ST atrasiti case
-
మాచర్ల టీడీపీలో ఆధిపత్య పోరు !
► పట్టణ మున్సిపాల్టీలో యుద్ధవాతావరణం ► కత్తులు దూసుకుంటున్న చైర్మన్, వైస్‌చైర్మన్ వర్గాలు ► మాట వినని అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయింపు అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నతాధికారులకు శాపంగా మారాయి. జిల్లాలోని మాచర్ల మున్సిపాల్టీలో ఉద్యోగం అంటేనే అధికారులు హడలిపోతున్నారు. మా కొద్దు బాబోయ్ మాచర్ల అంటూ పరారవుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య వైరానికి అధికారులు బలవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో జైలు ఊసలు లెక్కిస్తున్నారు. మున్సిపాల్టీలో రూ. 4 కోట్లకు పైగా నిధులు ఉన్నా ప్రజల గొంతు తడవని దుస్థితి నెలకొనడం ఇక్కడి దారుణాలకు దర్పణం పడుతోంది. టీడీపీ నేతలే అభివృద్ధి నిరోధకులుగా మారారని మాచర్ల పట్టణం కోడై కూస్తోంది. సాక్షి, గుంటూరు : మాచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య నెలకొన్న అంతర్యుద్ధానికి ఇప్పటికే అనేక మంది అధికారులు అన్యాయానికి గురయ్యారు. మాట వినని అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిజేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ముగ్గురు కమిషనర్లు, ఒక డీఈఈపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడం ఇక్కడి దారుణ పరిస్థితిని కళ్లకు కడుతోంది. రెండు గ్రూపులుగా కౌన్సిలర్లు... మాచర్లలో జరిగిన ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలైన మధుబాబు, చలమారెడ్డిలను ఇన్చార్జిలుగా నియమిస్తూ టీడీపీ నిర్ణయించింది. దీంతో ఇద్దరు ఇన్చార్జిలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ మున్సిపల్ కౌన్సిలర్లను రెండు గ్రూపులుగా చీల్చేశారు. అంతటితో ఆగకుండా తమ ప్రతాపాన్ని మున్సిపల్ అధికారులపై చూపుతూ వస్తున్నారు. రెండేళ్ళ వ్యవధిలో మున్సిపాలిటీకి ఐదుగురు కమిషనర్లు మారడం ఇక్కడి దారుణ పరిస్థితిని తెలియజేస్తోంది. కమిషనర్‌ను నియమించడం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. మున్సిపాల్టీలో రూ. 4 కోట్లకు పైగా నిధులున్నా అభివృద్ధికి అధికారపార్టీ నేతలే అడ్డంకిగా మారారు. కేసులు నమోదైన అధికారులు వీరే.. కయ్యానికి కాలు దువ్వుతున్న చైర్మన్, వైస్‌చైర్మన్ వర్గాలు తమ మాట వినని అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాత కమిషనర్‌గా ఉన్న మురళీకృష్ణను బదిలీ చేయించిన చైర్మన్ వర్గం అజయ్కిషోర్కు పోస్టింగ్ వేయించారు. ఆయన చైర్మన్ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే కోపంతో వైస్ చైర్మన్ వర్గం ఆయనపై ఓ ఎస్సీ కౌన్సిలర్ చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. దీంతో కమిషనర్ అజయ్‌కిషోర్ జైలుపాలై అక్కడ నుంచి వెళ్లిపోయారు. తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్‌ను జైలుకు పంపారనే కక్షతో ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న డీఈ సీతారామారావుపై చైర్మన్ వర్గం ఎస్సీ మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆయనపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం వైస్ చైర్మన్ వర్గం డీఈ కొండారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి ఆయన్నూ బదిలీ చేయించారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు చైర్మన్ వర్గం సైతం కమిషనర్ శ్రీనివాసులుపై శానిటరీ వర్కర్ చేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి సాగనంపారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారి ప్రభాకర్ ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో వైపు అధికారపార్టీ నేతల వేధింపులు తాళలేక ఏడాది కిందట మేనేజర్ మురళీ బదిలీపై వెళ్ళడంతో ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. దీంతో ఆ పోస్టుకు ఎవరూ రాక ఇప్పటికీ ఖాళీగానే ఉంది. పోస్టింగ్‌ల కోసం ఎదురుచేసే అధికారులు సైతం మాచర్ల మున్సిపాలిటీకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. -
అభద్రతా భావంలో చదువులు
► ఎస్వీయూలో పెరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ► ఆందోళన చెందుతున్న విద్యార్థినులు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థినుల చదువులు అభద్రతా భావంలో సాగుతున్నాయి. ప్రొఫెసర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వారు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పరిశోధనలు చేస్తున్న మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎస్వీయూలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలా కాలం నుంచి వస్తున్నాయి. 2011లో జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రాజేశ్వరరావు జైలు పాలయ్యారు. రసాయనశాస్త్ర విభాగంలో ఓ ప్రొఫెసర్‌పై గత ఏడాది డిసెంబర్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇంగ్లిషు విభాగంలో ఓ ప్రొఫెసర్‌పై అదే విభాగానికి చెందిన ఒక పోస్టు డాక్టర్ ఫెలో ఫిర్యాదు చేశారు. సివిల్ ఇంజినీర్ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్‌పై అదే విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని ఫిర్యాదు చేశారు. సాంఖ్యక శాస్త్ర విభాగానికి చెందిన మరో ప్రొఫెసర్‌పై పీజీ విద్యార్థిని సుజాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్యాష్ కమిటీ తన నివేదికను సమర్పించింది. అందులో ఏమి పేర్కొంది ఇంతవరకు బహిర్గతం కాలేదు. తాజాగా తెలుగు అధ్యయన శాఖకు చెందిన కె.మునిరత్నం తన వద్ద ఉన్న పరిశోధక విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఉమెన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రజని ఎస్వీయూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్వీయూ అధికారుల ఆదేశాల మేరకు క్యాష్ కమిటీ ఈనెల 23న విచారణ జరిపింది. విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయన్న అంశాన్ని బహిర్గతం చేయడం లేదు. విద్యార్థినులకు వసతి కల్పించాల్సిన అధికారులే వారిపట్ల నిర్దయగా వ్యవహరించడంతో వారిలో అభద్రత నెలకొంది. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాల్సి ఉంది. ప్రిన్సిపల్‌ను కొనసాగిస్తారా? ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ మునిరత్నం పనిచేస్తున్నారు. ఈయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈయన ప్రిన్సిపాల్‌గా కొనసాగడం వల్ల సాక్షులపై ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సాంఖ్యక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ రాజశేఖరరెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు దక్కాల్సిన ప్రిన్సిపాల్ పదవిని ఇవ్వలేదు. ఇదే సందర్భంలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మునిరత్నంను మాత్రం పదవిలో కొనసాగించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
ఏదీ న్యాయం.!
