
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న నటి శ్రీరెడ్డి తాజాగా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా కొందరు సినీ ప్రముఖుల పేర్లను సోషల్ మీడియాలో బయటపెడుతూ రోజుకో సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్‌లోని కాస్టింగ్ కౌచ్ సంస్కృతి, సినీ అవకాశాల పేరిట వర్థమాన నటీమణులు, అమ్మాయిలను వాడుకుంటున్న తీరును బయటపెట్టి.. టాలీవుడ్‌లో దుమారం రేపిన శ్రీరెడ్డి తాజాగా ఓ సంచలన కామెంట్ చేశారు.
తాజాగా కేసీఆర్ ఈ విషయంపై కల్పించుకోవాలని లేదంటే తాను పబ్లిక్‌లో న్యూడ్‌గా నిలబడతానంటూ మరో సంచలనానికి తెర తీశారు. తమ బాధ అర్థం చేసుకోకపోతే, సీఎం కేసీఆర్ ఏ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించారో, అదే మార్గాన్ని తాను కూడా అనుసరిస్తానన్నారు. 'అప్పటికీ పట్టించుకోకపోతే పబ్లిక్‌లో న్యూడ్‌గా నిలబడతా సర్.. మిమ్మల్ని ఎలా కలవాలో తెలియడం లేదు' అంటూ కేసీఆర్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఎవరైతే అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారో రేపటి వరకు ఆగండి.. నేనేం చేయబోతున్నానో మీరెవరు కనీసం ఊహించలేరు అంటూ శ్రీరెడ్డి ఘాటుగా స్పందించారు. తెలుగు అమ్మాయిలం అమాయకులం, వెర్రివాళ్లం, ప్రేమ పేరుతో తమ శరీరాలను వాడుకోవొద్దని చెప్పండి సర్, ప్రేమ పేరుతో మోసపోతున్నాం సర్.. ఫిల్మ్‌నగర్‌లోని పేద, ధనిక వాళ్లు తీర్పు చెప్పండి అంటూ మరో పోస్ట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment