సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సినిమా సెట్స్‌లో ఉన్న మహేష్ బాబును తమిళ హీరో కార్తీ కలిశాడు. మహర్షి చిత్ర సెట్ని సందర్శించిన కార్తీ.. మహేష్ బాబు, వంశీ పైడిపల్లితో సరదాగా ముచ్చటించాడు. ఈ సినిమా విశేషాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ‘దేవ్’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో కార్తీ, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఊపిరి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
మహేష్‌ను కలిసిన కన్నడ హీరో..
కన్నడ హీరో శ్రీమురళి కూడా మహర్షి సెట్లో మహేష్‌ను కలిశాడు. ఆయనతోపాటు ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా మహేష్‌తో కాసేపు సరాదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని శ్రీమురళి తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. మహేష్ బాబు సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు.
మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల స్పీడు పెంచారు. ఇటీవలే దర్శకుడు వంశీ ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభించాడు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా కేయు మోహన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment