sri krishnadevaraya
-
కడపలో శ్రీకృష్ణ దేవరాయలు 533వ జయంతి కార్యక్రమం
-
‘ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: 299 టీఎంసీల కోటా నుంచి తెలంగాణ అదనంగా నీరు వాడుకుందని, కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఆయన సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వరదజలాల వినియోగంపై కేంద్రం వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. -
నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు సోదరి ప్రచారం
-
శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
తిరుమల శ్రీవారికి చెందిన వేల కోట్ల విలువజేసే ఆభరణాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చెన్నై మీడియా సమావేశంలో అప్పటి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు స్వామివారి ఆభరణాలపై సందేహాలను వ్యక్తం చేసినప్పటి నుంచీ భక్తుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. శ్రీకృష్ణదేవరాయల ఆభరణాలను ప్రత్యక్షంగా చూసి వాటిపై కొద్దోగొప్పో అవగాహన ఉన్న రమణ దీక్షితులు వంటి ప్రముఖ వ్యక్తే సందేహాలను వెలిబుచ్చడం చర్చకు దారి తీసింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన వేల కోట్ల ఖరీదుజేసే బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాల భద్రతపై టీటీడీ వర్గాలు నోరు మెదపడం లేదు. మూడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు, మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. దీంతో రాయల వారి నగలపై స్పష్టమైన వివరణ ఇవ్వడంలో టీటీడీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత మంగళవారం చెన్నైలో అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీలో వంశపారంపర్యంగా వస్తున్న అర్చక వారసత్వాన్ని రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధ«మని రమణ దీక్షితులు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారి బంగారు ఆభరణాల భద్రతను ప్రశ్నించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో స్వామి వారికి అందజేసిన వేల కోట్ల విలువజేసే ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి... ఎంత మేరకు భద్రంగా ఉన్నాయని టీటీడీ అధికారులను నిలదీశారు. ఆభరణాల లెక్కలను బహిరంగపరిచి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని రమణ దీక్షితులు టీటీడీ వర్గాలను కోరారు. కొత్తగా స్వామి వారికి కా నుకల రూపంలో అందిన ఆభరణాలను మాత్రమే ఉత్సవాల సమయంలో అలంకరిస్తున్నారనీ, పాత నగలను బయటకు తీయడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవలనే టీటీడీకి చెందిన రూ.1000 కోట్ల నగదును అధికారులు ఓ ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో భద్రతను ప్రశ్నిస్తూ శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో డిపాజిట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. సరైన సమాధానం చెప్పలేక టీటీడీ అధికారులు సతమతమయ్యారు. ఈ నెల 16న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సదరు డిపాజిట్ల పర్యవేక్షణ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ సుధాకర్‌యాదవ్ వెల్లడించారు. ఒకవైపు డిపాజిట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీవారి విలువైన ఆభరణాలపై సందేహాలు వెల్లువెత్తడం టీటీడీ వర్గాలను కుదిపేస్తోంది. కచ్చితమైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా విధుల్లో చేరిన నూతన ప్రధాన అర్చకులు మాత్రం ఆభరణాలకు చెందిన రికార్డులన్నీ ఉన్నాయని బదులిచ్చారు. లోగుట్టు పెరుమాళ్ల కెరుక.... 