Sripad Naik
-
9 నెలల్లో ఏకంగా 3186 సార్లు ఉల్లంఘన
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ఆగడాలు సరిహద్దుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికి పాక్ మాత్రం దాన్ని తుంగలో తొక్కుతూ తరచూ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇదే తరహా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే సరిహద్దులో అప్రమత్తంగా ఉండే భారత సైన్యం… పాకిస్తాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉంటుంది. అయితే 17 ఏళ్లలో మొదటిసారి సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కువసార్లు ఉల్లంఘించింది. ఈ జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు దాదాపు తొమ్మిది నెలల్లో 3186 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. అయితే ప్రతిసారి భారత సైన్యం పాకిస్తాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ ప్రాంతంలో 242 సరిహద్దు కాల్పులు (జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు) జరిగాయని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభలో తెలిపారు. (చదవండి: భారత్‌పై ఆన్లైన్ వార్‌కు పాక్ కుట్ర) ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనల సందర్భంగా ఎనిమిది మంది ఆర్మీ సిబ్బంది దేశం కోసం మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు చంపబడ్డారు, అనేక ఇళ్ళు, భవనాలు ధ్వంసమయ్యాయని శ్రీపాద్ నాయక్ తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు 2,432 కాల్పుల విరమణ ఉల్లంఘనలు నమోదయ్యాయని ఇవి అప్రకటిత దాడులే కాక 2003 కాల్పుల విరమణ అవగాహనకు విరుద్ధంగా జరిగాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరణతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం కూడా పెరిగింది. 2019 అంతటా సుమారు 2,000 కాల్పుల విరమణ ఉల్లంఘనలు మాత్రమే జరిగాయి. -
19 కొత్త ఎయిమ్స్‌లలో ఆయుర్వేద శాఖలు
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుచేసిన 19 ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లలో ఆయుర్వేద శాఖలను నెలకొల్పనున్నట్లు ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), ఇతర పారమిలటరీ దళాలకు చెందిన ఏడు ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖలను ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 100 ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని నాయక్ తెలిపారు. అంటురోగాలుకాని వ్యాధుల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన జాతీయ పథకాన్ని ఇప్పుడున్న ఆరు రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు. -
మోదీకి కలిసొచ్చిన గోవా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి గోవా రాజకీయంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగినప్పటికీ ఆయన్ను సీఎం పదవిలో కొనసాగిస్తూ గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జూన్‌లో గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో మోదీని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నియమించారు. దీంతో ఆయన ప్రధాని కాగలిగారు. ఈ నేపథ్యంలోనే చిన్న రాష్ర్టమైన గోవా రెండు కేంద్ర మంత్రి పదవులను పొందగలిగింది. కేబినెట్లో ఇప్పటికే గోవాకు చెందిన శ్రీపాద్ నాయక్ ఉండగా తాజాగా మాజీ సీఎం పారికర్ చేరారు. -
పబ్ కల్చర్‌ను నియంత్రించాలి: శ్రీపాద్ నాయక్
పనాజీ: దేశంలో పబ్ కల్చర్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందని, దీని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అభిప్రాయపడ్డారు. ఆదివారం గోవాలో ఆయన మాట్లాడుతూ.. పబ్ సంస్కృతి మనదేశానికి సరిపడదని, అందువల్ల దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. మనదేశ సంస్కృతికి పబ్ కల్చర్ సరిపడదని, బీచ్‌ల్లో బికినీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేసి గోవా మంత్రి సుదీన్ ధావలీకర్ విమర్శలపాలైన సంగతి తెలిసిందే.