Sri Nagar NIT
-
క్లాసులకు రాకుంటే రేప్ చేయిస్తారట!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 2000 మంది స్థానికేతర విద్యార్థులు తరగతులను బహిష్కరించి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు శుక్రవారంతో ఎనిమిదో రోజుకు చేరింది. తమకు క్యాంపస్‌లో సురక్షితమైన వాతారణం లేదని, జమ్మూ-కశ్మీర్ కాకుండా వర్సిటీని మరోచోరుకు మార్చాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుండా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటే....స్థానికులతో రేప్ చేయిస్తామని కశ్మీర్‌కు చెందిన సహ విద్యార్థినులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అని బిహార్‌కు చెందిన ఓ విద్యార్థిని వాపోయింది. హాస్టల్లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అభద్రతాభావం ఎక్కువగా ఉందని తెలిపింది. తాము స్థానిక విద్యార్థులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్థానికేతర విద్యార్థులు స్పష్టం చేశారు. పరిస్థితులు సద్దుమణిగినట్లు అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కేవలం పది శాతం విద్యార్థులు తరగతులకు హాజరై, మిగతా 90% మంది తరగతులు బాయ్‌కాట్ చేస్తే సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లా అని వారు ప్రశ్నించారు. కాగా స్థానికేతర విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరిన వీడియో క్లిప్పింగ్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈనెల 11 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, అయితే ఇప్పుడు పరీక్షలు రాయని విద్యార్థులు అనంతరం రాయవచ్చని కేంద్ర బృందం తెలిపింది. క్యాంపస్‌లో గత శుక్రవారం, మంగళవారం జరిగిన ఘర్షణలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత కొంతమంది స్థానిక విద్యార్థులు క్యాంపస్‌లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోగా, స్థానికేతర విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. -
ఎన్ఐటీ వివాదంపై విచారణ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణలతో చెలరేగిన దుమారంపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం విచారణకు ఆదేశించింది. శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దీనిపై విచారణ జరిపి, 15 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తారని డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ విలేకరులకు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికేతర విద్యార్థులు తమ నిరసనను వరుసగా మూడోరోజూ కొనసాగించారు. లాఠీచార్జీ జరిపిన పోలీసులపై, తమను వేధించిన అధ్యాపకులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇన్స్టిట్యూట్ను కశ్మీర్ నుంచి తరలించాలని డిమాండ్‌చేశారు. విద్యార్థినులు కూడా నిరసనలో పాలుపంచుకున్నారు. భారత్ మాతా కీ జై అని నినదించారు. ఈనెల 11 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, అయితే ఇప్పుడు పరీక్షలు రాయని విద్యార్థులు తర్వాత రాయవచ్చని కేంద్ర బృందం చెప్పింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసు చీఫ్ కే రాజేంద్రకుమార్ క్యాంపస్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్యాంపస్‌లో గత శుక్రవారం, మంగళవారం జరిగిన ఘర్షణలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలుచేశారు. ఇప్పటిదాకా వీటిలో ఎవరి పేరును కూడా నమోదుచేయలేదు. స్థానికేతర విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరిన వీడియో క్లిప్పిం గ్ను పోలీసులు విడుదల చేశారు. తాము స్థానిక విద్యార్థులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్థానికేతర విద్యార్థులు చెప్పారు. పరిస్థితులు సద్దుమణిగాయని అధికారులు చెబుతుండటం అవాస్తవమన్నారు. 10% మంది విద్యార్థులు తరగతులకు హాజరై, 90% మంది బాయ్‌కాట్ చేస్తే సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లా అని ప్రశ్నించారు. లాఠీచార్జీని నిరసిస్తూ నేషనల్ ప్యాంథర్స్ పార్టీ, ఇతర సంస్థలు జమ్మూలో బంద్ నిర్వహించాయి. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం పరిష్కారంచూపదన్న విషయాన్ని బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు ఎప్పుడు గ్రహిస్తాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. -
శ్రీనగర్ ఎన్ఐటీలో ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రికంగా మారాయి. వారం రోజుల నుంచి స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య జరుగుతున్న ఘర్షణలు సద్దుమణగలేదు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బుధవారం కేంద్రం ఢిల్లీ నుంచి అధికార బృందాన్ని పంపింది. కాలేజీ ఆవరణలో దేశవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న నిట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికేతర విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం తమపై లాఠీచార్జీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఎన్ఐటీని కశ్మీర్ నుంచి వేరేప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు క్యాంపస్‌కు వచ్చి ఆందోళన చేస్తున్న స్థానికేతర విద్యార్థులతో చర్చించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని సీఎం మెహబూబా హామీ ఇచ్చారు. క్యాంపస్‌లో సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. క్యాంపస్‌లో తమకు భద్రత లేదని, ఎన్ఐటీని మరో ప్రాంతానికి తరలించాలని స్థానికేతరులు డిమాండ్ చేశారు. ముందుగా తమను ఇంటికి పంపాలని, ఆ తర్వాత మీరు ఎక్కడికి పంపితే అక్కడ చేరతామని కేంద్ర బృందానికి చెప్పారు. ఎన్ఐటీ అధికారులు తమ భవిష్యత్‌తో ఆటలాడుతున్నారని, వారు రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడేందుకు మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించాలన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఇరానీలు సీఎం మెహబూబాతో ఫోన్లో మాట్లాడారు. గతవారం టీ20 సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత కొంతమంది స్థానిక విద్యార్థులు క్యాంపస్‌లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోగా, స్థానికేతర విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి.