సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గరుడసేవను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి అనంతరం సాయంత్రం పెద్దజియ్యర్‌స్వామి వారి మఠం చేరుకుని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. సంప్రదాయం ప్రకారం అక్కడి నుంచి మేళతాళాల నడుమ ఆలయానికి చేరుకుని పట్టువ్రస్తాలు సమర్పించి, గరుడ వాహన సేవలో పాల్గొంటారు.
తదనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. గురువారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుని, నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలసి కర్ణాటక రాష్ట్ర చారిటీస్ సత్రాలకు శంకుస్థాపన చేస్తారు. ఉద యం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అమరావతికి వెళ్లనున్నారు. ఇదిలావుండగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఏడాదీ స్వామివారికి సీఎం హోదాలో పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. (ఏపీకి నిధులు ఇవ్వండి)
కోవిడ్–19 దృష్ట్యా ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గరుడ సేవ రోజున సీఎం పట్టువ్రస్తాలు సమర్పించేలా టీటీడీ బోర్డు ఆహ్వానించింది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం హోదాలో స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అదే హోదా లో స్వామివారికి పట్టువ్రస్తాలు సమరి్పంచే అరుదైన గౌర వం దక్కడం విశేషం. ఆయన ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment