రక్త పరీక్షతో కేన్సర్ నిర్ధారణ
వాషింగ్టన్: వివిధ రకాల కేన్సర్లు, అవి ఏ స్థాయిలో ఉన్నాయన్నది నిర్ధారించేందుకుగాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ సులభమైన రక్తపరీక్ష పద్ధతిని అభివృద్ధిపర్చారు. సాధారణంగా చికిత్స చేయకున్నా కే న్సర్ కణాలు విభజన చెందుతూ, నశిస్తూ ఉంటాయి. కేన్సర్ కణాలకు సంబంధించిన డీఎన్ఏ రక్తంలో క లుస్తూ ఉంటుంది.
రక్తపరీక్షలో ఆ డీఎన్ఏను విశ్లేషించడం ద్వారా అది ఏ రకమైన కేన్సర్ వ్యాధో, ఏ స్థాయిలో ఉందో కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘కేన్సర్ పర్సనలైజ్డ్ ప్రొఫైలింగ్ బై డీప్ సీక్వెన్సింగ్ (సీఏపీపీ-సెక్)’ అనే ఈ పద్ధతి ద్వారా పలువురు రోగుల్లో వివిధ కేన్సర్లను గుర్తించామని వారు వెల్లడించారు.