‌లు పెట్టారంటూ శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి, నృత్యదర్శకుడు రాకేశ్ మాస్టర్ తెలంగాణా రాష్ట్ర క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. (కారు ధ్వంసం చేశారని శ్రీరెడ్డి ఫిర్యాదు) ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి... నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్ మాస్టర్‌పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో వారిద్దరూ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తానిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు తెలిపారు. అయితే కరాటే కల్యాణి, రాకేశ్ మాస్టర్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసభ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నట్లు చెప్పారు. తనను పెట్రోల్ పోసి తగల పెడతామని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి తెలిపారు. (‘శ్రీరెడ్డి దొరికిపోయింది’) -
బిగ్‌బాస్–3లో శ్రీరెడ్డి?
సాక్షి, చెన్నై : బిగ్‌బాస్–3లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రముఖ నటుడు, మక్కళ్‌నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే రెండు సీజన్లు జరిగిన షో కార్యక్రమం సీజన్–3 జూన్ రెండో వారంలో ప్రారభం కానుంది. ఇందుకు సంబంధించి కమలహాసన్ నటించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా నటి శ్రీరెడ్డి ఈ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. శ్రీరెడ్డి గతంలో టాలీవుడ్లో తనతో లైంగిక చర్యలకు పాల్పడిన వారిలో కొందరి పేర్లు బయటపెట్టడంతో పాటు వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ అర్ధనగ్నంగా నడిరోడ్డుపై దీక్ష చేపట్టింది. ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి కోలీవుడ్ సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి వివాదాంశ నటిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో శ్రీరెడ్డి ఎంట్రీ ఇస్తే ఇక వీక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంటే. అయితే దీనిపై శ్రీరెడ్డి ఇంకా స్పందించలేదు. తాజాగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్–3లో పాల్గొనే వారి ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే ఒరుకల్ ఒరుకన్నాడీ చిత్రంలో నటుడు సంతానంకు జంటగా నటించిన జాంగిరీ మధుమితను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ ఒకటిలో నటి ఓవియ వివాదాస్పద చర్యలతో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఆ షోలో విన్నర్‌గా మాత్రం ఆమె లవర్‌గా పాపులర్ అయిన నటుడు ఆరవ్ గెలుచుకున్నాడు. అలాగే సీజన్–2లో నటి ఐశ్వర్యదత్తు, యాషికలు పాపులర్ అయ్యారు. అయితే ఆ షోలో నటి రిత్విక విన్నర్‌గా నిలిచింది. -
సంధ్యపై ఆరోపణలు సత్యదూరం
సినిమా అంటే వినోదం, విజ్ఞానం అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడంతా కాసుల కోసం వేట మాత్రమే ఇక్కడ నడుస్తోంది. ఈ రంగంలోకి రావాలనుకునే అతివలకు, ట్రాన్స్జెండర్లకు గౌరవం, భద్రత, ఆదాయం, ఆరోగ్యం, హక్కులు ఎక్కడుంటాయి? అదే కదా శ్రీరెడ్డి అడిగింది. అదే కదా మిగతా ఆర్టిస్టులు కడుపుచించుకుని, కన్నీళ్లపర్యంతమవుతూ చెప్పింది. తమని కళాకారులుగా గుర్తించండి. తమకి కూడా వెండితెర మీద కనిపించే అవకాశాలివ్వండి. తమ కడుపులు కొట్టకండి. తమ శరీరాలను పశువాంఛలకు బలిచేయకండి. ఇదే కదా వారు అడిగింది. శ్రీరెడ్డి ప్రశ్న అనేక ముసుగుల్ని చించేసింది. ఒక మౌనాన్ని బద్దలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి, ఇటీవల జరిగిన సంఘటనలపై చర్చల నేపథ్యంలో బాధిత మహిళలకు అండగా అనేక మహిళా సంఘాలు ముందుకొచ్చి నిలబడ్డాయి. వారి కన్నీటి ఘోష విన్నాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చలు ఇంత తీవ్రమయ్యాకే, సమస్య తీవ్రత అర్థమయ్యాకే తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నిరో«ధక కమిటీ (కాష్ కమిటీ)ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే, అదే సమయంలో ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జీవిత రాజశేఖర్ పేరు వినిపించింది. ఈ అంశంపై ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు సినిమారంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదని. కాష్ కమిటీ అవసరమే లేదన్న వ్యక్తిని చైర్‌పర్సన్‌గా ఎలా నియమిస్తారనే ప్రశ్నని సంధ్య లేవనెత్తారు. ఇదే విషయంపై ప్రెస్‌మీట్ పట్టిన జీవితా రాజశేఖర్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య మీద తీవ్రమైన పదజాలంతో పాటు, వ్యక్తిగతమైన అంశాలను కించపరిచేవిధంగా మాట్లాడటమే కాకుండా, విలేకరులు కనిపించినపుడల్లా సంధ్య మీద దూషణలకు దిగటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. సంధ్యపై జీవిత చేస్తున్న అసత్య ఆరోపణలను నిర్ద్వం దంగా ఖండిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాళ్లలో సంధ్య పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇదే తెలుగు సినిమా రంగంలో, పెద్దమనుషులుగా చెప్పుకుంటున్న అనేక మంది తమ ఆడపిల్లలకి సమస్యలెదురైతే వచ్చి సలహా తీసుకునేది కూడా