► గిరిజన యువతిని మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న యువకుడు ► న్యాయం కోసం పోలీస్ సేషన్ల చుట్టూ కాళ్లరిగేలా ► తిరుగుతున్న బాధితురాలు సాక్షి, విశాఖపట్నం : ‘పట్టుకుంటామమ్మా... తొందరపడితే ఎలా... వాడు పారిపోయాడు... నీకేమైనా వాడి ఆచూకీ తెలిస్తే చెప్పు వెళ్లి తీసుకు వస్తాం...’ ఇవీ ఒక యువకుడి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయిన గిరిజన యువతితో బాధ్యత గల పోలీసులు అంటున్న మాటలు. నేను అనాథనని, తనకు ఎవరూ తోడు లేరని, మిమ్మల్నే నమ్ముకున్నానని ఆ యువతి ఎంతగా ప్రాధేయపడుతున్నా ఖాకీల్లో కదలిక రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే... విశాఖ ఏజెన్సీ నర్సీపట్నం ప్రాంతం నుంచి నగరానికి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న మధులత అనే యువతి తనతో పాటు పనిచేసే నారాయణరావు తనను ప్రేమించి వంచించాడని కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆమె పోలీసులను ఆశ్రయించి పదిహేను రోజులు కావస్తున్నా ఇంత వరకూ నిందితుడిని పట్టుకోలేదు సరి కదా కనీసం ఆ అభాగ్యురాలికి భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు. అనాథ గిరిజన యువతికి ఇలాంటి కష్టం వచ్చిందని తెలిసినా ఇంత వరకూ ఏ మహిళా సంఘాలూ ఆమె తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడేందుకు ముందుకు రాలేదు. గిరిజన సంఘాల నేతలు వచ్చి ఒకటి రెండు సార్లు పోలీసు అధికారులను కలవడం తప్ప ఇంత వరకూ పెద్దగా ఉద్యమించింది లేదు. ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం జరగదని, విసిగి వేసారిపోయిన బాధితురాలు ఆత్మహత్యే శరణ్యమంటూ రోధిస్తోంది. ఈ విషయాన్ని ఏసీపీ బి.మోహన్‌రావు వద్ద ప్రస్తావించగా గిరిజన యువతి మధులత కేసులో విచారణ పూర్తయిందని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని తండ్రిని విచారించామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఆత్మహత్యే శరణ్యం ‘‘పోలీసులంటే ఎంతో నమ్మకం. వాళ్ల దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకున్నాను. కానీ ఇన్ని రోజులైనా ఆ దుర్మార్గుడిని పట్టుకోలేదు. ఇప్పటికే చాలా సార్లు ఏసీపీ సర్ని కలిశాను. వైద్య పరీక్షల కోసం మూడు రోజులు కేజీహెచ్‌లో ఉంచారు. రోజూ నన్ను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు తప్ప అతనిపై చర్యలు తీసుకోవడం లేదు. అడిగితే పారిపోయాడంటున్నారు. నీకు టచ్‌లోకి వస్తే మాకు చెప్పు అంటున్నారు. నన్ను మోసం చేసి పోయిన వ్యక్తిని ఎవరూ లేని నేను ఎలా వెతికి తేగలను. ఇప్పటికే జరిగిన అనర్థానికి కుమిలిపోతున్నాను. న్యాయయం జరగకపోతే చచ్చిపోతాను.’- మధులత, బాధితురాలు -
నర్సింగాపురంలో ఉద్రిక్తత
దళిత యువకుడి మరణం పరిస్థితికి కారణం పోలీసుల బందోబస్తు కొత్తకోట : కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామంలో ఓ దళిత యువకుడి మరణం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు. గత ఏడాది ఆగస్టు 15న గ్రామానికి చెందిన బాలకృష(్ణ32) అనే దళిత యువకుడు ఓ ప్రేమజంటకు సహకరించాడన్న ఆరోపణలతో ఆతనిపై అమ్మాయి సంబంధీకులు గ్రామంలో స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని విడిపించారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే మూడు నెలల పాటు వైద్యం పొందిన బాలకృష్ణ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని శవాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. అయితే తన అన్న మరణంపై అనుమానాలున్నాయని, గతంలో జరిగిన దాడి వల్లే ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించాడని తమ్ముడు తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శవాన్ని సాయంత్రం పోస్టుమార్టం కోసం వనపర్తికి తరలించారు. అనంతరం రాత్రి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే పలు దళిత సంఘాల నాయకులు బాలకృష్ణ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. గతంలో దాడి చేసిన వారిపై నమోదు చేసిన హత్యాయత్నం చేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు వెలికి తీసి బాధ్యులను శిక్షించాలని కొత్తకోట అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఇజ్రయిల్, నాయకులు కె.భరత్‌భూషన్, మిషేక్, పి.ప్రశాంత్, మన్నెం, జె.ఆర్.కుమార్, దావీద్, నారాయణ డిమాండ్ చేశారు. -
దళిత ద్రోహి చంద్రబాబు