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలు తిరుమలాదేవి, చిన్నమదేవితో కలిసి 7 సార్లు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పట్లో రాయలవారు దర్శనానికి వచ్చిన ప్రతిసారీ విలువైన బంగారు, వజ్ర, నవరత్నాలతో కూడిన వజ్ర కిరీటాలు, భుజకీర్తులు, కంఠహారాలు, స్వర్ణ ఖడ్గాలను స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించారు. 1513 ఫిబ్రవరి 10వ తేదీ తొలిసారి సందర్శించినపుడు నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అందజేశారు. అదే సంవత్సరం మే 2వ తేదీ రెండోసారి రాయల వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అప్పట్లో మరో కిరీటం, పతకాలు, హారాలు, వెండి హారతి పళ్లాలు అందజేశారు. ఆ తరువాత పుత్రసంతానం కలిగాక భార్య తిరుమలాదేవితో కలిసి వచ్చి (1518 అక్టోబర్ 16) తిరుమల వెంకన్నను దర్శించి బంగారు పీతాంబరాలు, నవరత్నాలను సమర్పించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మహంతుల కాలంలో కొన్నింటిని కరగబెట్టి కొత్త ఆభరణాలు చేయించే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. ఆ తరువాత 1996 వరకూ కొన్ని ఆభరణాలను అడపా దడపా స్వామి వారికి అలంకరిస్తూ వచ్చారు. ఆ తరువాత కొత్త ఆభరణాలు వచ్చి చేరుతుండటంతో పాత వాటి జోలికెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో అసలు రాయల వారి ఆభరణాల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా టీటీడీ వర్గాలు భక్తుల సందేహాలకు సరైన సమాధానం చెప్పి భక్తుల్లో నమ్మకాన్ని, భరోసాను పెంచాల్సిన అవసరం ఉంది. అధికారులు సమాధానం చెప్పాలి శ్రీవారికి ఉన్న వేల కోట్ల విలువైన ఆభరణాలపై భక్తుల్లో అనుమానాలు తీవ్రతరంకాక ముందే టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. ఏఏ ఆభరణాలు ఎక్కడ, ఏ రకమైన భద్రతలో ఉన్నాయో వివరిం చాలి. సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకులై, ఆగమ సలహాదారులుగా వ్యహరించిన రమణ దీక్షితుల వంటి పెద్దలు సందేహాలను వ్యక్తం చేయడం చూస్తే ఏదో జరుగుతోందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్పీఎస్ కన్వీనర్, తిరుపతి ఆభరణాల నిర్వహణ లోపభూయిష్టం స్వామి వారి ఆభరణాల నిర్వహణ బాధ్యతలు సరిగా లేవు. అంతా లోపభూయిష్టంగా ఉంది. కోట్ల విలువైన ఆభరణాలపై కనీస జబాబుదారీతనం లేకుండా పోయింది. ఆభరణాలను భక్తుల సందర్శన కోసం ఉంచడం శ్రేయస్కరం. – పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేథావుల ఫోరం -
రైతుల కోసం రాయల నీతి
రైతులు దేశాలు పట్టిపోతే రాజు ఎలా ఆదుకోవాలో ఐదువందల ఏళ్ల క్రితమే కృష్ణదేవరాయలు సూచించాడు. సేద్యము చేసి నష్టపడి పశువులను, ఇండ్లను, ధాన్యమును వదలుకొని వలసపోయే రైతులను అధికారులు ఉపేక్షింప రాదన్నాడు. వారిని రప్పించి సాయపడి సేద్యమునకు సులువులు కల్పించి ఆదుకోవాలన్నాడు. ఆముక్త మాల్యద తెలుగులో విలక్షణ ప్రౌఢ ప్రబంధం. ఇందులో ప్రధాన కథ గోదాదేవిది కాగా, యామునాచార్యుని కథ ఓ ఉపాఖ్యానం. కథ ముగింపులో యామునాచార్యుడు సన్యాసం స్వీకరించాలని నిశ్చయించుకొని, రాజ్యాన్ని తన కొడుక్కి అప్పగిస్తాడు. ఆ సందర్భంలో కుమారునికి రాజనీతి బోధిస్తాడు. శుక్రనీతి, చాణక్యనీతి, కామందకనీతి, శాంతిపర్వం వంటి