సంధ్యని ఇతర మహిళా సంఘాల నేతలనే. నిజానికి ఈ రోజు ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి గొంతెత్తిన వారు కూడా తమ సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాల దగ్గరికే వచ్చారు కానీ, పరిశ్రమలో ఎప్పటినుంచో వున్న జీవిత దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? ఈ విషయాన్ని జీవిత ఇకనైనా అర్థం చేసుకుని తన ధోరణి మార్చుకోవాలి. పీవోడబ్ల్యూ సంధ్య మీద జీవితా రాజశేఖర్ చేసిన దుర్మార్గమైన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా ఉద్యమాలలో ముందుండి నాయకత్వం వహిస్తున్న సంధ్యకు మేమంతా ఏకగ్రీవంగా మద్దతు తెలియచేస్తున్నాం. సంధ్యపై చేసిన ఫిర్యాదులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. (పీవోడబ్ల్యూ నేత సంధ్యపై సినీ నటి జీవితా రాజశేఖర్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వందమంది మహిళా మేధావులు, రచయిత్రులు, కళాకారులు, కార్యకర్తలు పంపిన పత్రికా ప్రకటన ముఖ్యాంశాలు) -
వర్మ పరిశ్రమకు పట్టిన చీడపురుగు
-
టీడీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు
-
చిన్నా పెద్దా తేడా లేదు.. క్యాష్తో సమన్యాయం
‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల లైంగిక వేధింపుల విషయమై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సీరియస్‌గా తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో విశాఖ గైడ్‌లైన్స్ పేరుతో ఇచ్చిన సూచనల ఆధారంగా లైంగిక వేధింపుల నిరోధానికి ‘క్యాష్’ (కమిటీ అగైనెస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి.కిరణ్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో టి.ఎఫ్.సి.సి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎఫ్.సి.సి అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ– ‘‘క్యాష్’ కమిటీలో చిత్రపరిశ్రమ నుంచి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్ సభ్యులతో పాటు సమాజంలోని స్వచ్ఛంద సంస్థల వారు, లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు ఉంటారు. సినిమా రంగంలోని అన్ని విభాగాల వారు తమకు ఏవైనా వేధింపులు ఎదురైతే ఈ కమిటీ దృష్టికి తీసుకురావచ్చు’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో మన కుటుంబంలోని వ్యక్తి ఇలా చేసిందే అని భావోద్వేగానికి గురై ఆ రోజు అలా మాట్లాడాను. అంతేకానీ ఆమెపై వ్యక్తిగతంగా మాకు ఎటువంటి విరోధం లేదు. ‘మా’ సభ్యులెవరూ ఆమెతో కలిసి నటించకూడదని ఆ రోజు అన్నాం. అయితే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, ‘మా’ అసోసియేషన్ పెద్దలు శ్రీరెడ్డి విషయాన్ని పునః పరిశీలించాలని సలహా ఇచ్చారు. ఆమెకు ‘మా’లో సభ్యత్వం విషయాన్ని జనరల్ బాడీలో పరిశీలించే వరకూ ‘మా’ సభ్యులందరూ శ్రీరెడ్డితో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నటించొచ్చు. ఈ సందర్భంగా ఆమెకు మేం వెల్కమ్ చెబుతున్నాం. శ్రీరెడ్డికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. తెలుగు నటీనటులకు అవకాశాలు ఇమ్మని ‘మా’ ఎప్పుడూ కోరుతుంది. కానీ, అవకాశాలు ఇచ్చే నిర్ణయం ఆయా దర్శక–నిర్మాతలదే’’ అన్నారు. ‘‘క్యాష్’ కమిటీలో పదిమంది ఇండస్ట్రీవారు, మరో పదిమంది సమాజంలోని ప్రముఖులు ఉంటారు.అతి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వేధింపుల కేసులన్నీ ఆ కమిటీకి వెళతాయి. ఇక్కడ పెద్దా చిన్నా అనే తేడా ఉండదు. అందరికీ సమన్యాయం జరుగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కె.ఎల్. నారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యూడ్‌గా రోడ్డుపైకొస్తా : శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్లో సంచలనం రేపుతున్న నటి శ్రీరెడ్డి తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా కొందరు సినీ ప్రముఖుల పేర్లను సోషల్ మీడియాలో బయటపెడుతూ రోజుకో సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్‌లోని కాస్టింగ్ కౌచ్ సంస్కృతి, సినీ అవకాశాల పేరిట వర్థమాన నటీమణులు, అమ్మాయిలను వాడుకుంటున్న తీరును బయటపెట్టి.. టాలీవుడ్లో దుమారం రేపిన శ్రీరెడ్డి తాజాగా ఓ సంచలన కామెంట్ చేశారు. తాజాగా కేసీఆర్ ఈ విషయంపై కల్పించుకోవాలని లేదంటే తాను పబ్లిక్‌లో న్యూడ్‌గా నిలబడతానంటూ మరో సంచలనానికి తెర తీశారు. తమ బాధ అర్థం చేసుకోకపోతే, సీఎం కేసీఆర్ ఏ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించారో, అదే మార్గాన్ని తాను కూడా అనుసరిస్తానన్నారు. 'అప్పటికీ పట్టించుకోకపోతే పబ్లిక్‌లో న్యూడ్‌గా నిలబడతా సర్.. మిమ్మల్ని ఎలా కలవాలో తెలియడం లేదు' అంటూ కేసీఆర్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఎవరైతే అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారో రేపటి వరకు ఆగండి.. నేనేం చేయబోతున్నానో మీరెవరు కనీసం ఊహించలేరు అంటూ శ్రీరెడ్డి ఘాటుగా స్పందించారు. తెలుగు అమ్మాయిలం అమాయకులం, వెర్రివాళ్లం, ప్రేమ పేరుతో తమ శరీరాలను వాడుకోవొద్దని చెప్పండి సర్, ప్రేమ పేరుతో మోసపోతున్నాం సర్.. ఫిల్మ్‌నగర్‌లోని పేద, ధనిక వాళ్లు తీర్పు చెప్పండి అంటూ మరో పోస్ట్ పెట్టారు.