Sri Lanka Australia...
-
6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు.. దుమ్మురేపుతున్న లంక స్పిన్నర్
గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్ల ఘనత (19-9-42-5)తో చెలరేగాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. జయసూర్యకు జతగా విశ్వ ఫెర్నాండో 2 వికెట్లతో రాణించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జేమ్స్ మెక్‌కొల్లమ్ (35), హ్యారీ టెక్టార్ (34), పీటర్ మూర్ (14), లోర్కాన్ టకెర్ (21 నాటౌట్) రెండంకెల స్కోర్లు సాధించగా.. ముర్రే కొమిన్స్ (0), ఆండ్రూ బల్బిర్నీ (4), కర్టిస్ క్యాంఫర్ (0), జార్జ్ డాక్రెల్ (2) విఫలమయ్యారు. అంతకుముందు దిముత్ కరుణరత్నే (179), కుశాల్ మెండిస్ (140), దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 591 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్లు.. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి పతనాన్ని శాశించిన జయసూర్య దిగ్గజ బౌలర్ల సరసన చేరాడు. జయసూర్య కేవలం 6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు, ఓ సారి 10 వికెట్లు పడగొట్టి ఓవరాల్‌గా 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 5 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత ఆస్ట్రేలియా బౌలర్ రాడ్నీ హాగ్ పేరిట నమోదై ఉంది. ఇతను కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. టీమిండియా సంచలన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం 3 మ్యాచ్‌ల్లోనే 4 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌కు చెందిన టామ్ రిచర్డ్సన్ 4 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. ఆసీస్‌కు చెందిన చార్లీ టర్నర్ 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 8 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి నేటికి చెక్కుచెదరని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. -
పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 69వ ఓవర్ వేసిన శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే బౌలింగ్‌లో.. కమిన్స్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది. కమిన్స్ బాదిన షాట్ బౌలర్‌తో పాటు ప్రత్యర్ధి ఆటగాళ్లకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 109 పరుగుల అధిక్యం లభించింది. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా అరుదైన ఫీట్.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు Who’s going to find the ball Pat Cummins just hit out of Galle? 😆 Massive 😳😳😳😳 #SLvAUS pic.twitter.com/eiLQbblykn — ༒𝐵𝑒𝑖𝑛𝑔 𝑆𝒉𝑜𝑎𝑖𝑏 ✭✰(𝑲𝒌𝒓 𝑳𝒐𝒗𝒆𝒓 💜) (@drewmaccynt2) June 30, 2022 -
దిల్షాన్ చివరి ఆటలో శ్రీలంక పరాజయం
దంబుల్లా: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ వన్డే కెరీర్‌ను ఓటమితో ముగించేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారమిక్కడ జరిగిన మూడో వన్డేలో లంక రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 49.2 ఓవర్లలో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. చండిమల్ (130 బంతుల్లో 102; 7 ఫోర్లు) శతక్కొట్టాడు. రిటైర్మెంట్ క్రికెటర్ దిల్షాన్ 42 పరుగులు చేశాడు, ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, స్టార్క్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి గెలిచింది. బెయిలీ (99 బంతుల్లో 70; 5 ఫోర్లు), వేడ్ (46) రాణించారు. మిగిలిన వారిలో హెడ్ 36, ఫించ్ 30 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్, అపొన్సో, పెరిరా తలా 2 వికెట్లు తీశారు. బుధవారం నాలుగో వన్డే కూడా ఇక్కడే జరగనుంది. 39 ఏళ్ల దిల్షాన్ 330 వన్డేలు ఆడి 10,290 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి.