Sri balaji
-
ఆడపడుచు కోసం...
అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ఈ సెంటిమెంట్‌తో తెరకెక్కిన పలు చిత్రాలు విజయం సాధించాయి. అలాంటి మ రో వైవిధ్యభరిత కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఇంజిమురప్పా. హిల్స్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో రాధాకృష్ణ ఫి లిం సర్క్యూట్ పతాకంపై ఎ.పి.రాధాకృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.సహ దర్శకత్వం వహిస్తున్నారు. నవ నటుడు శ్రీ బాలాజీ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సోని శిష్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో కృష్ణ, రిషిక, నెల్లై శివ, మనోహర్ తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీ తాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పి ఆర్ కె రాజు చాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చె ల్లెలంటే ఎనలేని ప్రేమ గల అన్నయ్య ఆమె భవిష్యత్తును పూ లబాటగా మార్చాలని కలలు కంటుంటాడన్నారు. అ లాంటి చెల్లెలు ప్రేమ పేరుతో మోసపోవడంతో అ న్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నది చిత్ర కథ అన్నారు. హీరో హీరోయిన్ల ప్రేమ, చెల్లెలి అనుబంధం లాంటి పలు జనరంజకమైన అంశాలతో తెరకెక్కిస్తు న్న చిత్రం ఇంజిమురప్పా అని తెలిపారు. చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎస్ సహ వెల్లడించారు. -
జనరంజకంగా...
శ్రీబాలాజీ, సోని చరిష్టా, కృష్ణ, రిషిక, రఘు, సరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకుడు. ఎ.పి.రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.ఆర్.రాజు తెలిపారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు అద్భుతమైన స్పందన లభించిందని, త్రినాథ్ జనరంజకంగా సినిమాను మలిచాడని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్.కె.రాజు, సహ నిర్మాత: ఎం.మలర్కొడి. -
నాకైతే నచ్చింది
ప్రేమ, వినోదం, యాక్షన్ సమాహారంతో రాధాకృష్ణ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘నాకైతే నచ్చింది’. శ్రీ బాలాజి, సోని చరిష్టా, రిషకా హీరో హీరోయిన్లుగా త్రినాధ్ కోసూరి దర్శకత్వంలో ఏపీ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ -‘‘యూత్‌ఫుల్ మైండ్‌గేమ్‌తో సాగే చిత్రం ఇది. శ్రీ బాలాజీకి తొలి సినిమా అయినా అద్భుతంగా నటించాడు. వైజాగ్, కాకినాడ, యానాం, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అని చెప్పారు. సహనిర్మాత బీఆర్ రాజు మాట్లాడుతూ -‘‘ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ స్టోరీ ఇది. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ నెలలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. సిరి, కృష్ణ, రఘ, గౌతంరాజు, రైనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సహాయ్‌రాజ్, మాటలు: చందు, కెమెరా: పీఆర్కే రాజు.