నీతిబోధక గ్రంథాలు చదివిన కృష్ణదేవరాయలు తాను పాటించిన నీతినే యామునాచార్యుని చేత చెప్పించాడని పండితాభిప్రాయం. వాస్తవంగా ఈ రాజనీతి బోధించక పోయినా కథకు ఏ లోటూ రాదు. రెండు దశాబ్దాలపాటు రణతంత్రం, రాజ్యతంత్రం నడిపి, ప్రజారంజకుడిగా పాలించిన చక్రవర్తి గనుక మక్కువతో ఎనభై రెండు పద్యగద్యాలతో రాజనీతిని చెప్పి తన సరదా తీర్చుకున్నాడు. ఈ రాజనీతిలో పొరుగు రాజులతో యుద్ధాలు, సంబంధాలు, విదేశీ వర్తకులకు చేయవలసిన మర్యాదలు, రాజ్యంలోని వివిధ వర్గాలు, మనస్తత్వాల వ్యక్తులతో వ్యవహరించే విధానాలూ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే, కేవలం ప్రభువు ప్రజలను ఎలా కాపాడాలి? అని చెప్పే పద్యాలను విశ్లేషించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. ‘ఏపట్టున విడువక ర క్షా పరుడవు గమ్ము ప్రజలచక్కి, విపన్ను ల్కూపెట్టిన వినితీర్పుము కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్ ’ అని రాశాడు రాయలు. ప్రజలను నిత్యమూ కష్టాలనుండి కాపాడు, ఆపదలోనున్నవాడు మొరపెట్టుకున్నప్పుడు ఆపదలను తొలగించు, కార్య నిర్వహణకు దుర్జనులను నియోగించవద్దు అని ఈ పద్యభావం. ‘దేశ వైశాల్య మర్థ సిద్ధికి మూలము’ అనే పద్యంలో ప్రజలకు జలాధారములు కలిగించి, పంటకాల్వలను తవ్వించాలన్నాడు. చిన్న రైతులకు కూడా నీటివసతి కలిగించి, వారినుండి తక్కువ పన్ను వసూలు చేయాలన్నాడు. రైతులు దేశాలు పట్టిపోతే రాజు ఎలా ఆదుకోవాలో కూడా ఐదువందల ఏళ్ల క్రితమే రాయలు సూచించాడు. ‘ప్రజ నవసి చన్న బిలువ, కప్పసుల గొలుచు నమ్మి’ అనే పద్యంలో సేద్యము చేసి నష్టపడి పశువులను, ఇండ్లను, ధాన్యమును వదలుకొని వలసపోయే రైతులను అధికారులు ఉపేక్షింప రాదన్నాడు. వారిని రప్పించి సాయపడి సేద్యమునకు సులువులు కల్పించి ఆదుకోవాలన్నాడు. రైతులను కష్టపెట్టే అధికారులున్న రాజ్యమూ బాగుపడదు, రాజూ బాగుపడడని చెప్పాడు. రైతులను కష్ట పెట్టే అధికారులకు రాజు ఏడుదీవులు జయించి అప్పజెప్పినా రాజ్యం సుభిక్షం కాదని హెచ్చరించాడు. ఇక రాజు ఎట్లుండాలో కొన్నిపద్యాలలో విపులంగా చెప్పాడు. ‘దండపారుష్యంబు కొండెంబున’ పద్యంలో దండించుటయందు క్రూరత్వం, కొండెగాండ్రు చెప్పిన మాటలు పరిశీలించుట, శత్రువు సంధి కోరినపుడు అవకాశమివ్వక యుద్ధం చేయుట, ఒక విదేశీయుడు వచ్చి తన దేశపురాజు హింసించాడని మొరపెట్టుకుంటే అతడిని బంధించి ఆ దేశపు రాజుకు అప్పగించుట, నమ్మకము లేని మనిషితో కలసి తిరుగుట, నమ్మకస్తుని దూరము చేసికొనుట, మంత్రులు చెప్పిన ప్రతిమాటనూ చర్చించకయే అంగీకరించుట, రహస్యాలోచనను ఇతరులకు తెలియజేసినవానిని దండించకుండుట, వింతలు పుట్టినప్పుడు పరిశీలించకుండుట, వ్యసనములలో పడియుండుట, మాత్సర్యము వహించుట వంటి పనులు రాజు చేయకూడదన్నాడు. ‘ఎరుగ నగున్ స్వశక్తి నవనీశుడు’ పద్యంలో యే విషయమైనా మూడుపాళ్ళు తానే తెలుసుకొని, నాల్గవపాలు మిత్రులనుంచి సేకరించాలన్నాడు. తన మతమే జరిగి తీరాలనే దురభిమానము ఉండకూడదన్నాడు. ఆపదలలో పరాధీనుడు కాకూడదనీ, దండనలో ఉగ్రత్వము వహించకూడదనీ రాశాడు. ‘తజ్ఞమండలి గూర్చి, ధాతువుల్ దెలిసి, హేమాదులగొని’లో రాజు తన శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే స్వర్ణ భస్మాదులను సేవించి దేహమును కాపాడుకోవాలని చెప్పాడు. రాజు తన దేహాన్ని ఎలా కాపాడుకొంటాడో, అలాగే బంగారు గనులను గుర్తించడం, ప్రజలకు సౌకర్యాలు కలిగించడం, ప్రజాకంటకులను అణగదొక్కడం వంటి పనులతో సప్తాంగములతో కూడిన రాజ్యాన్ని కాపాడాలని