ఎస్ఎస్ఏ ఎఫ్‌ఏఓగా శ్రీనివాసులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎట్టకేలకు సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఎఫ్ఏఓ పోస్టును భర్తీ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి జీతాలు రావడం లేదని, రూ.6.06కోట్ల బడ్జెట్ మంజూరైనా ఎఫ్ఏసీ పోస్టు ఖాళీగా ఉండటంతో వాటిని డ్రా చేయలేని పరిస్థితి నెలకొందంటూ ‘సాక్షి’లో శుక్రవారం ‘నిధులున్నా..నిష్ప్రయోజనం’ శీర్షికతో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు అధికారులు స్పందించి ఎస్ఎస్ఏ ఎస్పీడీ అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లారు.
ఎస్పీడీ శ్రీనివాస్ స్పందించి ఎఫ్ఏఓ బాధ్యతలను ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాసులుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం పీఓ సుబ్రమణ్యం నియామక ఉత్తర్వులను శ్రీనివాసులకు అందజేశారు. ఆయన బాధ్యతలూ తీçసుకున్నారు. వెంటనే జీతాలకు సంబంధించిన ఫైలును క్లియర్ చేశారు. అందరీ ఉద్యోగులకు రెన్నెళ్ల జీతాలు జమ చేస్తున్నట్లు ఎఫ్ఏఓ తెలిపారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జూన్ జీతం వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.