srinivasamurthi
-
బెంగళూరు హింస: ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే
బెంగళూర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో అల్లరి మూకలు ధ్వంసం చేసిన తన నివాసాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ‘అల్లరిమూకల దాడిలో విలువైన వస్తువులన్నీ కోల్పోయాను..నా ఇంటిని ధగ్ధం చేశారు..నాకు ఏమీ అవసరం లేదు..నా తల్లి మంగళసూత్రం ఎవరికైనా కనిపిస్తే దయచేసి దాన్ని తిరిగి ఇచ్చేయండ’ని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే బంధువు ఓ వర్గానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో ఆందోళనకారులు రెండు రోజుల కిందట ఆయన ఇంటిపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అల్లర్ల కారణంగా ముగ్గురు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఎమ్మెల్యే తన భార్య, పిల్లలతో తమ ఇంటి వద్దకు రాగా, పెద్దసంఖ్యలో ఆయన మద్దతుదారులు మూర్తి ఇంటివద్ద గుమికూడారు. కాగా ఇంటి ఆవరణలో మంగళసూత్రం కనిపించడంతో తిరిగి ఎమ్మెల్యేకు అందచేశారు. ఆయన పిల్లలు, మేనల్లుళ్లు, మేనకోడళ్ల మార్కుల కార్డులు కాలిబూడిదవడంతో వారు తీవ్రంగా కలత చెందారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తితో పాటు ఆయన సోదరులు సైతం పూర్వీకుల నుంచి వచ్చిన అదే ఇంటిలో నివసిస్తున్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన దాడిగా శ్రీనివాసమూర్తి ఆరోపించారు. ఎవరో చేసిన పొరపాటుకు తన ఇంటిపై ఎందుకు దాడి చేశారో అర్ధం కావడంలేదని, తన ఇంటిని దగ్ధం చేసిన వారికి తాను ఏం హాని చేశానని ప్రశ్నించారు. తన భార్యకు, పిల్లలకు హాని జరిగితే బాధ్యత ఎవరిదని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని ఆయన కోరారు. కాగా బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఇప్పటికి ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు తన ఇంటిపై అల్లరి మూకల దాడి గురించి ఆయన డీజే హళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను సురక్షిత ప్రాంతంలో ఉండటంతో పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ఫిర్యాదులో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చదవండి : భగ్గుమన్న బెంగళూరు! -
రాజీతోనే కేసుల పరిష్కారం
లీగల్ (కడప అర్బన్) : దీర్ఘకాలికంగా పరిష్కారం కాని కేసులను రాజీ మార్గంలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవడమే శుభ పరిణామమని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి అన్నారు. నేషనల్ లోక్ అదాలత్ పిలుపు మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ భవన్లో కేసుల పరిష్కార కార్యక్రమాన్ని న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్జి అన్వర్‌బాషా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్, మెజిస్ట్రేట్ శోభారాణి, న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులు పాల్గొన్నారు. 1349 కేసులు పరిష్కారం: జిల్లా వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ పిలుపు మేరకు వివిధ కోర్టుల్లో రాజీ మార్గం ద్వారా 1349 కేసులను శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిష్కరించారు. ఈ పరిష్కారం ద్వారా ఆ కేసుల్లో బాధితులకు రూ. 2,06,66,232 నష్టపరిహారంగా లభించింది. ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. -
ఇష్టారాజ్యం
ఆమె ఓ మండల విద్యాశాఖాధికారిణి. వంద మందికి పైగా ఉపాధ్యాయులు ఆమె పర్యవేక్షణలో పనిచేస్తుంటారు. ప్రతినెల రూ. 25 లక్షల సర్కారు ధనం ఆమె చేతుల మీదుగా పంపిణీ అవుతుంటుంది. అంతటి గురుతర బాధ్యతను ప్రభుత్వం ఆమె నెత్తిన పెడితే బాధ్యత మరిచిన ఆ అధికారిణి ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అక్రమార్కులకు అండగా నిలిచి నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఫలితంగా ఆ మండలంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తొండూరు మండల విద్యాశాఖలో రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమాలు ఒక్కొక్కటే చీకటిమాటు నుంచి వెలుగులోకి వస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా అక్కడి అధికారిణి ఒక్కొక్కరికి ఒక్కో రూల్ వర్తింపజేస్తుండటం ఆ శాఖలో అసంతృప్తికి దారితీసింది. తనకు నచ్చని ఉపాధ్యాయుల తప్పులను అదే పనిగా వెతికి పట్టుకుని వారికి మెమోలు పంపించడం, తరచూ వారి పాఠశాలలు తనిఖీ చేయడం, వారిపై ఉన్నధికారులకు ఫిర్యాదు చేయడంలాంటి కక్షసాధింపు చర్యలు అక్కడి ఉపాధ్యాయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో తన అడుగులకు మడుగులొత్తే కొందరు అయ్యవార్లు నెలల తరబడి బళ్లకు ఎగనామం పెడుతున్నా వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం, వారి