Staffing
-
ఉద్యోగులకు డిమాండ్..భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: కాంట్రాక్టు కార్మికులు (ఫ్లెక్సీ స్టాఫ్) 2.27 లక్షల మందికి గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఉపాధి కల్పించినట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వార్షిక నివేదిక వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్, తయారీ, హెల్త్‌కేర్, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలు ఉపాధికి దన్నుగా నిలిచాయని పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫ్లెక్సీ స్టాఫ్‌కు డిమాండ్ 3.6 శాతం పెరిగినట్టు తెలిపింది. అన్ని రంగాల్లోనూ డిజిటల్ దిశగా మార్పులను స్వీకరించడం ఉపాధికి అవకాశం కల్పించినట్టు పేర్కొంది. 2022– 23లో ఫిన్‌టెక్, ఐటీ–ఇన్ఫ్రా, ఐటీ/ఐటీఈఎస్ రంగాలు కాంట్రాక్టు కార్మికులకు ఎక్కువగా ఉపాధినిస్తాయని తెలిపింది. ఇండియన్ స్టాఫింగ్ సమాఖ్య పరిధిలోని కంపెనీలు 2021–22లో 2.27 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాయని.. దీంతో మొత్తం కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 12.6 లక్షల మందికి చేరినట్టు నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మాదిరే 2021–22లోనూ ఉద్యోగుల్లో మహిళల వాటా 27 శాతంగా ఉందని తెలిపింది. తాత్కాలిక, పరిమిత సమయం పాటు పనిచేసే వారిని ఫ్లెక్సీ స్టాఫ్‌గా పరిగణిస్తారు. యువతే ఎక్కువ ఫ్లెక్సీస్టాఫ్కు అధిక శాతం అవకాశాలు బహిరంగ విక్రయాల నుంచి, తప్పనిసరి ఉత్పత్తుల డెలివరీకి మళ్లినట్టు ఈ నివేదిక వివరించింది. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 25–30 ఏళ్ల వయసులోని వారు 40 శాతం మేర ఉన్నారు. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 31–45 ఏళ్ల వయసులోని వారి ప్రాతినిధ్యం 10 శాతం మేర పెరిగింది. ‘‘2021–22 ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమకు అసాధారణం అని చెప్పుకోవాలి. ఉద్యోగులకు డిమాండ్ 21.9 శాతం (2.27 లక్షలు) పెరిగింది.. ఉద్యోగులు, ఉద్యోగ సంస్థలు కరోనా ప్రభావం నుంచి బయటకు వచ్చి, భవిష్యత్తును నిర్మించుకునేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది’’అన ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న్పటికీ, 2022–23 ఆరంభం సంకేతాలను గమనిస్తే రానున్న మూడు త్రైమాసికాల్లోనూ ఉద్యోగుల నియామకాలకు డిమాండ్ కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేశారు. ఇతర ఉపాధి విభాగాలతో పోలిస్తే ఫ్లెక్సీస్టాఫ్కు డిమాండ్ 10 శాతం పెరుగుతుందని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. -
ఖాళీగానే... కమిషనరేట్
ఏడాది గడుస్తున్నా రూపుదిద్దుకోని వ్యవస్థ పోలీస్ కమిషనర్ నియూమకంతోనే సరిపెట్టిన ప్రభుత్వం సరిపడా లేని సిబ్బంది.. తగ్గని నేరాలు మౌలిక సౌకర్యాల కల్పనలోనూ జాప్యం హన్మకొండ : వరంగల్‌లో పోలీసు కమిషనరేట్ వ్యవస్థ పూర్తిస్థారుులో రూపుదిద్దుకోవడం లేదు. కమిషనరేట్‌గా ప్రకటించి ఏడాది గడుస్తున్నా.. అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మౌలిక వసతుల కల్పన, కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు విషయాల పరిస్థితీ ఇలాగే ఉంది. పోలీసు శాఖ పరంగా గతంలో వరంగల్ అర్బన్‌గా ఉన్న ప్రాంతాన్ని వరంగల్ పోలీసు కమిషనరేట్‌గా ప్రకటిస్తూ 2015 జనవరి 25న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు కమిషనరేట్‌గా ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో 13,09,848 జనాభా ఉందని.. ఏటా సగటున 8,768 నేరాలు నమోదవుతున్నాయని పేర్కొంది. న్యాయపరమైన ప్రక్రియను వెంటనే ముగించి పూర్తిస్థాయిలో కమిషరేట్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఉత్తర్వులు వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ దిశ గా నిర్ణయాలు ఏమీ జరగడం లేదు. వరంగల్ అ ర్బన్ ఎస్పీ కార్యాలయం స్థానంలో కమిషనరేట్ అని, డీఎస్సీ కార్యాలయాలు ఉన్న బోర్డుల స్థానంలో అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌గా పేర్లు మాత్రమే మార్చా రు. కీలకమైన అధికారాల బదిలీ ప్రక్రియ జరగడం లేదు. పోలీసు శాఖకు సంబంధించి బదిలీలు, నియామకాలు వంటి అధికారాలు సైతం అదనపు డెరైక్టర్ జనరల్ ఆధీనంలోనే ఉన్నాయి. అధికారాల బదలాయింపు జరగకపోవడంతో పోలీసు కమిషరేట్ ఏర్పాటుకు అర్థంలేకుండా పోతోందని పలువురు పోలీసు లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. వసతుల కల్పనలోనూ అంతే.. వరంగల్ పోలీసు కమిషరేట్‌కు అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రక్రియ కూడా ముందుకుసాగడం లేదు. కమిషరేట్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాల కల్పనను వేగంగా పూర్తి చేస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ కొన్ని నెలల క్రితం వరంగల్‌లో ప్రకటించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్, వరంగల్ రూరల్ ఎస్పీ కార్యాలయాలు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్‌లోనే కొనసాగుతున్నాయి. దీం తో భవనాలు, ఇతర మౌలిక సదుపాయల పరంగా ఇబ్బంది కలుగుతోంది. మరోవైపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు సిబ్బంది లేరు. దీంతో నేరాల సంఖ్య తగ్గడం లేదు. వరంగల్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 పోలీసు స్టేషన్లు ఉన్నా యి. మరో ఐదు కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కమిషనరేట్‌గా ప్రకటించగానే ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు పక్రియ కాగితాలకే పరిమితమవుతోంది. అవసరమైన నిధులు లేకపోవడం, పరిపాలన అనుమతుల్లో జాప్యం కారణంగా భవనాల నిర్మాణం మొదలవడం లేదు. భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని జిల్లా అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. కానీ, నిధులు మంజూరవడం లేదు. వరంగల్ రూరల్ పోలీసు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో స్పష్టత రాలేదు. ఇదీ కొత్త భవనాల నిర్మాణానికి అడ్డంకిగా మారుతోంది. ఇలాంటి అడ్డంకులను తొలగించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.