sri durga malleswara swamy devasthanam
-
నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు (ఫొటోలు)
-
‘పూర్తి పారదర్శకంగా దేవాలయాల ఆస్తుల రికార్డుల భద్రత ప్రక్రియ’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని దేవాలయాలు, ధార్మిక సంస్థల భూముల పరిరక్షణకై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 6వ అంతస్థులోని శ్రీ మల్లిఖార్జున మహా మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవాదాయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద దేవాలయాల భూములకు త్వరలో విముక్తి కల్పించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పలు మార్లు అధ్యయనం చేసిన తర్వాత ప్రధానంగా దేవాదాయ భూముల వివరాల వెరిఫై అంశం, ప్రాథమిక ఆధారాలు, వివాదంలో ఉన్న భూములు, 22A1C క్రింద రిజిస్టర్ అయిన భూములు, సర్వే నంబర్ కు సంబంధించిన సబ్ డివిజన్లు, ఎండోమెంట్, రెవెన్యూ శాఖల ఆధీనంలో ఉన్న భూములు, వివాదాలు లేని ఆస్తులు, శాశ్వతంగా భూమి భద్రత, రీసర్వే సెటిల్ మెంట్ రికార్డులు, 1B ప్రతుల పరిశీలన, కోర్టు కేసుల విషయాలు, అన్యాక్రాంతం అయిన భూములు తదితర అంశాలపై ఈరోజు జరిగిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఎండో మెంట్ కమిషనర్లు, 26 జిల్లాల దేవాదాయ శాఖ అధికారులు, దేవాలయాల ఈవోలు, అధికారులు, కార్యనిర్వాహణాధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశంలో దేవాలయాల భూములు కాపాడటం కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని వెల్లడించారు. ఇప్పటికే దేవాదాయ శాఖ భూములను కన్జర్వేషన్ ల్యాండ్ గా ఇవ్వాలని రెవెన్యూ శాఖతో చెప్పామన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్ వో సీ జారీ చేసిన విషయం మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి స్థాయి నుండి క్షేత్ర స్థాయి ఉద్యోగుల వరకు దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేవాదాయ భూములు దేవుడికే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేవుడికి రావాల్సిన ఆదాయం సక్రమంగా రాకపోతే కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల రికార్డులను భద్రపరిచే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే సంబంధిత సాఫ్ట్ వేర్ ను రూపొందించి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఒక్కసారి ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో పొందుపరిచాక క్లాసిఫికేషన్ చేస్తామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,09,000 ఎకరాలను గుర్తించిన దేవాదాయ శాఖ వాటి పరిరక్షణకు తగు చర్యలు చేపట్టిందన్నారు. వివాదాల్లో ఉన్న దేవాదాయ భూముల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ భూముల విషయంలో ఎవరైనా ఉద్యోగులు అవినీతికి పాల్పడితే తక్షణమే సస్పెండ్ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అనకాపల్లి, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖకు చెందిన వందలాది ఎకరాల భూములను, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో దేవాదాయ భూములను రైతులు సాగుచేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అలాంటి ఘటనల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మానవతా ధృక్పథంతో వ్యవహరిస్తామన్నారు. అంతిమంగా దేవాదాయ భూములను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాలయాల భూముల విషయంలో కొందరు కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ కోర్టులకు వెళ్తున్నారన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక భూములు వివాదంలో ఉన్నాయని, కోర్టుల్లోనూ పలు భూముల కేసు తీర్పులు పరిశీలిస్తే కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఆన్ లైన్ ప్రక్రియతో ఈ వివాదాలన్నింటికి చెక్ పడుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మన భూములు, మన ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా చేపడుతున్న సమయంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల ప్రక్రియను కూడా చేపట్టాలని నిర్ణయించామన్నారు. భూవివాదాలకు చరమగీతం పాడి పారదర్శకంగా వివాదాలు లేని ఆస్తులు ఆన్ లైన్ లో పొందుపరచడమే తమ ఉద్దేశమన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి ఒక్కో ప్రాంతాన్ని ఫైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసి సంబంధిత ప్రాంత దేవాలయాల ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో పొందుపరుస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 6,000 చిన్న ఆలయాలకు సంబంధించి ధూప, దీప నైవేద్యాల క్రింద ప్రతి నెలా ఆన్ లైన్ ద్వారా రూ.5,000 లు నేరుగా దేవాలయాల అకౌంట్ లో జమ చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో 4 ఏళ్లుగా సంక్షేమ రాజ్యం అప్రతిహాతంగా కొనసాగుతుందని, భవిష్యత్ లో కూడా సంక్షేమ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పాలన దేశానికి ఆదర్శం కావాలన్నారు. ప్రకృతి సహకరించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలి అని, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రతి ఒక్కరి కుటుంబాల సంక్షేమం కోసం మే 12వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు అత్యంత శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించి 500 మంది రుత్వికులతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో “చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం” ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారన్నారు. ఉదయం 4 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ రాత్రి 8.30 వరకు కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విరామం ఉంటుందన్నారు. మహా పూర్ణాహుతితో యజ్ఞం ముగుస్తుందన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ యాగంలో రోజుకో ఆలయం చొప్పున దుర్గామల్లేశ్వర స్వామి, మల్లిఖార్జున స్వామి, సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, సింహాచల అప్పన్న స్వామి వార్ల శాంతి కళ్యాణాలు పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం వేళ జరగనున్న యాగం అనంతరం ప్రతి రోజూ సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు, చాగంటి వారి ప్రవచనాలు ఉంటాయన్నారు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై 26 నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ పేర్కొంది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్రహావనం, బలిహరణ, హారతి జరుగుతుంది. మార్చి 1వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల దివ్యలీలా కల్యాణోత్సవం జరుగుతుంది. 2వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. అనంతరం వసంతోత్సవం జరుగుతుంది. -
ఇంద్రకీలాద్రిపై నిత్యాన్నదానం పున:ప్రారంభం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి అమ్మవారి నిత్య అన్న ప్రసాద వితరణ పునఃప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ మహా మండపం రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ విభాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవోలు భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాద వితరణలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. నిత్యం 2,500 మందికి, శుక్ర, ఆదివారాలలో 4,000 మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్శర్మ, పాలక మండలి సభ్యురాలు ఎన్.సుజాత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధికి అమ్మ నిధులే..!
