Srivari visit
-
శ్రీవారిసేవలో శ్రీలంక అధ్యక్షుడు
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం వేకువజామున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులు, పోలీసుల సమన్వయ లోపం వల్ల మైత్రిపాల సిరిసేన కొద్ది సమయం నిరీక్షించాల్సి వచ్చింది. స్వామి దర్శనం పూర్తిచేసుకొని వాహనాల వద్దకు చేరుకున్న సిరిసేన డ్రైవర్ ఆలయంలోనే ఉండిపోవడంతో కాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. మైత్రిపాల వెలుపలకు వస్తున్నారనే సమాచారం ఆలయ అధికారులు పోలీసులకు ఇవ్వకపోవడంతో కాన్వాయ్ డ్రైవర్లు లోపలే ఉండిపోయారు. దీంతో అధ్యక్షుడు డ్రైవర్ వచ్చే వరకు కారులో వేచి ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ జయలక్ష్మీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీవారి సేవలో సింగ్పూర్ రాయబారి
తిరుమల: సింగపూర్ రాయబారి గోపీనాథ్పిళ్లై ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన కటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
రేపు తిరుమలలో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన
తిరుమల: రేపు తిరుమల తిరుపతిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రేణిగుండ విమానశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి 3.15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రణబ్ శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు తిరుమల నుంచి ఆయన తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి బస చేసే పద్మావతి ప్రాంతంలోని గదులను టీటీడీ బ్లాక్ చేసినట్టు పేర్కొంది. ప్రోటోకాల్ పరిధిలోని వారికే వీఐపీ దర్శనాలు ఉంటాయంది. మధ్నాహ్నం 3 గంటలకు వృద్ధుల దర్శనం రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అంతేకాక వీఐపీ దర్శనాలను కుదింపు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, తిరుమల తిరుపతిలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా మాడ విధుల్లో గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. -
ఐదు గంటల్లో శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు 41,575 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శన భక్తులకు కేవలం ఐదు గంటలు, కాలిబాట భక్తులకు రెండు గంటల సమయంలోనే స్వామి దర్శనం లభిస్తోంది. గదులు సులభంగా లభించాయి. -
ఏపీ రాజధానికి కొత్త మాస్టర్ ప్లాన్
సింగపూర్ మంత్రి షణ్ముగం అభిషేక సేవలో శ్రీవారి దర్శనం సాక్షి,తిరుమల: ఏపీ కొత్త రాజధానికి సరికొత్త హంగులతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సింగపూర్ మంత్రి షణ్ముగం అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన అభిషేక సేవలో మంత్రి నారాయణతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. తమ దేశంలోని ఓ సంస్థ ఈ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తోందని, దీన్ని జూన్ నెలాఖరులో అందజేస్తామన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ సజావుగా సాగుతోందని, ఇప్పటి వరకు 25,200 ఎకరాలు పూర్తి అయ్యిందన్నారు.