మోడీ ఇంకా రాలేదు... పోలీసుల ఓవరాక్షన్
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి, వాయులింగేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మోడీ రాక ముందే భక్తులపై ఆంక్షలు విధించారు.
రాహు, కేతు పూజలు రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా అధికారులు ప్రకటించారు. దాంతో రాహు, కేతు పూజ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పూజ కోసం ఎక్కడినుంచో వచ్చిన తమను ఇలా అవస్థలకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.