Srinivasa chari
-
1,416 టీచర్ పోస్టులు ఖాళీ
నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,416 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు ఈ పోస్టులు భర్తీ కావొచ్చన్నారు. మాల్తుమ్మెద ఉన్నత పాఠశాలలో మంగళవారం పలు పాఠశాలల హెచ్ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల పనితీరుకు సంబంధించి సూచనలిచ్చేందుకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనతీరు, బోధనోపకరణాల వినియోగం, పరీక్షల నిర్వహణపై ప్రత్యేకమైన ఫార్మాట్‌ను రూపొందించామని, దీనిని ఉపాధ్యాయులే పూరించి ప్రధానోపాధ్యాయుడికి సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈ ఫార్మాట్‌ను హెచ్ఎం తనిఖీచేసి మండల విద్యావనరులకేంద్రానికి పంపుతారన్నారు. అక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఆయా మండల కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ తెలిపారు. 1, 2తరగతులకు సంబంధించి తెలుగు, గణితం సబ్జెక్టులపై, 3, 4, 5 తరగతులకు సంబంధించి ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్టుపై మూడు రోజుల చొప్పున శిక్షణ ఉంటుందన్నారు. జిల్లాలో గతేడాది పదో తరగతి పరీక్షల్లో 89.31 శాతం ఉత్తీర్ణులయ్యారని, ఈసారి వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో సాగుతున్నామని డీఈఓ తెలిపారు. జిల్లాలో 566 పాఠశాలల్లో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరగవచ్చన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేస్తామన్నారు. అనంతరం ఆయన గోపాల్పేట ఉన్నత పాఠశాలను, మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి, మాల్తుమ్మెద, గోపాల్పేట, ఆత్మకూర్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రతాప్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, అరుణజ్యోతి ఉన్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో అధికారుల తనిఖీలు
నిజామాబాద్‌అర్బన్ : ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాలపై తనిఖీలకు ఉపక్రమించడమే ఇందుకు ప్రధానకారణం. జిల్లాలో మూడు రోజులుగా ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యాబోధన తీరును విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో 850 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 410 పాఠశాలలకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. సగం పాఠశాలలకు సానిటేషన్ సౌకర్యం లేదు. అలాగే ఆటస్థలాలు లేకుండానే పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన లోపాలున్న పాఠశాలలు యాజమాన్యాల పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకల్లా మారింది. తనిఖీలకు వచ్చే అధికారులను ప్రలోభాలకు గురిచేసి తప్పిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని 66 పాఠశాలలకు గుర్తింపు లేదు. ఉన్న పాఠశాలల్లో రెన్యూవల్ లేకుండా మరి కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలి సింది. తనిఖీలను చేపడుతున్న అధికారులు ప్రతి రోజు నివేదికలను డీఈఓ శ్రీనివాసచారికి అం దిస్తున్నారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో పాఠశాలల్లో అదనపు సెక్షన్ల నిర్వహణ , మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేకపోవడం ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై కూడా అధికారులు పరిశీలన చేయనున్నారు. 80 శాతం పైగా ప్రైవేట్ పాఠశాలల్లో అసౌకర్యాలే ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలుతోంది. వేలాది ఫీజులు వసూలు చేస్తున్నా సౌకర్యాల ఏర్పాటులో యజమాన్యాల నిర్ల క్ష్య వైఖరి బట్టబయలవుతోంది. కొనసాగుతున్న దాడులు నాలుగవ రోజు శుక్రవారం జిల్లా వ్యా ప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు జరి గాయి. ఒక్కరోజే 56 పాఠశాలలను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఆయా మండల కేంద్రాల్లో నియమించిన ప్రత్యేక బృందాలు పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేశాయి. చాలా చోట్ల సక్రమమైన భవనాలు లేకపోవడం , శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరని తేలింది.తనిఖీల్లో భాగంగా పాఠశాల ఆర్జేడీ మస్తానయ్యా నేడు జిల్లాకు రానున్నారు.పాఠశాలల్లో మౌలిక వసతులు, అనుమతులను పరిశీలించనున్నారు. సరైన సమాచారం ఇవ్వాలి - డీఈవో శ్రీనివాసచారి ప్రైవేట్ పాఠశాలలకు తనిఖీలకు వెళ్లిన అధికారులకు పాఠశాల యజమాన్యాలు సరైన సమాచారం ఇవ్వాలి, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. విద్యార్థుల కు మెరుగైన విద్యనందించేందుకు ఈ పరి శీలన కొనసాగుతోంది. అన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తనిఖీల బృందాలకు సహకరించాలి. విద్యాహక్కు చట్టం అమలుకు కృషి -జిల్లా పరిశీలకులు రాంచందర్ బాన్సువాడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకు కృషి చేస్తున్నామని, విద్యా ప్రమాణాలు విద్యార్థులకు పూర్తి సాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ జిల్లా పరిశీలకులు రాంచందర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించలేకపోయామన్నారు. ఉపాధ్యాయులు స్వయం అధ్యయనంతోనే విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని సింధు, వివేకానంద పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలలను సందర్శించి నూతన పాఠ్యాంశాలపై విద్యార్థుల అభిప్రాయాలు, తరగతి గదుల పరిశీలన, మౌలిక వసతులు, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల విద్యార్హతలపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏవిధం గా బోధిస్తున్నారు, వారి విద్యార్హతలు ఏ మేరకు పాటిస్తున్నారు, అనే అంశాలపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని అన్నారు. తన తనిఖీలో రెండు పాఠశాలల్లో గ్రంథాలయాలు, ల్యాబ్‌లు లేవని తెలిపారు.