
ఐ మిస్ యూ శ్రీజ: వరుణ్ తేజ్
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ప్రస్తుతం శ్రీజ పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే చిరు చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి వార్త హాట్ టాఫిక్గా మరిన విషయం తెలిసిందే. శ్రీజ వివాహం ఆమె చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్తో ఈ నెలలో జరగనుంది. ఓ వైపు కుటుంబం పెళ్లి పనుల్లో ఉంటే వధువు మాత్రం రిలాక్స్ అవుతోంది. సోదరుడు వరుణ్ తేజ్తో కలిసి శ్రీజ దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక సోదరితో కలిసి దిగిన ఫోటోలో వరుణ్ తేజ్ చాలా ఎమోషనల్గా ఐ మిస్ యూ శ్రీజ ...అన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా తమ అనుబంధానికి గుర్తుగా ఆ ఫోటోను అతడు తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. మరోవైపు శ్రీజ వివాహ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అంతవరకూ శ్రీజ పెళ్లిపై చిరంజీవి కుటుంబం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.