srija marriage
-
చంద్రబాబుతో అల్లు అరవింద్ భేటీ
హైదరాబాద్ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లో చంద్రబాబు ఫాంహౌస్‌కు అల్లు అరవింద్ చేరుకున్నారు. అనంతరం శ్రీజ ఆహ్వాన పెండ్లి పత్రికను చంద్రబాబుకు అందజేశారు. ఈ వివాహనికి హాజరుకావాలని చంద్రబాబును అల్లు అరవింద్ కోరారు. శ్రీజ వివాహం మార్చి 28వ తేదీన బెంగుళూరులోని చిరంజీవి ఫాం హౌస్‌లో జరగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీన హైదరాబాద్‌లోని రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
పెళ్లి కళ వచ్చేసింది...
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28న బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకల్లో భాగంగా శ్రీజను గురువారం పెళ్లికూతుర్ని చేశారు. ఆ సందర్భంగా కజిన్స్ అల్లు శిరీష్, నీహారిక, సొంత అక్క సుస్మితతో కలసి శ్రీజ దిగిన సెల్ఫీ ఇది. ‘‘మా ఇంట్లో శ్రీజ పెళ్లికూతురు ఫంక్షన్ జరిగింది’’ అంటూ ఈ ఫొటోను అల్లు శిరీష్ ట్విట్టర్లో పెట్టారు. -
మెగా మూవీస్‌కు బ్రేక్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మరో షాక్ తగిలింది. త్వరలోనే 150వ సినిమా ఎనౌన్స్ చేస్తారనుకున్న సమయంలో చిరు ఇంట్లో పెళ్లి సందడి మొదలు కావటంతో, మరోసారి చిరు సినిమా వాయిదా పడింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందర్భంగా తన రీ ఎంట్రీ సినిమాను రెండు నెలలు వాయిదా చేశాడు మెగాస్టార్. అంతేకాదు చరణ్ కూడా చెల్లి పెళ్లి కోసం బ్రేక్ తీసుకుంటున్నాడట. బ్రూస్ లీ సినిమా తరువాత ఇంతవరకు షూటింగ్లో పాల్గొనని రామ్ చరణ్, ఈ నెలాఖరున షూటింగ్ మొదలు పెడతారని భావించారు. అయితే శ్రీజ పెళ్లి పనులతో బిజీగా ఉండటంతో మరో పది రోజుల పాటు షూటింగ్‌కు హాజరు కాలేనంటూ దర్శక నిర్మాతలకు చెప్పేశాడట. మరి ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న చెర్రీ అనుకున్న సమయానికి సినిమాను ఎలా రెడీ చేస్తాడో చూడాలి. -
ఐ మిస్ యూ శ్రీజ: వరుణ్ తేజ్
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ప్రస్తుతం శ్రీజ పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే చిరు చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి వార్త హాట్ టాఫిక్‌గా మరిన విషయం తెలిసిందే. శ్రీజ వివాహం ఆమె చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్‌తో ఈ నెలలో జరగనుంది. ఓ వైపు కుటుంబం పెళ్లి పనుల్లో ఉంటే వధువు మాత్రం రిలాక్స్ అవుతోంది. సోదరుడు వరుణ్ తేజ్‌తో కలిసి శ్రీజ దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక సోదరితో కలిసి దిగిన ఫోటోలో వరుణ్ తేజ్ చాలా ఎమోషనల్‌గా ఐ మిస్ యూ శ్రీజ ...అన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా తమ అనుబంధానికి గుర్తుగా ఆ ఫోటోను అతడు తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. మరోవైపు శ్రీజ వివాహ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అంతవరకూ శ్రీజ పెళ్లిపై చిరంజీవి కుటుంబం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.