Sri Murali
-
కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
శ్రీ మురళి హీరోగా డా. సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బఘీర’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు డా. సూరి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ నీల్గారి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల రైటింగ్ విభాగంలో నేనూ ఉన్నాను. శ్రీ మురళిగారితో నేను ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు కథ కుదర్లేదు. అప్పుడు తన దగ్గర కథ ఉందని ప్రశాంత్ నీల్గారు చెప్పడంతో ‘బఘీర’ చిత్రం ప్రారంభమైంది. సూపర్ హీరో అవ్వాలనుకున్న ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి ప్రశాంత్ నీల్గారు హ్యాపీ ఫీలయ్యారు. శ్రీ మురళి బాగా నటించారు. ‘బఘీర’ను ‘కేజీఎఫ్’తో ΄ోల్చి మాట్లాడుతున్నారు. ‘బఘీర’ సినిమా ‘కేజీఎఫ్’ టోన్‌లో ఉండదు. ‘కేజీఎఫ్’ చరిత్రలాంటి సినిమా. ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల క్రితం యశ్‌తో ఓ సినిమా చేశాను (‘లక్కీ’). ఆ తర్వాత యశ్‌తో ట్రావెల్ అయ్యాను. యశ్ కథలను నేనే వినేవాడిని. అయితే యశ్‌తో నేను అనుకున్న సినిమా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ వల్ల యశ్‌కు చాలా సమయం పట్టింది. దీంతో నేను శ్రీ మురళితో ‘బఘీర’ చేశాను’’ అని తెలి΄ారు. -
ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌గా పుల్ ఫామ్‌లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
మహేష్ బాబును కలిసిన కార్తీ..
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సినిమా సెట్స్‌లో ఉన్న మహేష్ బాబును తమిళ హీరో కార్తీ కలిశాడు. మహర్షి చిత్ర సెట్‌ని సందర్శించిన కార్తీ.. మహేష్ బాబు, వంశీ పైడిపల్లితో సరదాగా ముచ్చటించాడు. ఈ సినిమా విశేషాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ‘దేవ్’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో కార్తీ, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఊపిరి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మహేష్‌ను కలిసిన కన్నడ హీరో.. కన్నడ హీరో శ్రీమురళి కూడా మహర్షి సెట్లో మహేష్‌ను కలిశాడు. ఆయనతోపాటు ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా మహేష్‌తో కాసేపు సరాదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని శ్రీమురళి తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. మహేష్ బాబు సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల స్పీడు పెంచారు. ఇటీవలే దర్శకుడు వంశీ ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభించాడు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా కేయు మోహన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. -
శాన్వి... ద డైరెక్టర్!
నిజమే.. శాన్వీ శ్రీవాత్సవ కథలు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే... డైరెక్టర్ కాలనుకుంటున్నారు కనుక! ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? లవ్లీ, అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన అమ్మాయే... ఈ శాన్వీ! ఇప్పుడు కన్నడలో ఫుల్ బిజీ హీరోయిన్. లాస్ట్ టు ఇయర్స్‌లో ఏడు సినిమాలు చేశారు. ఇప్పుడామె డైరెక్టర్ కావాలనుకుంటున్నది రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో! శివ రాజ్‌కుమార్, శ్రీమురళీ హీరోలుగా నటిస్తున్న కన్నడ సినిమా ‘మఫ్టీ’. అందులో శ్రీమురళికి జోడీగా, డైరెక్టర్ కావాలనుకునే పాత్రలో శాన్వి నటిస్తున్నారు. అదండీ సంగతి!! -
యజమాని మోసం!
ఆ మంత్రికి నమ్మినబంటు అతను. ఏ పని చెప్పినా మారు మాట్లాడకుండా చక్కబెట్టుకొస్తాడు. అయితే ఆ నమ్మకాన్ని ఆ మినిస్టర్ తన స్వార్థానికి వాడుకోవాలనుకుంటాడు. తాను సీఎం కావడానికి నమ్మినబంటుకే వెన్నుపోటు పొడిచి అతన్ని నేరంలో ఇరికించాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఊబిలోంచి అతను ఎలా బయటపడ్డాడు? తన యజమానికి ఎలా బుద్ధిlచెప్పాడు... అనే అంశాలతో రూపొందిన కన్నడ చిత్రం ‘రథావరం’. శ్రీ మురళి, రచితారామ్ జంటగా చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మంజునాథ్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంజునాథ్ మాట్లాడుతూ– ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. నమ్మకం, ప్రేమ, త్యాగం, స్నేహం.. ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో హిజ్రాల విశిష్టతను చెప్పే ప్రయత్నం చేశాం. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.