నెలసరి జీతాలు రెగ్యులర్‌గా మంజూరు చేయడంలాంటి అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఈ వివాదాలు మండలం దాటి జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. తొండూరు మండలం పాలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మొలకల శ్రీనివాసమూర్తికి మానసిక ఆరోగ్యం సరిగా లేదు. బడికి వెళ్లి పిల్లలకు పాఠాలు బోధించే స్థితిలో ఆయన లేరు. నెలకు అక్షరాలా అరలక్ష రూపాయలు జీతం తీసుకునే ఆయన నిత్యం పులివెందుల పురవీధుల్లో సంచరిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారిచే జీతనష్టంపై సెలవు పెట్టించడం గానీ,స్వచ్చంద పదవీ విరమణ గానీ చేయిస్తుంటారు. అయితే తొండూరు ఎంఈఓ ఆ పని చేయలేదు. అతని స్థానంలో ఓ బినామీ వ్యక్తి పని చేయడానికి అంగీకారం తెలిపారు. తన వాటా తీసుకుంటూ క్రమం తప్పకుండా నెలసరి వేతనం శ్రీనివాసమూర్తి అకౌంట్లో జమ చేస్తోంది. ఆశ్చర్యమేమిటంటే ఆ బినామీ వ్యక్తే సాక్షాత్తు ఉపాధ్యాయుల హాజరుపట్టిలో రెండేళ్లుగా శ్రీనివాసమూర్తి సంతకాన్ని ప్రతిరోజూ ఫోర్జరీ చేస్తుండటం చూస్తే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను మ్యూచువల్ డిప్యూటేషన్‌పై ఒకచోట నుంచి మరోచోటికి పంపించే అధికారం ఎంఈఓలకు లేదు. డీఈఓ, ఆర్జేడీ లాంటి ఉన్నతాధికారులు సైతం ఇలాంటి సాహసం చేయలేరు. అయితే ఈ అధికారిణి గంగనపల్లెలో పనిచేసే అయ్యవారును పోతులపల్లెకు, పోతులపల్లెలో పనిచేసే ఉపాధ్యాయురాలిని గంగనపల్లెకు మ్యూచువల్ డిప్యూటేషన్‌పై పంపించి నిబంధనలకు నీళ్లు వదిలింది. తొండూరు జెడ్పీ హెస్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి రెండేళ్ల క్రితం మండల విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె సభలు, సమావేశాలకు వెళుతున్నప్పుడల్లా ఉన్నత పాఠశాల బాధ్యతను సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించకుండా ఓ జూనియర్ అయ్యవారుకు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై సదరు సీనియర్ ఉపాధ్యాయుడు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తొండూరు ఉన్నత పాఠశాలకు వచ్చిన నిధుల విషయంలో కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా టీచర్ల గ్రాంట్లను అక్కడి ఉపాధ్యాయులకు అందజేయనట్లు సమాచారం. ఈ విషయం కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ప్రాథమిక పాఠశాలల్లో డుమ్మారాయుళ్లు ఇటీవలి కాలంలో అధికమయ్యారు. ఓ ఉపాధ్యాయుడు తనకు పక్షవాతం సోకిందని నెలల తరబడి ఎలాంటి సెలవు పెట్టకుండా బడికి డుమ్మా కొడుతున్నా అడిగే వారే కరువయ్యారు. మరొక సీనియర్ ఉపాధ్యాయుడు వారానికోరోజు బడికెళ్లి సంతకాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ఎంఆర్పిగా పనిచేసిన ఓ అయ్యవారు రోజంతా ఎంఆర్సిలోనే కాలక్షేపం చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. వీరంతా అధికారిణి అండతోనే బళ్లకు ఎగనామం పెడుతున్నారని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై డీఈఓ అంజయ్య వివరణ కోరగా తన దృష్టికి ఈ విషయాలు రాలేదన్నారు. అయినప్పటికీ ఆరోపణలపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా -
పెంచిన చేతులతోనే విషమిచ్చి..
ఓర్వకల్లు(రూరల్), న్యూస్‌లైన్: తీవ్ర తలనొప్పితో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ తన ఐదేళ్ల కూతురితోసహా ఆత్మహత్యకు పాల్పడింది. తాను మరణిస్తే కూతురు దిక్కులేనిదవుతుందని భావించి ఆమె గోరుముద్దలుపెట్టిన చేతులతోనే విషమిచ్చింది. తనతోపాటు మృత్యులోకానికి తీసుకెళ్లింది. ఈ ఘటన గురువారం ఓర్వకల్లు మండలం పాలకొల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. పాలకొల్లు గ్రామానికి చెందిన వడ్డె ఎల్లప్ప, లక్ష్మిదేవి దంపతులు తమ కూతురు రాజేశ్వరి (23)ని బేతంచెర్లకు చెందిన వెంకటరాముడికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒ క కూతురు. ఎలాంటి కలతలు లేకుండా సాఫీగా సాగిపోతున్న తరుణం లో రాజేశ్వరికి తీవ్ర తలనొప్పి సోకింది. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. 6 నెలల క్రితం బేతంచెర్లను వదిలి పాలకొల్లుకు వచ్చి నివాసం ఏర్పా టు చేసుకున్నారు. ఈ క్రమంలో తలనొ ప్పి మరింత ఎక్కువ కావడంతో గురువా రం తెల్లవారుజామున తన ఐదేళ్ల కూతు రు ఇందుకు థిమెట్ గుళికలు తినిపించి తాను కూడా తిని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరూ మరణించారు. భర్త వెంకటరాముడు పాలీష్ కటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాలుకా సీఐ శ్రీనివాసమూర్తి, ఓర్వకల్లు ఎస్ఐ చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తహశీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో వీఆర్ఓ చంద్రమౌళీశ్వరరెడ్డి పంచనామా నిర్వహించారు.