కూచిభొట్లకు ‘కాన్సస్’ నివాళి!
మార్చి 16న ‘భారతీయ–అమెరికన్ ప్రశంస దినం’
వాషింగ్టన్: అమెరికాలో జాతివిద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభొట్ల గౌరవార్ధం మార్చి 16ను ‘భారతీయ–అమెరికన్ ప్రశంస దినం’(అప్రీసియేషన్ డే)గా జరుపుకోవాలని కాన్సస్ రాష్ట్రం నిర్ణయించింది. కాన్సస్ రాజధానిలో భారతీయ అమెరికన్లు పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమంలో ఆ విషయాన్ని ్సస్ గవర్నర్ బ్రౌన్‌బాక్ వెల్లడించారు. ఫిబ్రవరి 22న కాన్సస్‌లోని ఒలేతేలో అమెరికా నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు సమాజంలో విభేదాలు సృష్టించలేవని, కాన్సస్ సంస్కృతి అది కాదని బ్రౌన్ అన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల గవర్నర్ బహిరంగ క్షమాపణలు చెప్పారు.
అలోక్, గ్రిలట్‌లు వేగంగా కోరుకోవాలని అభిలషించారు. భారతీయ సమాజానికి అండగా ఉండేందుకు కాన్సస్ కట్టుబడి ఉందని, హింస, హాని చేసే చర్యల్ని ఎల్లప్పుడూ తిరస్కరిస్తామని, విద్వేషం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాల్పుల్లో గాయపడ్డ మేడసాని అలోక్, గ్రిలట్‌లు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలను ‘సిక్కు అవగాహన, స్మారక నెల’గా జరుపుకోవాలని డెలావేర్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. ఆ మేరకు అసెంబ్లీలోని సెనేట్, ప్రతినిధుల సభలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి.
ఐరాసకు నిధుల కోత సరికాదు: గుటెరస్
ఐక్యరాజ్యసమితికి అమెరికా చేస్తున్న సాయంలో అర్థాంతరంగా కోత పెట్టే నిర్ణయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తప్పుపట్టారు. దీనివల్ల సమితి చేపడుతున్న దీర్ఘకాలిక సంస్కరణలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.