విజయనగరం మున్సిపాలిటీ : ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా? అంటూ దళితులను కించపరిచేలా వాఖ్య లు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం విజయనగరంలోని అంబేద్కర్ కూడలిలో జరిగిన నిరసన ధర్నాలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్‌కు చేరుకున్న వారు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. మేరుగు నాగార్జున, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి జమ్మాన ప్రసన్నకుమార్‌లు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం దౌర్భాగ్యమన్నారు. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే దళితుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా పాలన సాగించారన్నా రు. తమ పార్టీ అధినేత వైస్జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో దళి తులకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమం లో రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు సోము కోటేశ్వరరావు, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి రేగాన శ్రీనివాసరావు, పట్నాన పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
భూమాకు మధుమేహం, రక్తపోటు
-
భూమాకు మధుమేహం, రక్తపోటు
♦ కర్నూలు వైద్యుల వెల్లడి ♦ హైదరాబాద్‌కు తరలింపుపై నేడు నిర్ణయం సాక్షి, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి.. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భూమాను పోలీసులు అరెస్టు చేసి ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించారు. జైలుకు రాగానే తనకు గుండె నొప్పి ఉందని భూమా చెప్పడంతో వెంటనే ఆయనను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ సుజాత పరీక్షలు నిర్వహించిన తర్వాత భూమాను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని సూచించారు. అయితే ఎస్కార్టు సమస్య ఉందంటూ పోలీసులు ఆమె సూచనను తిరస్కరించారు. దీంతో భూమా జైల్లోనే నిరసన దీక్షకు దిగారు. శనివారం రాత్రి ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షల తర్వాత ఆయనను కర్నూలు జిల్లా అస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి పేయింగ్ బ్లాక్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం వైద్యులు మరోసారి భూమాకు వైద్య పరీక్షలు నిర్వహించంతో రక్తపోటు 180/110, పాస్టింగ్ బ్లడ్‌షుగర్ 168 ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. మధ్యాహ్నం ఆయనకు కడుపునొప్పి రావడంతో మరోమారు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతి స్విమ్స్‌కుగానీ, హైదరాబాద్‌లోని నిమ్స్ లేక కిమ్స్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ల బృందం వెల్లడించింది. అయితే దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. భూమా ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. -
పోలీసుల ఉదాసీనతపై కలెక్టర్ మండిపాటు
సంగారెడ్డి క్రైం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో పోలీసులు ప్రదర్శిస్తున్న ఉదాసీనత వైఖరిపై కలెక్టర్ రాహుల్ బొజ్జా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేసి తమ పని అయిపోయిందనే తరహా ప్రవర్తన సరికాదని ఆయన పోలీసు అధికారులను మందలించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అత్యాచారాలు, హత్యలు, ఇతరత్రా కేసుల విషయమై చట్ట ప్రకారం నమోదు చేసి విచారణ కొనసాగించాలని, వాస్తవమని తేలితే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేసులను సత్వరమే పరిష్కారమయ్యేలా చట్ట పరిధిలో బాధితులకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి గతేడాది ఆగస్టులో నమోదైతే నిందితుడిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని డీఎస్పీ సురేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ వారం రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేస్తామని సమాధానం ఇవ్వగా.. ఏడాది సాధ్యం కానిది వారం రోజుల్లో ఎలా సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఆశామాషీగా తీసుకోకుండా కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. 90 శాతం ఫాల్స్ కేసులే : డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు దాదాపు 90 శాతం ఫాల్స్ ఫిర్యాదు లేనని తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కేసును తాము నమోదు చేసుకుని విచారణ చేసే లోగానే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఫిర్యాదుదారులు రాజీ కుదుర్చుకుంటున్నారని అన్నారు. బహిరంగంగా అందరి ముందు కులం పేరుతో దూషిస్తేనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే బలపడుతుందని, ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో కేసులు నిలబడడం లేదన్నారు. ఇందుకు ఎస్పీ సుమతి స్పందిస్తూ కేసు నమోదు సమయంలోనే ఫిర్యాదు నిజమైనదా? కాదా? అని తెలుస్తుందని, అయినప్పటికీ ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలని సూచించారు. కేసు విచారణ మాత్రం పారదర్శకంగా, న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పారు.