పుష్కరాల నాటికి దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.50 కోట్ల కేటాయింపు ఈ నిధులు అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి తీసుకోవాలంటున్న ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు పుష్కరాల నాటికి దుర్గమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ.50 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. ఇది విన్న వారంతా అమ్మవారి ఆలయంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అనుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి అమ్మవారి ఖాతాలో నిధులే ఉపయోగించుకోవాలంటూ సెలవిచ్చింది. దీంతో భక్త జనం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులివ్వాలని డిమాండ్ చేస్తోంది. విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అభివృద్ధి పేరుతో అమ్మవారి డిపాజిట్లను మంచినీళ్లులాగా ఖర్చు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పుష్కరాల నాటికి రూ.50 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పనులకు దేవస్థానం ఫిక్స్డ్ డి పాజిట్లను ఉపయోగించుకుంటామని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం అమ్మవారికి ప్రధాన ఖాతాలో రూ.130 కోట్లు, అన్నదానం ఖాతాలో రూ.35 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ నిధులను మాత్రం అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా వినియోగిస్తే సహించేది లేదని భక్తులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా? తెలంగాణలో యాదాద్రి వంటి ముఖ్య దేవాలయాల అభివృద్ధిని అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉగాది పండుగ, రాజధాని శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు దుర ్గగుడి నిధుల్ని వినియోగిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఉన్న దేవాలయానికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తే.. అమ్మవారి డిపాజిట్లు తీయాల్సిన అవసరం ఉండబోదని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. భక్తుల నుంచి విరాళాలు...? అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళాలిచ్చేందుకు భక్తులు ముందుంటారు. గతంలో రాజగోపురంపై స్వర్ణ కలశాల ఏర్పాటుకు రూ.90 లక్షలు భక్తులే అందించారు. స్వర్ణ శిఖరం నిర్మాణానికి సహకరించారు. ఇప్పుడు కనకదుర్గా నగర్లో భవన నిర్మాణం, కోనేరు నిర్మాణం, ఇంద్రకీలాద్రి రక్షణ గోడపై నిర్మించే చిత్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరించవచ్చు. అవసరమైతే దాతల పేరు ఆయా ప్రదేశాల్లో రాయవచ్చు. అందుకు భిన్నంగా అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్లు ఖర్చు చేయడమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇతర దేవాలయాలతో పోల్చితే.. ద్వారకా తిరుమల, సింహాచలం వంటి దేవాలయాలకు ఆదాయం వచ్చినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు వేయకుండా భూములు కోనుగోలు చే శారు. దీంతో ఆయా దేవాలయాలకు వందల ఎకరాల భూములు ఉన్నాయి. గతంలో దుర్గ గుడి ఈవోలు పని చేసిన వారు వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. దీంతో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ప్రైవేటు భూముల్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలా కాకుంటే ఆస్తులు ఉన్న చిన్న దేవాలయాలు, సత్రాలను దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేవస్థానం ఖర్చుల భారం పెరుగుతోంది. గతంలో అమ్మ వారి సొమ్ముతో విజయవాడ ప్రభుత్వాసుపత్రినిఅభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని భక్తులు న్యాయస్థానంలో అడ్డుకుని అమ్మ వారి డిపాజిట్లు కాపాడారు. అమ్మవారి డి పాజిట్లు జోలికి వెళ్లినందుకు గతంలో ఈవోలు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. మంత్రి ఉమా స్పందన ఏమిటి...? గతంలో దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గిరిప్రదక్షిణ, ఆందోళనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై అధికారుల్ని నిలదీశారు. ఇప్పుడు ఏకంగా అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్లకే అధికారులు ఎసరు పెడుతుంటే ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...!