Sri Kalahastheeswara Swamy Temple
-
ఆలయంలో 'ఆడ' దొంగల ముఠా..
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మల్లే వచ్చిన ఓ దొంగలముఠా కేరళ భక్తుల నగల బ్యాగును చోరీ చేసింది. చివరకు భద్రతా సిబ్బంది ఆ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. కేరళ నుంచి కొంతమంది భక్తులు శుక్రవారం దర్శనానికి వచ్చారు. కొంతసేపటికి చూస్తే తమ నగలబ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనచెందారు. ఎవరో దొంగలు కొట్టేశారని గ్రహించి వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన వారు సీసీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించారు. ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగల బ్యాగును స్వాధీనం చేసుకుని కేరళ భక్తులకు అప్పగించారు. చోరీకి పాల్పడిన ఐదుగురు మహిళలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కి‘లేడీలు’ సూళ్లూరుపేటకు చెందినవారని తేలింది. గతంలో పట్టణంలో జరిగిన చోరీలలో వీరి ప్రమేయం ఉందా? అనే కోణంలో సీఐ నాగార్జుణ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రహణం వేళ ఆ ఆలయానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, చిత్తూరు: సూర్యగ్రహణం సందర్బంగా దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శాస్త్రోకంగా మూసివేస్తారు. కానీ చిత్తూరు జిల్లాలోనికి శ్రీకాళహస్తి ఆలయం యథావిధిగా తెరుచుకొని ఉంటుంది. గ్రహణం వేళ ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయి. గురువారం సూర్యగ్రహం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం నుంచే యథావిధిగా పూజలు కొనసాగాయి. దీంతో ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజల్లో పాల్గొంటున్నారు. ఇది శుభ పరిణామం అని పూజారులు అంటున్నారు. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారన్నది అందరికీ తెలిసినా...తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. శ్రీకాళహస్తితోపాటు పిఠాపురం పాదగయ క్షేత్రంలోనే భక్తులు దర్శించుకునే వీలుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. పూర్వకాలం నుంచి ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నామని వెల్లడించారు. -
శ్రీ కాళహస్తి ఆలయంలో క్షుద్రపూజలు
-
మోడీ ఇంకా రాలేదు... పోలీసుల ఓవరాక్షన్
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి, వాయులింగేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మోడీ రాక ముందే భక్తులపై ఆంక్షలు విధించారు. రాహు, కేతు పూజలు రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా అధికారులు ప్రకటించారు. దాంతో రాహు, కేతు పూజ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పూజ కోసం ఎక్కడినుంచో వచ్చిన తమను ఇలా అవస్థలకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.