star wrestlers
-
భళా... బజరంగ్
ఆస్టిన్ (అమెరికా): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఈ ఏడాదిని స్వర్ణ పతకంతో ముగించాడు. అమెరికాలోని ఆస్టిన్ నగరంలో జరిగిన ఫ్లో రెజ్లింగ్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ క్లబ్ టోర్నీలో బజరంగ్ విజేతగా నిలిచాడు. 68 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ హరియాణా రెజ్లర్ అజేయంగా నిలిచాడు. ఎనిమిది మంది రెజ్లర్ల మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ ఈవెంట్లో బజరంగ్ బరిలోకి దిగిన మూడు బౌట్లలో గెలుపొందాడు. ముందుగా క్వార్టర్ ఫైనల్లో 6–1తో ప్యాట్ లుగో (అమెరికా)పై నెగ్గిన బజరంగ్... సెమీఫైనల్లో 9–0తో ఆంథోనీ యాష్నాల్ట్ (అమెరికా)ను ఓడించాడు. ఫైనల్లో బజరంగ్ 8–4తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత జేమ్స్ గ్రీన్ (అమెరికా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్ ముగిసేసరికి ఇద్దరూ 4–4తో సమఉజ్జీగా ఉండగా... రెండో రౌండ్లో బజరంగ్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా నాలుగు పాయింట్లు గెలిచాడు. విజేతగా నిలిచిన బజరంగ్‌కు 25 వేల డాలర్లు (రూ. 18 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. బజరంగ్ రెగ్యులర్‌గా 65 కేజీల విభాగంలో... జేమ్స్ గ్రీన్ 70 కేజీల విభాగాల్లో పోటీపడతారు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. -
‘పట్టు’ పట్టండి...
నేటి నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ బరిలో స్టార్ రెజ్లర్లు న్యూఢిల్లీ: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్ సిద్ధమైంది. క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ లీగ్‌ల సరసన తాజాగా రెజ్లింగ్ లీగ్ చేరింది. భారత్‌తోపాటు పలువురు విదేశీ స్టార్ రెజ్లర్లు బరిలో దిగుతుండగా... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు గురువారం తెర లేవనుంది. ఈనెల 27న ముగిసే ఈ లీగ్‌లో విజేత జట్టుకు రూ. 3 కోట్లు అందజేస్తారు. తొలి రోజున ఢిల్లీ వీర్‌తో పంజాబ్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ రెండు జట్లతోపాటు హరియాణా హ్యామర్స్, ఉత్తరప్రదేశ్ వారియర్స్, బెంగళూరు యోధాస్, ముంబై గరుడ జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. భారత స్టార్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, అమిత్ దహియా హరియాణా జట్టులో, సుశీల్ కుమార్ ఉత్తరప్రదేశ్ జట్టులో, నర్సింగ్ యాదవ్, బజరంగ్ బెంగళూరు జట్టులో ఉన్నారు. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ప్రతి జట్టులో ఐదుగురు పురుష రెజ్లర్లు, నలుగురు మహిళా రెజ్లర్లు ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో తొమ్మిది బౌట్లు ఉంటాయి. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఉత్తరప్రదేశ్ వారియర్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ వీర్ ్ఠ పంజాబ్ రాయల్స్ నేటి రాత్రి గం. 7.00 నుంచి సోనీ మ్యాక్స్, సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం.