Sridevi Shoban Babu Movie
-
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగా డాటర్ సుస్మిత చిత్రం!
నటుడు సంతోష్ శోభన్, నటి గౌరి జి. కిషన్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి.. శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గత నెలలో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, తాజాగా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 30 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పల్లెటూరులో జరిగిన అందమైన ప్రేమకథాగా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ శ్రీదేవి ఓ ఫ్యాషన్ డిజైనర్. తన మేనత్తపై ప్రతీకారంతో అరకు వెళ్లిన ఆమె అక్కడ హీరో శోభన్ బాబును కలుసుకుంటుంది. ఆ తర్వాత శ్రీదేవి జీవితం ఎలా మారింది? అత్తపై ఆమె ప్రతీకారం తీర్చుకుందా? గతంలో తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు వంటి ఆసక్తికర సంఘటనలతో ఈ చిత్రం రూపొందింది. Sreedevi Shobhan Babu la entertainment flick March 30 nundi! 🍿🎬#SrideviShobanBabuOnHotstar premieres only on #DisneyPlusHotstar.@santoshsoban @Gourayy @sushkonidela #VishnuLaggishetty @dimmalaprasanth @GoldBoxEnt @NagaBabuOffl @SyedKamran @Saranyapotla pic.twitter.com/pdXiCWOgPj — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 15, 2023 -
మా ఇంట్లోనే హీరోలు.. కానీ ఎవరూ నాకు ఛాన్సివ్వలేదు: నాగబాబు
మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు. కానీ ఎవరూ ఏనాడూ పిలిచి క్యారెక్టర్ ఇవ్వలేదు అన్నాడు నటుడు నాగబాబు. సుస్మిత కొణిదెల మాత్రం తనకు రెండోసారి అవకాశం ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. శ్రీదేవి శోభన్‌బాబు ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. సంతోష్ శోభన్, గౌరి.జి.కిషన్ జంటగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. నూతన దర్శకుడు ప్రశాంత్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని విష్ణుప్రసాద్‌తో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించారు. ఈ నెల 18న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో హైదరాబాద్‌లో బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. 'మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు కానీ నాకెవరూ ఛాన్సివ్వలేదు. మా హనీ(సుస్మిత) మాత్రం నాకు రెండోసారి అవకాశమిచ్చింది. హనీ గురించి ఓ మాట చెప్పాలి. తను తల్చుకుంటే తనకు సపోర్ట్‌గా ఏ హీరో అయినా ముందుకు వచ్చేస్తాడు. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ నిర్మాతగా అన్ని కష్టాలు పడుతూ మీ ముందుకు ఈ సినిమా తీసుకొచ్చింది. తను త్వరలోనే మెగా ప్రొడ్యూసర్ అవుతుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ట్రైలర్ చూస్తుంటే ప్రశాంత్ ఏం చెప్పాడో అదే తీశాడనిపించింది. డైరెక్టర్‌గా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. సినీ ఇండస్ట్రీలో మెన్ డామినేషన్ ఉంటే టీవీ ఇండస్ట్రీలో వుమెన్ డామినేషన్ ఉంది. ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి పంపించకూడదు అన్న భ్రమలు ఇంకా ఉన్నాయి. అవకాశం వస్తే ఆడపిల్లలు మగవాళ్ల కన్నా బెస్ట్‌గా నటిస్తారు, బెస్ట్‌గా డైరెక్ట్ చేస్తారు, నిర్మిస్తారు' అని చెప్పుకొచ్చాడు నాగబాబు. చదవండి: అత్యంత చవక రేటుకు పఠాన్ టికెట్స్ -
'శ్రీదేవి శోభన్ బాబు' మూవీ ప్రెస్‌మీట్ ఫొటోలు