శ్లేషతో హితవు పలికాడు. ‘ఆ పాలకూటనే నిజమేపాటియు దప్ప రాడిరే’ పద్యంలోనూ, దానికి ముందు వెనుకగల పద్యాలలోనూ గిరిజనుల మనస్తత్వాన్ని చక్కగా చిత్రీకరించాడు. వారు నాగరిక సమాజంలోని మాయ తెలియనివారు, నమ్మిన వారికి ప్రాణాలు ఇస్తారు, అబద్ధాలతో మోసగించిన వారి ప్రాణాలు తీస్తారు, అట్టి ఆదివాసీలతో సత్యమునే మాట్లాడుతూ రాజ్యం కొరకు వారిని వినియోగించు కోవాలన్నాడు. అంతిమంగా– ‘కన్నొకటి నిద్రవో బెఱకంట జాగ రంబు గావించు భూరుహాగ్రంబు మీది యచ్చ భల్లంబు గతి భోగమనుభవించు నెడను బహిరంతరులపై దృష్టి వలయు’ పద్యంలో కొమ్మచివర ఎలుగుబంటి కన్నొకటి మూసి నిద్రిస్తుంది, రెండవకన్ను తెరిచి పరిసరాలను, పరిస్థితులను గమనిస్తూనే వుంటుందనీ అలాగే రాజు ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా, ఒక కంటితో రాజ్యాన్ని గమనిస్తుండాలనీ అన్నాడు. రాజనీతి రచన కషాయం లాంటిది. నాడీజంఘుని కథ, దృపదుడు, యాజి, ఉపయాజుల కథ, ఆదివాసుల ఆతిథ్యం వంటివి ఆయా చోట్ల సూచనామాత్రంగా వినియోగించుకున్నాడు రాయలు. ఉపమ, ఉత్ప్రేక్ష వంటి అర్థాలంకారాలను వాడుకున్నాడు. ఇవన్నీ చక్కెరగుళికల్లా కషాయాన్ని ఆస్వాదయోగ్యంగా మార్చాయని చెప్పవచ్చు. నిత్యమూ ఒక కంటితో ప్రజలనూ, రాజ్యాన్నీ కంటికి రెప్పలా కాపాడాడు కనుకనే కృష్ణదేవరాయలు నేటికీ ప్రాతఃస్మ - గార రంగనాథం 9885758123 -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
హుళేబీడు(ఆలూరు రూరల్): గ్రామశివారులోని శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయానికి వెనకభాగంలో కాళబైరవ, నీలకంఠేశ్వరస్వామి, జోడు బసవన్నల విగ్రహాలు ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. అర్ధరాత్రి అక్కడ జేసీబీ లైట్ల వెలుగులు, గుర్తు తెలియని వ్యక్తుల మోటార్ సైకిళ్లు అటువైపు వెళ్లడంతో ఆంజనేయస్వామి ఆలయంలో నిద్రిస్తున్న శివభక్తులు గమనించి ఆలూరు ఎస్ఐ ధనుంజయకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో అక్కడికి చేరుకునేలోపు నిదితులు జేసీబీ (ఏపీ21 బీకే0975), మోటార్‌సైకిల్(ఏపీ21 బీఏ9996)ను అక్కడే వదిలేసి పరారయ్యారు. – గతంలోనూ ఇదే ప్రదేశంలో తవ్వకాలు గతంలో కూడా ఇదే ప్రదేశంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెద్దఎత్తున తవ్వకాలు జరిపారు. అప్పట్లో అక్కడ నిధులు దొరికినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం తవ్వకాలు జరిగే ప్రదేశంలో జోడి శివలింగాలు, నీలకంఠేశ్వరస్వామి, కాలభైరవ విగ్రహాలు చెల్లాచెదురుగా పడేశారు. నీలకంఠేశ్వరస్వామి విగ్రహాలు ఉన్న కిందిభాగంలో దాదాపు 15 అడుగుల లోతులో జేసీబీ ద్వారా తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన చోట శివలింగానికి కిందిభాగంలో ఉన్న శిలాఫలకం మాత్రమే ఉంది. శిలాఫలకంపైన ఉన్న చిన్న శివలింగం కనిపించడంలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. – వర్షం కోసం పూజలు చేసే ప్రదేశంలోనే తవ్వకాలు యేటా గ్రామస్తులు ఖరీఫ్, రబీ సీజన్ల ముందు వర్షాలు రాకపోతే ముందుగా గ్రామశివారులో ఉన్న ఆంజనేయస్వామికి అభిషేకం జరుపుతారు. అక్కడి నుంచి ఆలయం వెనుకభాగంలో ఉన్న కాళబైరవ, నీలకంఠేశ్వరస్వామి, బసవన్నల విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. ఆ విగ్రహాలకు అక్కడ పూజలు చేస్తే వర్షాలు పడతాయని వారి నమ్మకం. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపేవారు కాలభైరవ, నీలకంఠేశ్వరస్వామి, జోడిశివలింగాలు విగ్రహాలకు ఎదురుగా దాదాపు 200 మీటర్ల దూరంలో పక్షి ఆకారంలో కల్గిన ఓ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ముందుగా తవ్వకాలు జరిపేవారు నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు హుళేబీడు గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని ఆలూరు పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆలూరు సీఐ అబ్దుల్‌గౌస్, ఎస్ఐ ధనుంజయ విలేకరులతో మాట్లాడారు. గుప్తనిధులు తవ్వకాలు జరిపేందుకు ఆదోని ప్రాంతానికి చెందిన వడ్డే రాజు, మధు, మహానందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో మరో వ్యక్తి రామచంద్రయ్య ఉన్నట్లు చెప్పారు. మరి కొంతమందిని కూడా తవ్వకాలు జరిపిన వారిలో ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. తవ్వకాల్లో వారి పేర్లు ఉన్నాయా లేదానన్న విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు. -
సమీక్షణం: శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని కళ్లకు కట్టించే వ్యాసాలు
పుస్తకం : సాహితీ సమరాంగణ సార్వభౌమ (వ్యాససంపుటి) సంపాదకుడు : మోదుగుల రవికృష్ణ పేజీలు: 240; వెల: 180 ప్రతులకు: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్. ఫోన్: 9848065658 విషయం : తెలుగు గ్రామీణ జన జీవన అంశాలను కళ్లకు కట్టించిన ‘ఆముక్తమాల్యద’ను రచించిన కవిరేడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన్ని దక్షిణ భారతదేశపు సాంస్కృతిక చిహ్నంగా పేర్కొనవచ్చు. ఐదు వందల ఏళ్ల నాడు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య విశ్లేషణకు ఆధారభూతములైన గ్రంథరాజములు వెలువడటానికి విజయ నగర సామ్రాజ్యాధిపతిగా ఆయన చేసిన సాహిత్య సేవ ఎంతగానో దోహదపడింది. 1914 నుండి 2013 వరకు నూరేళ్ల వ్యవధిలో రాయల వారి గురించి వచ్చిన వ్యాసాలలో ముఖ్యమైనవాటిని ప్రచురించాలనే ఆశయంతో ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ శీర్షికతో ‘మిత్రమండలి ప్రచురణలు’ ద్వారా ఈ వ్యాస సంపుటి వెలుగు చూసింది. నేలటూరి వెంకటరమణయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, దివాకర్ల వెంకటావధాని, దేవులపల్లి కృష్ణశాస్త్రిలాంటి వారు రాసిన ఈ 27 వ్యాసాలు రాయల కాలపు రాజవీధుల్లో తిరుగుతున్న అనుభూతిని ఇస్తాయి. ఇందు ప్రచురించిన 102 ఛాయాచిత్రాలు ఆ కాలపు శిల్ప సౌందర్యాన్ని, కోటల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. గత చరిత్రను నేటి పాఠకుల కళ్లకు కట్టించే పుస్తకమిది. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ‘ఆదుర్తి’ పై అందమైన సంకలనం పుస్తకం : దర్శక చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు సంకలనం : హెచ్.రమేష్‌బాబు విషయం : ‘మూగ మనసులు’ గుర్తుందా? అసలు మన తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే సినిమానా అది! అదొక్కటే కాదు... తోడికోడళ్లు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, నమ్మిన బంటు... ఇలాంటి సినిమాలన్నీ... చూసిన ప్రతిసారీ బోలెడన్ని జ్ఞాపకాలు పంచే గనులు. ఈ కళాఖండాల సృష్టికర్త ఆదుర్తి సుబ్బారావు. సూపర్‌స్టార్ కృష్ణకు సినీ జన్మనిచ్చిన వ్యక్తి. సాంఘిక సినిమాల రూపురేఖలు మార్చిన దర్శకుడు. తెలుగు సినిమా షూటింగ్‌ని ప్రకృతికి దగ్గర చేసినవాడు. అంటే అవుడ్డోర్ షూటింగ్స్‌కి ఓ చక్కటి రహదారి వేసినవాడు. ఆదుర్తి కెరీర్లో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఈ తరమే కాదు, రాబోయే తరాలు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. కానీ వికీపీడియాలో కూడా సరైన సమాచారం లేదు. ఆ లోటు తీరుస్తుందీ పుస్తకం. సంకలనం అయినా కూడా రమేష్‌బాబు చాలా శ్రమించారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల డబ్బు కన్నా కాలమే ఎక్కువ ఖర్చవుతుంది. ఎందరెందరి దగ్గరికో, ఎన్నెన్నో ఊళ్లు తిరిగి ఫొటోలు, సమాచారం సేకరించాలి. ఈ పుస్తకంలో చాలా మంచి డీటైల్స్, వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి. ఆదుర్తి అభిమానులనే కాకుండా సినీ ప్రియులనూ ఈ పుస్తకం అలరిస్తుంది. - శ్రీబాబు తుపాకి గుళ్ల లాంటి కథలు తెల్లజాగాను వీలైనంతగా వాడుకున్న ఈ రెండు అనువాద కథా సంకలనాల ప్రాథమిక గుణం- వేగంగా చదివింపజేయడం. వివిధ భాషల్నుంచి అనువాదం చేసిన ‘పరాయి సిరా’లో 21 కథలున్నాయి. రుచిగల ‘లసగ్నా’తో ప్రియుడి మనసు గెలుచుకోవాలనుకుని, దాన్ని ఉప్పుమయం చేసిన ప్రియురాలి తొలి విఫల వంట ప్రయత్నం- ‘మగాడి హృదయానికి దారి’ (ఇటాలియన్; క్రిస్టినీ డిక్సన్). ‘ఎల్ జెఫే’ ఆవిష్కరించబోయే తపాలా బిళ్ల అంచు నీలంకు బదులుగా నలుపు రంగు రావడంతో- కచ్చితంగా తమకు ఉరిశిక్ష తప్పదనుకున్న ముగ్గురు అధికారులు చావోరేవో ఎలా తిరుగుబాటు తెచ్చారో ‘నియంత’(కొలంబియన్; ఎడ్వర్వ్ వెల్లెన్) కథ చక్కగా చెబుతుంది. ఇక, సంక్షిప్తం చేసిన 68 మినీ క్రైమ్ కథలన్నింటికీ వర్తించే సూత్రం: ‘పేల్చిన తుపాకి గుండు ఎలా తక్షణం గమ్యాన్ని తాకుతుందో అలా ఈ కథలన్నీ త్వరగా, అంటే విసుగు పుట్టించకుండా క్లయిమేక్స్కి చేరుకుంటాయి.’ - రాజు పరాయి సిరా (అనువాద కథలు); పేజీలు: 142; వెల: 120 మినీ క్రైమ్ కథలు; పేజీలు: 142; వెల: 120 అనువాదం: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రతులకు: లిపి పబ్లికేషన్స్, గాంధీనగర్, హైదరాబాద్-80. ఫోన్: 9849022344 కొత్త పుస్తకాలు నన్ను సాయిబును చేసింది వాళ్లే (వ్యాసాలు) రచన: షేక్ కరీముల్లా పేజీలు: 100; వెల: 50 ప్రతులకు: రచయిత, 21-55, పెద్దమసీదు బజారు, వినుకొండ-522647, గుంటూరు. ఫోన్: 9441502990 నేలతీపి, అజ్ఞాతం (కథారూపకాలు) రచన: డా.వి.ఆర్.రాసాని పేజీలు: 106; వెల: 60 ప్రతులకు: అన్ని విశాలాంధ్ర బ్రాంచీలు. -
శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలకు సమైక్య సెగ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా సీమాంధ్ర నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెనుకొండలో ఈ నెలాఖరున జరగనున్న ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలను వాయిదా వేసినట్లు అనంతపురం ఆర్డీవో శుక్రవారం వెల్లడించారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాల ఎప్పుడు జరిగేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఆ ఉత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభించవలసి ఉంది. అయితే జిల్లాలో మాత్రం సమైక్యవాదులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 17వ రోజుకు చేరుకుంది. ఏపీఎన్జీవో, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉవ్వెతున్న సాగుతోంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని జాక్టో,రెవెన్యూ, ఉద్యోగులు అనంతపురం నగరంలో రిలే నిరాహర దీక్షలు చేపడుతున్నారు. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం, కదిరి, గుంతకల్ పట్టణాల్లో సమైక్య నిరసనలు మిన్నంటుతున్నాయి.