నాకైతే నచ్చింది
నాకైతే నచ్చింది
Published Thu, Oct 3 2013 1:18 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ప్రేమ, వినోదం, యాక్షన్ సమాహారంతో రాధాకృష్ణ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘నాకైతే నచ్చింది’. శ్రీ బాలాజి, సోని చరిష్టా, రిషకా హీరో హీరోయిన్లుగా త్రినాధ్ కోసూరి దర్శకత్వంలో ఏపీ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ -‘‘యూత్‌ఫుల్ మైండ్‌గేమ్‌తో సాగే చిత్రం ఇది. శ్రీ బాలాజీకి తొలి సినిమా అయినా అద్భుతంగా నటించాడు. వైజాగ్, కాకినాడ, యానాం, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అని చెప్పారు.
సహనిర్మాత బీఆర్ రాజు మాట్లాడుతూ -‘‘ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ స్టోరీ ఇది. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ నెలలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. సిరి, కృష్ణ, రఘ, గౌతంరాజు, రైనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సహాయ్‌రాజ్, మాటలు: చందు, కెమెరా: పీఆర్‌కే రాజు.
Advertisement
Advertisement