గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 69వ ఓవర్ వేసిన శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే బౌలింగ్‌లో.. కమిన్స్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది. కమిన్స్ బాదిన షాట్ బౌలర్‌తో పాటు ప్రత్యర్ధి ఆటగాళ్లకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 109 పరుగుల అధిక్యం లభించింది. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా అరుదైన ఫీట్.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు
Who’s going to find the ball Pat Cummins just hit out of Galle? 😆
— ༒𝐵𝑒𝑖𝑛𝑔 𝑆𝒉𝑜𝑎𝑖𝑏 ✭✰(𝑲𝒌𝒓 𝑳𝒐𝒗𝒆𝒓 💜) (@drewmaccynt2) June 30, 2022
Massive 😳😳😳😳
#SLvAUS pic.twitter.com/eiLQbblykn
Comments
Please login to add a commentAdd a comment