Srivari Bramhostavams
-
నేడు శ్రీవారికి సీఎం పట్టువ్రస్తాల సమర్పణ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడసేవను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి అనంతరం సాయంత్రం పెద్దజియ్యర్స్వామి వారి మఠం చేరుకుని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. సంప్రదాయం ప్రకారం అక్కడి నుంచి మేళతాళాల నడుమ ఆలయానికి చేరుకుని పట్టువ్రస్తాలు సమర్పించి, గరుడ వాహన సేవలో పాల్గొంటారు. తదనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. గురువారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుని, నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలసి కర్ణాటక రాష్ట్ర చారిటీస్ సత్రాలకు శంకుస్థాపన చేస్తారు. ఉద యం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అమరావతికి వెళ్లనున్నారు. ఇదిలావుండగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఏడాదీ స్వామివారికి సీఎం హోదాలో పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. (ఏపీకి నిధులు ఇవ్వండి) కోవిడ్–19 దృష్ట్యా ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గరుడ సేవ రోజున సీఎం పట్టువ్రస్తాలు సమర్పించేలా టీటీడీ బోర్డు ఆహ్వానించింది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం హోదాలో స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అదే హోదా లో స్వామివారికి పట్టువ్రస్తాలు సమరి్పంచే అరుదైన గౌర వం దక్కడం విశేషం. ఆయన ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది రెండోసారి. -
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
– టీటీడీ ఈవో సాంబశివరావు – 25 లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశం – గరుడ సేవ రోజున శ్రీవారి మెట్టు మార్గంలో 24 గంటలూ భక్తులకు అనుమతి – 7 లక్షల లడ్డూలు నిల్వకు ఆదేశం సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఈనెల 25వ తేదిలోపు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. భక్తుల దర్శనం కోసం గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తామన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను ఆలయ వీధుల్లోని గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు. వారికి మంచినీరు, ఆహారం సరఫరా చేస్తామన్నారు. గరుడ వాహన సేవ రోజున భక్తులు శ్రీవారి మెట్టుమార్గంలో అధిక సంఖ్యలో నడిచివచ్చే అవకాశం ఉన్నందున ఆరోజు రాత్రి ,పగలూ అనుమతిస్తామన్నారు. అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. నిత్యాన్నప్రసాద భవనంలో కూడా రాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే చర్యలు చేపట్టామన్నారు. అదే రోజు ఆలయంలో మూలమూర్తి దర్శనం కూడా అత్యధిక సంఖ్యలో భక్తులకు కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండే చర్యలు చేపట్టామన్నారు. 16న జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ నిర్వహిస్తామన్నారు. ఇక 27వ తేదిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామన్నారు.