ఉదయం 8 గంటలకే రిజిస్టార్ కార్యాలయాలు
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పెరుగుతున్న దస్తావేజుల నమోదు తాకిడిని అధిగమించేందుకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సిద్దమవుతోంది. ఉద్యోగులు, ఇతర పనుల్లో బిజీగా ఉండే వారికి వెసులుబాటుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పనివేళలు ఉండే విధంగా చర్యలు చేపడుతోంది.
అందులో భాగంగా హైదరాబాద్ రిజిస్ట్రేషన్ పరిధిలోని బోయిన్పల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేసి పెలైట్ ప్రాజెక్టుల ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విధానంలో రోజుకు రెండేసి షిఫ్టులుగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు సేవలందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అమలులో ఉన్న కారణంగా ఒక రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో రెండు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కడైన రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునేందుకు దస్తావేజు దారులకు వెసులు బాటు ఉంటుంది.