sri bhramaramba mallikarjuna swamy temple
-
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
-
శ్రీశైలంలో అంగరంగ వైభవంగా రథోత్సవం (ఫొటోలు)
-
శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)
-
Ugadi 2024: కనులపండువగా శ్రీగిరి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలం: మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము
-
రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్
Updates: 05:00PM రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. దీనిలో భాగంగా ప్రత్యేక విమానంలో హకీంపేటకు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్‌లు స్వాగతం పలికారు. TIME: 02.00PM శ్రీశైలం మల్లికార్జున స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్రపతికి అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. నంది సర్కిల్ వద్ద టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లో రూ. 43 కోట్లతో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. TIME: 01.30PM భ్రమరాంబ గెస్ట్‌హౌస్ నుంచి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా స్వాగతం పలికారు. TIME: 12.30PM సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన సాక్షి గణపతి ఆలయానికి బయల్దేరి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబిక గెస్ట్‌హౌజ్‌కు వెళ్లారు. కొద్ది సేపు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబిక దేవికి కుంకుమార్చన, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. TIME: 12.00PM శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘన స్వాగతం పలికారు. భారీ భద్రత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే శ్రీశైలంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత దర్శనాలు యధాతథంగా నిర్వహించనున్నారు. ద్రౌపతి ముర్ము పర్యటించే ప్రదేశాల్లో దుకాణాలు మూసివేశారు. శ్రీశైలం టోల్ గేట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదకు వాహనాలు మళ్లిస్తున్నారు. సాక్షి, కర్నూలు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఉదయం శ్రీశైలం దేవస్థానాన్ని రాష్ట్రపతి దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూల్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వస్తారు. బొల్లారం వార్ మెమోరియల్‌లో అమరజవాన్లకు నివాళులు అర్పించి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్ విందులో పాల్గొంటారు. చదవండి: రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో భేటీ -
శివ శివా...
పెదకాకాని మల్లేశ్వరస్వామికి రావాల్సిన బకాయిలెన్నో? వ్యాపారులు చెల్లించాల్సింది రూ.1,19,18,444 నోటీసులకూ స్పందన లేదు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆలయ అధికారులు ప్రసిద్ధిగాంచిన పెదకాకాని శివాలయానికి బాకీదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆలయంలో నిర్వహించే వివిధ షాపులను, హక్కులను టెండర్ల ద్వారా చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు అద్దె సరిగ్గా చెల్లించటం లేదు. దీంతో బకాయిలు రోజురోజుకూ పెరిగి రూ.కోటి దాటాయి. పెదకాకాని : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, పూలు, కట్టెలు, కూల్‌డ్రింక్స్, చెప్పుల స్టాండ్, గ్యాస్ పొయ్యి అద్దెకు ఇవ్వడం వంటి వాటిపై బహిరంగ వేలం పాటలు జరుగుతుంటాయి. హెచ్చుపాట పాడిన వ్యక్తికి ఆ వ్యాపారం అప్పగిస్తుంటారు. ఇందుకు వారు దేవస్థానానికి నెలనెలా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.కానీ, కొందరు వ్యాపారులు అద్దెను సరిగ్గా చెల్లించట్లేదు. కొంతకాలంగా వ్యాపారుల మధ్య పోటీ పెరగడం, ఎక్కువ పాటలు పాడి షాపులను దక్కించుకోవడం, దేవస్థానం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి బాకీలు ఉన్న వారికి గానీ, వారి కుటుంబీకులకు గానీ తరువాత జరిగే వేలంపాటలో పాల్గొనే హక్కులేదు. ఇక్కడ ఆ నిబంధన సరిగ్గా అమలు జరగట్లేదు. మొద్దు బకాయిలెన్నో.. దేవస్థాన వ్యాపారులైన బొమ్మిశెట్టి గరటాదేవి రూ.40,11,968, వి.రాజారామ్మోహన్రాయ్ రూ.27,90,000, బోడా ప్రసన్న రూ.20,17,200, ఆలా ప్రసాద్‌రావు రూ.5,30,076, యడ్లపల్లి రమేష్ రూ.91,200, సీతంశెట్టి అరుణ రూ.24,48,000 చెల్లించాల్సి ఉంది. ఆలయానికి బాకీ చెల్లించాల్సిన వ్యాపారస్తులకు ముందుగా ఆలయం తరఫున, ఆ తరువాత లాయర్ నోటీసులు అందజేశారు. 2015వ సంవత్సరం, అంతకుముందు కోర్టు ద్వారా ఆలయానికి బాకీలు చెల్లించాలని కోరారు. బాకీదారుల పేర్లు ఆలయ ప్రాంగణంలో బోర్డుపై ఏర్పాటుచేశారు. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ఒక కాంట్రాక్టర్ ఉండగానే సదరు షాపునకు మూడు నెలల ముందే పాట నిర్వహిస్తారు. ఈ పాటలో షాపు దక్కనివారు (అప్పటికే కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి) ఆ తరువాత మూడు నెలల కాలానికి అద్దె చెల్లించకపోవడం వల్ల ఈ బాకీలు భారీగా పెరిగిపోతున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం ఆలయానికి వ్యాపారస్తులు బాకీలు ఉన్న మాట నిజమే. ముందుగా ఆలయ నోటీసులు జారీ చేశాం. ఆ తరువాత లాయర్ నుంచి డబ్బు చెల్లించాలని నోటీసులు ఇప్పించాం. వ్యాపారస్తుల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బు వసూలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. నోటీసు బోర్డులు రాసిన తరువాత ఇద్దరు చెల్లించారు. కోర్టు ద్వారా మిగిలిన వారి వద్ద కూడా వసూలు చేస్తాం. - దార్ల సుబ్బారావు, ఆలయ సహాయ కమిషనర్, పెదకాకాని శివాలయం