ఏపీ రాజధానికి కొత్త మాస్టర్ ప్లాన్ | New master plan for AP capital | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధానికి కొత్త మాస్టర్ ప్లాన్

Published Sat, Feb 28 2015 2:44 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

ఏపీ రాజధానికి కొత్త మాస్టర్ ప్లాన్ - Sakshi

ఏపీ రాజధానికి కొత్త మాస్టర్ ప్లాన్

సింగపూర్ మంత్రి షణ్ముగం  అభిషేక సేవలో శ్రీవారి దర్శనం
 సాక్షి,తిరుమల: ఏపీ కొత్త రాజధానికి సరికొత్త హంగులతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సింగపూర్ మంత్రి షణ్ముగం అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన అభిషేక సేవలో మంత్రి నారాయణతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. తమ దేశంలోని ఓ సంస్థ ఈ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోందని, దీన్ని జూన్ నెలాఖరులో అందజేస్తామన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.  మంత్రి నారాయణ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ సజావుగా సాగుతోందని, ఇప్పటి వరకు 25,200 ఎకరాలు పూర్తి అయ్యిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement