
చంద్రబాబుతో అల్లు అరవింద్ భేటీ
హైదరాబాద్ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్లో చంద్రబాబు ఫాంహౌస్కు అల్లు అరవింద్ చేరుకున్నారు. అనంతరం శ్రీజ ఆహ్వాన పెండ్లి పత్రికను చంద్రబాబుకు అందజేశారు. ఈ వివాహనికి హాజరుకావాలని చంద్రబాబును అల్లు అరవింద్ కోరారు. శ్రీజ వివాహం మార్చి 28వ తేదీన బెంగుళూరులోని చిరంజీవి ఫాం హౌస్లో జరగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీన హైదరాబాద్లోని రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.